అన్వేషించండి

Hrithik Roshan: మూడు కోట్ల కారు కొన్న హృతిక్ రోషన్ - అంత స్పెషల్ ఏముంది ఇందులో?

Range Rover Autobiography: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొన్నాడు.

Hrithik Roshan Buy Range Rover: ల్యాండ్ రోవర్ లాంచ్ చేసిన కొత్త తరం రేంజ్ రోవర్ అందరికీ ఇష్టమైనదిగా మారుతోంది. బడా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కలెక్షన్లలో ఈ కారు చేరిపోతోంది. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు, గ్రీక్ గాడ్ అని అభిమానులు పిలుచుకునే హృతిక్ రోషన్ కూడా ఈ కారును కొనుగోలు చేశారు. హృతిక్ రోషన్ ల్యాండ్ రోవర్‌లో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్‌ను కొనుగోలు చేశాడు. ఈ కొత్త తరం రేంజ్ రోవర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.16 కోట్లు కావడం విశేషం.

ఆటోబయోగ్రఫీ వేరియంట్‌ని కొన్న గ్రీక్ గాడ్...
రేంజ్ రోవర్ ప్రపంచంలోని లగ్జరీ వాహనాలల్లో ఒకటి. హృతిక్ రోషన్ ఈ కారును సెంటోర్నీ బ్లాక్ షేడ్‌లో కొనుగోలు చేశాడు. దీని ఇంటీరియర్ టాన్ ఫినిష్‌తో రానుంది. ఇది లగ్జరీ ఎస్‌యూవీకి సంబంధించిన లాంగ్ వీల్ బేస్ ఆటోబయోగ్రఫీ వేరియంట్. దాని రెండో వరుసలో లెగ్‌రూమ్ స్థలం పుష్కలంగా ఉంది. హృతిక్ రోషన్ కొనుగోలు చేసిన కారు రేంజ్ రోవర్ ఐదో తరం ఎస్‌యూవీ మోడల్.

రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఫీచర్లు ఇవే...
హృతిక్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్‌లో 3.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఆయిల్ బర్నర్ ఉంది. ఇది 346 బీహెచ్‌పీ పవర్‌ని, 700 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అవుట్‌ పుట్ నుంచి పవర్ దాని అన్ని చక్రాలకు చేరుకుంటుంది. ఈ వాహనంలో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. రేంజ్ రోవర్ లాంచ్ చేసిన ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 234 కిలోమీటర్లు కావడం విశేషం.

హృతిక్ రోషన్ కొనుగోలు చేసిన రెండో రేంజ్ రోవర్ కారు ఇది. హృతిక్ కొన్నాళ్ల క్రితం ఇందులోనే పాత మోడల్‌ను కొనుగోలు చేశాడు. హృతిక్ సేకరణలో చాలా ఖరీదైన, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. అతని లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ సెకండ్, మినీ కూపర్, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ సహా మరెన్నో ఉన్నాయి. ఇప్పుడు హృతిక్ కలెక్షన్‌లో మరో రేంజ్ రోవర్ కారు కూడా చేరింది.

‘వార్ 2’లో బిజీగా...
మరోవైపు హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. ఈ చిత్రంతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్‌గా సాగుతోంది. హృతిక్ రోషన్ ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ‘దేవర’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కూడా బ్రేక్ తీసుకోకుండా ‘వార్ 2’ షురూ చేయనున్నాడు. 2025 ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Embed widget