అన్వేషించండి

హారియర్ నుంచి పంచ్ వరకు - భారత్ NCAPలో 5-స్టార్ సాధించిన టాప్‌-5 SUVలు

Safest Cars India 2025: భారత్ NCAP టెస్టుల్లో 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన టాప్‌ 5 SUVలు ఇవే. టాటా, మహీంద్రా, మారుతి మోడల్స్‌ సేఫ్టీ ఫీచర్లు, స్కోర్లు, ప్రత్యేకతల వివరాలు తెలుసుకోండి.

Bharat NCAP Top 5 Safest Cars 2025: కొన్నేళ్ల క్రితం వరకు, కారు కొనే ముందు చాలా మంది చూసే ఫీచర్లు - డిజైన్‌, టెక్నాలజీ, మైలేజీ. ఇప్పుడు, వాటికంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్న అంశం సేఫ్టీ. ఎందుకంటే రోడ్లపై ట్రాఫిక్‌, వేగం, ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను అంచనా వేయడానికి భారత్ NCAP (New Car Assessment Programme)ని 2023లో లాంచ్‌ చేశారు. ఇది గ్లోబల్‌ NCAPతో సమానమైన టెస్టింగ్‌ స్టాండర్డ్స్‌తో, మన మార్కెట్లో అమ్ముడవుతున్న కార్లను కఠినమైన పరిస్థితుల్లో పరీక్షిస్తుంది. ఇప్పటి వరకు 21 కార్లు టెస్ట్‌ చేశారు. వాటిలో 5 SUVలు అత్యధికంగా 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ సాధించి, టాప్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

5. టాటా పంచ్ EV

AOP స్కోర్‌: 31.46/32

టాటా పంచ్ EV, భారత్ NCAPలో టెస్ట్‌ చేసిన తొలి ఎలక్ట్రిక్‌ కార్లలో ఒకటి. చిన్న సైజ్‌లో ఉండే ఈ కారు యువతలో ఎక్కువ పాపులర్‌. కేవలం లుక్స్‌ మాత్రమే కాదు, సేఫ్టీ విషయంలోనూ ఇది అగ్రగామిగా నిలిచింది.

  • టాటా పంచ్ EV సేఫ్టీ ఫీచర్లు:
  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • ESP (ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌)
  • హిల్‌ హోల్డ్ కంట్రోల్‌
  • ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
  • రియర్ పార్కింగ్ సెన్సార్లు
  • TPMS (టైర్‌ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్‌)

4. మారుతి విక్టోరిస్

AOP స్కోర్‌: 31.66/32

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా లాంచ్‌ అయిన మారుతి విక్టోరిస్, 2025 సెప్టెంబర్‌లో టెస్ట్‌ చేసి వెంటనే 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. ఇది మారుతి గ్రాండ్‌ విటారాకు సిబ్లింగ్‌. మిడ్‌-సైజ్‌ SUV కావడంతో పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది.

సేఫ్టీ ఫీచర్లు:

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • అన్ని సీట్లకు 3-పాయింట్‌ సీట్‌బెల్ట్స్‌ & రిమైండర్స్‌
  • ESC (ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌)
  • ISOFIX యాంకర్లు

ZX+ & ZX+(O) వేరియంట్స్‌లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌) కూడా అందుబాటులో ఉంటుంది

3. మహీంద్రా BE 6

AOP స్కోర్‌: 31.97/32

మహీంద్రా BE సిరీస్‌లో వచ్చిన BE 6 ఒక బోర్న్ EV. అంటే, మొదటి నుంచే ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌తో తయారైంది. స్టైల్‌ పరంగా మోడ్రన్‌గా, సేఫ్టీ పరంగా అద్భుతంగా ఉంది.

సేఫ్టీ ఫీచర్లు:

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • రియర్ కెమెరా
  • పార్కింగ్ సెన్సార్లు
  • TPMS
  • డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ సిస్టమ్‌

2. మహీంద్రా XEV 9e

AOP స్కోర్‌: 32/32

ఈ SUV, Bharat NCAPలో పూర్తి స్కోర్ సాధించిన మొదటి కార్లలో ఒకటి. కూపే SUV లుక్స్‌తో కాస్త స్టైలిష్‌గా కనిపించే ఈ కారు, సేఫ్టీ విషయంలో మాత్రం టాప్‌ లెవెల్‌లో ఉంది.

సేఫ్టీ ఫీచర్లు:

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌ (బేస్ వేరియంట్ నుంచే)
  • ISOFIX యాంకర్లు
  • రియర్ డిస్క్ బ్రేకులు
  • TPMS

ఈ SUV మొత్తం లైనప్‌కి ఇదే సేఫ్టీ రేటింగ్‌ వర్తిస్తుంది.

1. టాటా హారియర్ EV

AOP స్కోర్‌: 32/32

2025 జూన్‌లో టెస్టింగ్‌ జరిగిన టాటా హారియర్ EV, Bharat NCAPలో అత్యధిక మార్కులు సాధించింది. పవర్‌ఫుల్‌ డిజైన్‌, ప్రీమియం ఫీచర్లతో పాటు భద్రతలోనూ ఎలాంటి రాజీ లేకుండా దీనిని రూపొందించారు.

సేఫ్టీ ఫీచర్లు:

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • అన్ని సీట్లకు 3-పాయింట్‌ సీట్‌బెల్ట్స్‌ & రిమైండర్స్‌
  • ESC
  • ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు

ఈ టాప్‌ 5 SUVలు ఒకటే చెబుతున్నాయి - ఇప్పుడు కారు అంటే కేవలం స్టైల్‌, పవర్‌ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా. EV మార్కెట్‌లో బోర్న్ EVలు (Mahindra BE 6, XEV 9e, Tata Harrier EV) యువతకు బెస్ట్ ఆప్షన్లు. బడ్జెట్‌ రేంజ్‌లో చూడాలనుకుంటే Maruti Victoris, Punch EV మంచి ఎంపికలు. ప్రతి ఫ్యామిలీ సురక్షిత ప్రయాణాన్ని ముఖ్యమని దృష్టిలో పెట్టుకుంటే, ఇవి రోడ్డుపై అత్యంత విశ్వసనీయ SUVలు అని చెప్పవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget