అన్వేషించండి

భారత్‌లో Maruti Escudo లాంచ్‌ ఈ రోజే - హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో పోటీ! ధర ఎంతంటే?

Maruti Escudo India launch: మారుతి సుజుకి, తన కొత్త SUV మారుతి ఎస్కుడోను ఈ రోజు (సెప్టెంబర్ 3, 2025) లాంచ్‌ చేయబోతోంది. ఈ SUV బ్రెజ్జా కంటే పెద్దదిగా & గ్రాండ్ విటారా కంటే చౌకగా ఉంటుంది.

Maruti Escudo Price, Mileage And Features In Telugu: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, ఈ రోజు (బుధవారం, సెప్టెంబర్ 3, 2025) కొత్త 5-సీటర్ SUVని లాంచ్‌ చేయబోతోంది. వాస్తవానికి, ఈ కారు రాక కోసం కస్టమర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆ ఎదురు చూపులు ఈ రోజు ఫలించనున్నాయి.  మారుతి ఎస్కుడో.. Maruti Brezza  & Grand Vitara మధ్య స్థాయిలో ఉంటుంది. నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఈ SUV పేరు మారుతి ఎస్కుడో అని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, మారుతి తన Arena డీలర్‌షిప్ నెట్‌వర్క్ నుంచి దీనిని విక్రయిస్తుంది. 

మారుతి ఎస్కుడో ఎలా ఉంటుంది?
టెస్టింగ్‌ టైమ్‌లో చూసిన చిత్రాలను బట్టి, ఎస్కుడో డిజైన్ చాలా మోడ్రన్‌గా & స్టైలిష్‌గా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో బూమరాంగ్ స్టైల్ 3D LED టెయిల్‌ల్యాంప్‌లు, పెద్ద టెయిల్‌గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా & ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటాయి. ఈ SUV పరిమాణంలో బ్రెజ్జా కంటే పెద్దదిగా & గ్రాండ్ విటారాకు దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి, ఈ కారులో ఎక్కువ స్థలం & బూట్ సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు.

ఇంజిన్ & పవర్ట్రెయిన్ ఎంపికలు
మారుతి ఎస్కుడో.. Grand Vitara మాదిరిగానే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. దీనికి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తారు. దీంతో పాటు, టయోటా 1.5 లీటర్ TNGA స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉండవచ్చు. నివేదికల ప్రకారం, కంపెనీ ఈ SUV CNG వెర్షన్‌ను కూడా విడుదల చేయవచ్చు.

ఇంటీరియర్ & ఫీచర్లు
ఎస్కుడో లోపలి భాగం కూడా చాలా అధునాతనంగా ఉండబోతోంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. కస్టమర్ల భద్రత కోసం 6 ఎయిర్‌ బ్యాగులు, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ & మల్టీ డ్రైవ్ మోడ్స్‌ను ప్రామాణికంగా పరిచయం చేస్తారని భావిస్తున్నారు. దీనితో పాటు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా చేర్చవచ్చు.

ఉత్పత్తి వివరాలు
మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ తన ఖార్ఖోడా (హరియాణా) ప్లాంట్‌లో మారుతి ఎస్కుడోను ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్తులో, టయోటా కూడా ఈ SUV ఆధారంగా తన కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెడుతుందని సమాచారం. 

ధర & పోటీ
కంపెనీ, మారుతి ఎస్కుడోను మిడ్-సైజ్ SUV విభాగంలో ప్రవేశపెడుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది Hyundai Creta & Kia Seltos వంటి ప్రసిద్ధ SUV లతో పోటీ పడనుంది. ఎస్కుడో ధరను లాంచ్ సమయంలో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈ SUV దాదాపు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. అంటే, ఇది గ్రాండ్ విటారా కంటే చౌకగా ఉంటుంది & బ్రెజ్జా కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget