ఈ దీపావళికి Syros, Sonet, Fronx, Magniteపై ఆకర్షణీయ ఆఫర్లు - కాంపాక్ట్ SUV బయ్యర్లకు పండుగ గిఫ్ట్
దీపావళి 2025 కోసం కారు కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. Kia Syrosపై రూ. 1.60 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. Sonet, Fronx, Magnite, Venue, Nexon SUVలపై కూడా ఆకర్షణీయ బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి.

Biggest Diwali Discounts On Compact SUVs 2025: దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో కారు కొనుగోలుదారులకు కంపెనీలు భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పోటీ ఎప్పటి లాగే హీట్ పెంచింది. దీంతో, ప్రతి కంపెనీ ఆకర్షణీయ బెనిఫిట్లు ప్రకటించింది. కియా, మారుతి, నిస్సాన్, రెనాల్ట్, హ్యుందాయ్, టాటా, మహీంద్రా - ఇలా దాదాపు అన్ని కార్ కంపెనీలు ఈ ఫెస్టివ్ సీజన్‌లో బలమైన డిస్కౌంట్‌లతో బరిలోకి దిగాయి.
Kia Syros - రూ 1.6 లక్షల వరకు డిస్కౌంట్
Kia Syros ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రీమియం కాంపాక్ట్ SUVగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ధరలు రూ 8.67 లక్షల నుంచి రూ 15.94 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) మధ్య ఉన్నాయి. ఈ దీపావళికి, వేరియంట్‌ను బట్టి, రూ. 1.6 లక్షల వరకు రాయితీ లభిస్తోంది. ఈ SUV HTK, HTK(O), HTK+, HTX, HTX+, HTX+(O) అనే 6 ట్రిమ్స్‌లో లభిస్తుంది. 120HP టర్బో-పెట్రోల్, 116HP డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి.
Kia Sonet - రూ 1.03 లక్షల వరకు
కియా సోనెట్ కూడా ఈ సీజన్‌లో హాట్ డీల్. ధరలు రూ. 7.30 లక్షల నుంచి రూ. 14.09 లక్షల వరకు ఉంటాయి. దీపావళి ఆఫర్‌గా రూ. 1.03 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. టర్బో-పెట్రోల్, డీజిల్ & 83HP 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
Nissan Magnite - రూ 89,000 వరకు
నిస్సాన్ మాగ్నెట్ అత్యంత చవకైన SUVలలో ఒకటి. ప్రారంభ ధర రూ 5.62 లక్షలే (ఎక్స్-షోరూమ్). ఈ కారు కొనే కస్టమర్లకు, కంపెనీ, రూ 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ 60,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే 1 గ్రాము బంగారం బహుమతిగా ఇస్తోంది.
Maruti Suzuki Fronx - రూ 88,000 వరకు
మారుతి ఫ్రాంక్స్ కూడా ఈ సీజన్‌లో ఆకర్షణీయ డీల్. దీని ప్రైస్ రేంజ్ రూ. 6.85 లక్షల నుంచి రూ. 11.98 లక్షల వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, Sigma, Delta, Delta+, Zeta, Alpha అనే 5 వెర్షన్లలో Fronx అందుబాటులో ఉంది. దీపావళి ఆఫర్‌గా రూ 88,000 వరకు బెనిఫిట్లు ఉన్నాయి.
ఇతర మోడళ్లు కూడా రేసులో ఉన్నాయి
Renault Triberపై రూ. 75,000 వరకు డిస్కౌంట్లు
Renault Kigerపై రూ. 70,000 వరకు డిస్కౌంట్లు
Maruti Jimnyపై రూ 70,000 వరకు డిస్కౌంట్లు
Skoda Kylaqపై రూ. 65,000 వరకు డిస్కౌంట్లు
Hyundai Venue కొనుగోలుదారులకు రూ. 50,000 వరకు ఆఫర్లు
Tata Nexon & Mahindra XUV 3XO కొనుగోలు చేస్తే రూ. 45,000 వరకు బెనిఫిట్లు
ఈ ఆఫర్లు నగరాల వారీగా, డీలర్ల స్టాక్ ఆధారంగా మారవచ్చు. కాబట్టి కొనుగోలు ముందు స్థానిక డీలర్ వద్ద వివరాలు తెలుసుకోవడం మంచిది.
ఈ దీపావళి సీజన్‌లో కొత్త SUV కొనాలనుకునే వాళ్లకు సరైన సమయం వచ్చినట్లే. మీరు Kia Syros వంటి ప్రీమియం SUV కావాలనుకుంటున్నా, లేదా Fronx, Sonet, Magnite వంటి బడ్జెట్ మోడల్స్ కావాలనుకుంటున్నా - ఈ పండుగ సీజన్ మీ జేబులోకి కూడా వెలుగులు తీసుకొస్తోంది.





















