అన్వేషించండి

GST On Cars: ప్రస్తుతం కార్లపై ఎంత పన్ను విధిస్తున్నారు? GST తగ్గింపు తర్వాత కార్ల ధరలు ఎంత తగ్గుతాయి?

Tax On Cars In India: కేంద్ర ప్రభుత్వం నిర్ణయం త్వరలో వెల్లడికానుంది. కార్లపై GST తగ్గిస్తే, వాహనాల ధరలు ఎంత తగ్గుతాయి?, ప్రస్తుతం కార్లపై GST ఎలా విధిస్తున్నారో తెలుసుకుందాం.

Car New Prices After GST Cut In India: భారతదేశంలో, కారు కొనడం మధ్య తరగతి కుటుంబాలకు ఇప్పటికీ పెద్ద కలగా, అందని ద్రాక్షలా ఉంది. దీనికి కారణం సుస్పష్టం - ప్రభుత్వాలు విధిస్తున్న "భారీ స్థాయి పన్నులు". ఈ పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ ఏడాది దీపావళికి ముందు, కేంద్ర ప్రభుత్వం, వివిధ కేటగిరీల కార్లపై GSTని తగ్గించవచ్చనే చర్చ జరుగుతోంది. ఇది జరిగితే, ఆల్టో, క్రెటా, స్కార్పియో & ఫార్చ్యూనర్ వంటి పాపులర్‌ వాహనాలు చౌకగా మారవచ్చు. ఇది మీ సేవింగ్స్‌ & EMI రెండింటిపైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. 

ప్రస్తుతం కార్లపై GST ఎలా విధిస్తున్నారు?

ఇప్పుడు, భారతదేశంలో కార్లపై GST రేట్లు ఒకేలా లేవు. కారు పొడవు, ఇంజిన్ సామర్థ్యం & ఇంధన రకం (పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్)పై ఆధారపడి పన్నులు మారుతున్నాయి. 

4 మీటర్ల కంటే తక్కువ పొడవు & ఇంజిన్ సామర్థ్యం 1.2 లీటర్ల వరకు ఉన్న చిన్న పెట్రోల్ కార్లకు 1% సెస్సుతో 28% GST వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం పన్ను 29%కి చేరుకుంటుంది. 

4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు లేదా ఇంజిన్ సామర్థ్యం 1.5 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పెద్ద పెట్రోల్ లేదా డీజిల్ కార్లకు 3% నుంచి 15% సెస్సుతో కలిపి 28% GST విధించబడుతుంది. ఈ కారణంగా, వాటిపై మొత్తం పన్ను 31% నుంచి 43% వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు పన్ను రేటు చాలా తక్కువగా ఉంది & వాటిపై 5% GST మాత్రమే విధిస్తున్నారు. 

పాత కార్ల విషయంలో, వాటిని డీలర్ల ద్వారా విక్రయిస్తే, లాభాల మార్జిన్‌లో 18% చొప్పున GST విధిస్తున్నారు. దీని అర్థం.. ప్రస్తుతం కారు వాస్తవ ధరలో మూడింట ఒక వంతు పన్నుగా వెళుతుంది.

GST ని 28% నుంచి 18% కి తగ్గిస్తే ఏమవుతుంది?
ప్రభుత్వం, కార్లపై GST రేట్లను 28% నుంచి 18%కి తగ్గించాలని భావిస్తోంది, ఇది జరిగితే వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. అన్నింటిలో మొదటిది, కార్ల ధరలు తగ్గుతాయి. చిన్న కార్ల ధర దాదాపు రూ. 55,000 తగ్గవచ్చు. సెస్ తగ్గింపు ప్రభావం కూడా కనిపిస్తుంది కాబట్టి పెద్ద కార్ల ధరలు కూడా తగ్గుతాయి. దీంతో పాటు, పన్ను తగ్గింపు కారణంగా అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు. వాహనాలు చౌకగా మారితే ప్రజలు కొనుగోలు చేయగలుగుతారు. ఆటోమొబైల్ పరిశ్రమ దీని నుంచి ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతుంది. కార్ల అమ్మకాల పెరుగుదలతో, కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి & ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

ఉదాహరణకు, ఒక కారు బేస్‌ ప్రైస్‌ రూ.5 లక్షలు అయితే, ప్రస్తుత 29% పన్నులు కలిపిన తర్వాత అది దాదాపు 6.45 లక్షలకు చేరుకుంటుంది. ప్రభుత్వం GSTని 18%కు తగ్గిస్తే, సెస్ కలిపిన తర్వాత మొత్తం పన్ను 19% అవుతుంది. అటువంటి పరిస్థితిలో, అదే కారును ఇప్పుడు 5.90 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అంటే కస్టమర్లు దాదాపు 10% ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.

కస్టమర్లకు మరో అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే EMI కూడా తగ్గుతుంది. కారు ధర తగ్గినప్పుడు, రుణ మొత్తం తగ్గుతుంది & EMI తేలికగా మారుతుంది. ఈ విధంగా, కారు కొనాలనే కల ఇకపై కేవలం కలగా మిగిలిపోదు, వాస్తవ రూపం దాలుస్తుంది. 

కస్టమర్లలో గందరగోళం, డీలర్లలో ఆందోళన
GST తగ్గింపు వార్త కస్టమర్లను కాస్త గందరగోళానికి గురిచేసింది కూడా. ఆగస్టు ప్రారంభంలో కార్లకు డిమాండ్ బాగానే ఉందని డీలర్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు, బుకింగ్ చేసుకునే ముందు, GST ఎప్పుడు తగ్గుతుందని కస్టమర్లు అడుగుతున్నారు. చాలామంది, GST తగ్గిన తర్వాత కారు కొందామంటూ, కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు కారు కొని దీపావళి నాటికి పన్ను తగ్గితే, అనవసరంగా ఎక్కువ ధర పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.

డీలర్లు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్లు ఇప్పటికే కొనుగోలు చేసిన స్టాక్‌పై ఇప్పటి రేటు ప్రకారం మొత్తం పన్ను చెల్లించారు. GSTని మరింత తగ్గిస్తే, కొత్త కార్లు తక్కువ రేటుకు అమ్ముడవుతాయి & పాత స్టాక్ ధర మాత్రం అలాగే ఉంటుంది. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ & వడ్డీ భారం పెరుగుతుంది. అందుకే చాలా మంది డీలర్లు ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో తక్కువ స్టాక్‌ను మాత్రమే ఉంచుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget