Diwali Offers: ఈ 5 యూత్‌ఫుల్ బైక్‌ల రేట్లు రూ. 30,000 వరకు డౌన్ - కొత్త GSTతో ఈ పండుగ టైమ్‌లో భారీ డిస్కౌంట్లు
GST 2.0 ప్రభావంతో టాప్ బైక్‌ల ధరలు భారీగా తగ్గాయి. TVS Apache నుంచి Kawasaki Versys వరకు, రూ. 24,000 నుంచి రూ. 30,000 వరకు డిస్కౌంట్లు యూత్‌కు శుభవార్తగా మారాయి.

New GST 2.0 Bike Price Cuts: భారతదేశ వ్యాప్తంగా అమలైన జీఎస్టీ 2.0 సంస్కరణలు టూవీలర్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి, దీపావళి ఆఫర్లు కూడా తోడయ్యాయి. బైక్ కొనాలనుకునే యువతకు ఇది పర్ఫెక్ట్ టైమ్ అంటున్నారు ఆటో ఎక్స్‌పర్ట్స్. కొత్త జీఎస్టీ రేట్లతో, ప్రీమియం బైక్‌ల రేట్లు రూ. 24,000 నుంచి రూ. 30,000 వరకు ధరలు తగ్గాయి.
5. TVS Apache RR 310
టీవీఎస్ కంపెనీకి ప్రౌడ్ సింబల్‌గా నిలిచిన ఈ స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. GST 2.0 కు ముందు పాత ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.78 లక్షలు (బేస్ వేరియంట్) నుంచి రూ. 2.95 లక్షలుగా (క్విక్‌షిఫ్టర్ వేరియంట్) ఉన్నాయి. ఇప్పుడు, GST తగ్గింపుతో రూ. 24,310 వరకు తగ్గి, ధరలు వరుసగా రూ. 2.56 లక్షలు & రూ. 2.72 లక్షలు అయ్యాయి. 20 ఏళ్ల అపాచే సిరీస్ జ్ఞాపకార్థంగా వచ్చిన లిమిటెడ్ ఎడిషన్ బైక్ ఇప్పుడు రూ. 3.11 లక్షకే లభిస్తోంది.
4. Zontes 350T Adventure
ఆడ్వెంచర్ లవర్స్‌కి ఈ బైక్ సరైన ఆప్షన్. 348cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, 38.8hp పవర్, 32.8Nm టార్క్‌తో రోడ్డు మీద బలంగా పరుగులు తీస్తుంది. పాత ధర రూ. 3.25 లక్షలుగా ఉండగా, GST 2.0 తర్వాత ఇప్పుడు రూ. 3.00 లక్ష మాత్రమే. అంటే రూ. 25,400 తగ్గింపు లభిస్తోంది.
3. Kawasaki Ninja 300
స్పోర్ట్స్ బైక్‌లలో లెజెండరీగా నిలిచిన కవాసాకి నింజా 300 కూడా, జీఎస్‌టీ 2.0 అమలు తర్వాత ఇప్పుడు మరింత చవకగా మారింది. పాత ధర రూ. 3.43 లక్షలు కాగా, ఇప్పుడు రేటు రూ. 3.17 లక్షలు మాత్రమే. అంటే రూ. 26,000 సేవ్ అవుతోంది. 296cc పార్లల్ ట్విన్ ఇంజిన్, 39hp పవర్ ఈ బైక్‌ని యువత కలల బైక్‌గా నిలబెడుతోంది.
2. Keeway V302C
Keeway V302C బైక్ V-ట్విన్ ఇంజిన్‌తో రోడ్‌పై సూపర్ ప్రెజెన్స్ కలిగిన క్రూయిసర్ మోడల్. జీఎస్‌టీ 2.0 ముందున్న ధర రూ. 4.29 లక్ష కాగా, GST తగ్గింపుతో రూ. 3.99 లక్షలకు దిగి వచ్చింది. అంటే ఈ క్రూయిసర్ బైక్ రూ. 30,000 సేవ్ చేస్తోంది. కంఫర్ట్ & స్టైలింగ్ విషయంలో ఇది ఈ రేంజ్‌లో బెస్ట్ చాయిస్‌గా చెప్పుకోవచ్చు.
1. Kawasaki Versys-X 300
ఈ అడ్వెంచర్ బైక్ కూడా రూ. 30,000 తగ్గింపుతో ఇప్పుడు రూ. 3.49 లక్షలకు వస్తోంది. పాత ధర రూ. 3.79 లక్షలు. Kawasaki Ninja 300 ఇంజినే దీనిలోనూ ఉంది, ఇది 40hp పవర్, 26Nm టార్క్ ఇస్తుంది. దీని తగ్గింపు శాతం ఎక్కువగా ఉండటంతో ఇది టాప్ స్పాట్ దక్కించుకుంది.
మరికొన్ని బైక్‌లు
రోడ్డును సరిగ్గా ఉపయోగించుకునే మరికొన్ని బైక్‌లతో పాటు కొన్ని ఆఫ్‌రోడ్ మోడళ్లు కూడా భారీ జీఎస్‌టీ డిస్కౌంట్లను చూశాయి.
Kawasaki KX250: రూ. 68,000 తగ్గి ఇప్పుడు రూ. 7.79 లక్షలకు అందుబాటులో ఉంది.
Kawasaki KX85: రూ. 32,000 తగ్గి ఇప్పుడు రూ. 3.88 లక్షలకు వస్తుంది.
మొత్తం మీద జీఎస్టీ 2.0 రివిజన్‌తో బైక్ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. ధరలు తగ్గడంతో మధ్య తరగతి రైడర్లు కూడా ఇప్పుడు ప్రీమియం బైక్‌లను సులభంగా కొనుగోలు చేసే అవకాశం పొందారు.





















