Honda Activa vs TVS Jupiter: ఏ బండికి స్పీడ్ ఎక్కువ? బ్రేకింగ్‌లో ఏది కింగ్? పెర్ఫార్మెన్స్ టెస్ట్ పూర్తి వివరాలు
Honda Activa & TVS Jupiter స్కూటర్లను వేగం, రోల్ ఆన్ యాక్సిలరేషన్ & బ్రేకింగ్ ద్వారా ఎక్స్‌పర్ట్స్ పరీక్షించి చూశారు. దేని రైడ్ బెటర్ అనేది ఇక్కడ క్లారిటీగా తెలుసుకోండి.

Honda Activa & TVS Jupiter Scooter Speed Test: మన మార్కెట్‌లో, స్కూటర్ సెగ్మెంట్‌లోని బెస్ట్ స్కూటర్ల గురించి మాట్లాడితే Honda Activa, TVS Jupiter పేర్లు తప్పక వినిపిస్తాయి. సంవత్సరాలుగా ఆక్టివా మార్కెట్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతుంటే, ఫీచర్ల పరంగా తన ప్రత్యేకతతో జూపిటర్ కూడా బలమైన పోటీ ఇస్తోంది. తాజా మోడళ్లలో, ఈ రెండింటిలోనూ కొన్ని కీలక అప్‌డేట్స్ వచ్చాయి. పేపర్‌పై కాకుండా, నిజమైన పనితీరు పరంగా ఏ స్కూటర్ బెస్ట్?. వేగం, రోల్ ఆన్ యాక్సిలరేషన్, బ్రేకింగ్ టెస్ట్‌లలో ఏది ముందుంది?.
యాక్సిలరేషన్ టెస్ట్: ఏది ఫాస్ట్?
ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌లు ఈ రెండు స్కూటర్లను పొడిగా ఉన్న రోడ్డుపై పరీక్షించారు. స్టార్ట్ అయినప్పుడు ఈ రెండింటి స్టెబిలిటీ బాగుంది. 40 km/h వరకు వెళ్లేందుకు Honda Activa, TVS Jupiter రెండూ దాదాపు 3.5 సెకన్లు తీసుకున్నాయి. అయితే 60 km/h వరకు స్పీడ్ పికప్‌లో TVS Jupiter కొంచం త్వరగా రీచ్ అయింది. కానీ 80 km/h స్పీడ్ అందుకోవడంలో Honda Activa 0.39 సెకన్ల (అర సెకను కన్నా తక్కువ వ్యత్యాసం) ముందంజలో నిలిచింది. ఈ టైమ్ డిఫరెన్స్‌ను రియల్ వరల్డ్‌లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా, హైయ్యర్ స్పీడ్స్‌లో Jupiter ఇంజిన్ మరింత స్మూత్‌గా, తక్కువ ప్రెషర్‌తో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.
రోల్-ఆన్ యాక్సిలరేషన్: ఓవర్‌టేక్‌లో ఏది బెస్ట్?
జూపిటర్ కొత్తగా తీసుకొచ్చిన iGo టార్క్ అసిస్ట్ ఫీచర్ దీని ప్రధాన ప్లస్ పాయింట్. ఇది అదనంగా 0.6 Nm టార్క్ బూస్ట్ అందిస్తుంది. ఫలితంగా 20-50 km/h & 30-70 km/h రోల్-ఆన్ యాక్సిలరేషన్ టెస్ట్‌లలో Jupiter కొంచెం త్వరగా స్పందించింది. Honda Activa ఈ రెండింటిలో దాదాపు 0.5 సెకన్ల వెనుకబడింది. అంటే, ట్రాఫిక్‌లో ఒక్కసారిగా ఓవర్‌టేక్ చేయాల్సిన సందర్భాల్లో Jupiter మరింత వెంటనే స్పందించే అవకాశం ఉంది.
బ్రేకింగ్ టెస్ట్: ఏది స్టేబుల్‌గా ఆగింది?
TVS Jupiterలో డిస్క్ బ్రేక్ వేరియంట్ అందుబాటులో ఉంది. కానీ Honda Activa ఇంకా కేవలం డ్రమ్ బ్రేక్ సెటప్ నే ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో కూడా Activa బ్రేకింగ్ పనితీరు ఆశ్చర్యపరిచేలా ఉంది. ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ ఉన్నప్పటికీ, ఇది స్టేబుల్‌గా నిలిచిపోయింది. స్కిడ్ అవ్వకుండా టైర్లు మంచి గ్రిప్ ఇచ్చాయి. Jupiterలో డిస్క్ బ్రేక్ కాబట్టి మొదట కాస్త షార్ప్‌గా ఉంది. కానీ, రియర్ బ్రేక్ ఈజీగా లాక్ అవుతోంది. పరీక్షలో ఈ రెండు స్కూటర్లు కూడా దాదాపు 18.5 మీటర్లలో పూర్తిగా ఆగిపోయాయి. అంటే మొత్తం బ్రేకింగ్ పరంగా రెండింటి పనితీరు దాదాపు సమానంగా ఉంది.
స్పెసిఫికేషన్స్ & ధరలు: ఏది వాల్యూ ఫర్ మనీ?
Honda Activa టాప్ వేరియంట్ ధర ₹87,944. ఇందులో కొత్తగా వచ్చిన TFT స్క్రీన్ ఉంది, కానీ ఫ్రంట్ డిస్క్ ఆప్షన్ మాత్రం ఇంకా ఇవ్వలేదు.
TVS Jupiterలో పెద్ద 12-అంగుళాల రియర్ వీల్ ఉంది, బూట్‌స్పేస్ 33 లీటర్లు, అలాగే iGo టార్క్ అసిస్ట్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ధర పరంగా Jupiter కొంచెం బెటర్‌గా ఉంటుంది.
ఎక్కువ ఫీచర్లు, మంచి ఓవర్‌టేకింగ్ రెస్పాన్స్ కావాలనుకునేవారికి TVS Jupiter మంచి ఆప్షన్. స్టేబుల్ రైడింగ్, స్మూత్ పనితీరు, బ్రాండ్ రీలయబిలిటీ కోరేవారికి Honda Activa మంచి స్కూటర్‌గా ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















