అన్వేషించండి

Honda Bikes Price Cut: హోండా బైక్‌లు, స్కూటర్లు కొనడం ఇంకా ఈజీ, రూ.19,000 వరకు ఆదా - ఇదిగో లిస్ట్‌

Honda Two Wheeler Price Cut: హోండా బైక్‌లు, స్కూటర్‌లపై గరిష్టంగా రూ.18,887 వరకు ధర తగ్గింపు. ఆక్టివా, షైన్ 125, యూనికార్న్‌, CB350 మోడళ్లకు లాభం.

Honda Bikes, Scooters Price Cut After GST: దేశంలో కొత్త GST రేట్లతో హోండా బైక్‌లు, స్కూటర్‌ల ధరలు భారీగా తగ్గాయి. జపాన్‌ టూ-వీలర్‌ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI), తమ మోస్ట్‌ పాపులర్‌ మోడళ్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, కస్టమర్లు గరిష్టంగా రూ. 18,887 వరకు (ఎక్స్‌షోరూం ధరలపై) ప్రయోజనం పొందవచ్చు.

GST తగ్గింపుతో వచ్చిన మార్పులు
ఇంతకుముందు, 350cc లోపు ఉన్న బైక్‌లు, స్కూటర్‌లపై 28% GST వసూలు చేయగా, ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం అది 18% కి తగ్గింది. ఈ తగ్గింపుతో హోండా కమ్యూటర్‌ బైక్‌లు, స్కూటర్‌లు చౌకయ్యాయి. ఆక్టివా, షైన్ 125, యూనికార్న్‌, CB350 వంటి మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రజాదరణ పొందిన మోడళ్లపై లాభం
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే హోండా ఆక్టివా స్కూటర్ ధర తగ్గడం, స్కూటర్‌ కొనాలనుకునే వారికి పెద్ద ప్లస్‌. అదే విధంగా షైన్ 125 & యూనికార్న్‌ వంటి బైక్‌లు మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే మోడళ్లు కావడంతో వీటిపై ధర తగ్గడం ఈ పండుగ సీజన్‌లో పెద్ద బెనిఫిట్‌ అవుతుంది. యువతను కొత్తగా ఆకట్టుకుంటున్న Honda CB350 కూడా ఈ తగ్గింపు ప్రయోజనం కిందకు వచ్చింది.

ఏ మోడల్‌పై ఎంత తగ్గుతుంది?

మోడల్‌

GST ప్రయోజనం (ఎక్స్‌షోరూం ధరపై)  

Honda Activa 110

రూ. 7,874 వరకు 

Honda Dio 110

రూ. 7,157 వరకు 

Honda Activa 125

రూ. 8,259 వరకు 

Honda Dio 125

రూ. 8,042 వరకు 

Honda Shine 100

రూ. 5,672 వరకు 

Honda Shine 100 DX

రూ. 6,256 వరకు 

Honda Livo 110

రూ. 7,165 వరకు 

Honda Shine 125

రూ. 7,443 వరకు 

Honda SP125

రూ. 8,447 వరకు 

Honda CB125 Hornet

రూ. 9,229 వరకు 

Honda Unicorn

రూ. 9,948 వరకు 

Honda SP160

రూ. 10,635 వరకు 

Honda Hornet 2.0

రూ. 13,026 వరకు 

Honda NX200

రూ. 13,978 వరకు 

Honda CB350 H'ness

రూ. 18,598 వరకు 

Honda CB350RS

రూ. 18,857 వరకు 

Honda CB350

రూ. 18,887 వరకు 

పెద్ద బైక్‌లకు షాక్‌
అయితే, 350cc పైబడిన బైక్‌ల పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. వాటిపై GST రేటు 31% నుంచి 40% కి పెరగడంతో వాటి ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా, హోండా దిగుమతి చేసుకునే ప్రీమియం బైక్‌లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కంపెనీ ఇప్పటివరకు కొత్త ధరలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ధరలు పెరగడం మాత్రం ఖాయం.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో హోండా టూ వీలర్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఆక్టివా స్కూటర్‌ నుంచి యూనికార్న్‌ బైక్‌ వరకు హోండా మోడళ్లు ఫ్యామిలీల నుంచి యంగ్‌స్టర్స్‌ వరకు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ధర తగ్గడంతో వాటి కొనుగోలు మరింత సులభం అవుతుందని డీలర్లు చెబుతున్నారు.

GST తగ్గింపుతో హోండా బైక్‌లు, స్కూటర్‌లు చౌకగా మారడం తెలుగు ప్రజలకు మంచి వార్త. ముఖ్యంగా.. ఆక్టివా, షైన్ 125, యూనికార్న్‌, CB350 మోడళ్లు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. అయితే 350cc కంటే ఎక్కువ ఇంజిన్‌ ఉన్న బైకుల విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget