అన్వేషించండి

Honda Activa vs TVS Jupiter - స్టైల్‌ & మైలేజ్ కోసం ఏ స్కూటర్ కొనడం మంచిది?

Best mileage scooter 2025: మీరు టీవీఎస్ జూపిటర్ లేదా హోండా యాక్టివా కొనాలని ప్లాన్ చేస్తుంటే, మైలేజ్‌ మీకు ప్రాధాన్యత అయితే, ఈ రెండు స్కూటర్ల మైలేజ్ గురించి మొదట తెలుసుకోండి.

Honda Activa vs TVS Jupiter Mileage Comparison: మోడరన్‌ స్కూటర్లు మన రోజువారీ ప్రయాణాన్ని సులభంగా మార్చాయి. తెలుగు రాష్ట్రాల్లో, ఆధునిక ఫీచర్లున్న చాలా స్కూటర్లు అందుబాటులో ఇప్పుడు ఉన్నాయి. కాలం ఎంత మారినా, ప్రజలు ఎక్కువగా మెరుగైన మైలేజ్ & తక్కువ ధర కలిగిన స్కూటర్లను (Cheap and Best Scooter) కొనడానికి ఇష్టపడతారు. హోండా యాక్టివా & టీవీఎస్ జూపిటర్ రెండూ "చీప్‌ అండ్‌ బెస్ట్‌" స్కూటర్లు & ఆంధ్ర, తెలంగాణలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు.

ఈ పండుగ సమయంలో, మీరు ఈ రెండు స్కూటర్లలో ఒకదానిని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా ఈ రెండింటి ధర & ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకోండి. తద్వారా మీకు ఏ స్కూటర్ సరైనదో మీరే నిర్ణయించుకోవచ్చు.

హోండా యాక్టివా
హోండా యాక్టివా మెరుగైన మైలేజీని ఇచ్చే టూవీలర్‌. ఈ స్కూటర్‌లో 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఉంది. ఆటోమేటిక్ (V-matic) ట్రాన్స్‌మిషన్ కూడా ఈ స్కూటర్ ఇంజిన్‌తో అనుసంధానమై ఉంది. యాక్టివాలో అమర్చిన ఈ ఇంజిన్ 5.77 kW శక్తిని ఇస్తుంది & 8.90 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ హోండా స్కూటర్ వీల్‌బేస్ 1260 mm & గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm.

మైలేజ్ & ధర
హోండా యాక్టివా లీటర్ కు 51.23 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.3 లీటర్లు. ట్యాంకును పూర్తిగా నింపిన తర్వాత, ఈ స్కూటర్‌ను దాదాపు 270 కిలోమీటర్లు నడపవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో హోండా యాక్టివా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,173. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 1,11,000. నగరాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప తేడా ఉండవచ్చు.

టీవీఎస్ జూపిటర్
టీవీఎస్ జూపిటర్‌లో సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ ఉంది. స్కూటర్‌లోని ఈ ఇంజిన్ 6,500 rpm వద్ద 5.9 కిలోవాట్ల శక్తిని & 5,000 rpm వద్ద 9.8 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ స్కూటర్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ ద్విచక్ర వాహనం ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్ & వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్‌ ఇచ్చారు.

మైలేజ్ & ధర
ARAI సర్టిఫై చేసిన ప్రకారం, టీవీఎస్ జూపిటర్ మైలేజ్ లీటర్ కు 53 కి.మీ. ఈ స్కూటర్ 5.1 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వచ్చింది, ఫుల్ ట్యాంకుతో దాదాపు 270 కి.మీ. దూరం ప్రయాణించగలదు. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,831. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 1.02,000. నగరాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప తేడా ఉండవచ్చు.

ఏ స్కూటర్ మంచిది?
హోండా యాక్టివా & టీవీఎస్ జూపిటర్ మైలేజీలను పరిశీలిస్తే, ఈ రెండు ద్విచక్ర వాహనాల మైలేజ్ లీటర్‌కు 50 కి.మీ.కు దగ్గరగా ఉంటుంది. దీనితో పాటు, రెండు స్కూటర్ల ధరలో పెద్దగా తేడా లేదు. స్కూటర్ రూపాన్ని & రంగును పరిగణనలోకి తీసుకుని, ఈ రెండు మోడళ్లలో దేనినైనా కొనుగోలు చేయవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Cloud Kitchen : మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Cloud Kitchen : మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Bajaj Pulsar: భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
Knee Replacement : మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
Embed widget