అన్వేషించండి

నేషనల్‌ హైవేపై మురికిగా ఉన్న టాయిలెట్‌ ఫోటో తీయండి, ₹1000 FASTag రీచార్జ్‌ గెలుచుకోండి - NHAI కొత్త ఛాలెంజ్‌

Dirty Toilet Photo Challenge: మీరు ఏదైనా హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు శుభ్రంగా లేని టాయిలెట్‌ కనిపించిందా? వెంటనే దాని ఫోటో తీయండి. ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్‌ రివార్డ్‌ మీకు వస్తుంది.

NHAI Clean Toilet FASTag Recharge Reward: దేశ వ్యాప్తంగా హైవేల్లో ప్రయాణించే వారికి శుభ్రంగా ఉండే టాయిలెట్ల సౌకర్యం లభించాలని 'నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా' (NHAI) ఒక కొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు, ఎక్కడైనా చెత్తగా ఉన్న (శుభ్రంగా లేని) టాయిలెట్‌ కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే దాని ఫోటో తీయండి - రివార్డ్‌ పొందండి. ఈ రివార్డ్‌, ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్‌ రూపంలో మీకు లభిస్తుంది.

“క్లీన్‌ టాయిలెట్‌ పిక్చర్‌ ఛాలెంజ్‌” (Clean Toilet Picture Challenge)
ఈ యూనిక్‌ ఛాలెంజ్‌ ఈ నెల మొత్తం, అంటే అక్టోబర్‌ 31, 2025 వరకు దేశంలోని అన్ని నేషనల్‌ హైవేల్లో కొనసాగుతుంది. పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ పెంచడానికి, హైవే టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూడడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

ఎలా పాల్గొనాలి?
మీ ఫోన్‌లోకి, ‘రాజమార్గయాత్ర' (RajmargYatra) యాప్‌ తాజా వెర్షన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. హైవేపై మురికిగా ఉన్న టాయిలెట్‌ ఫోటో తీయండి, ఆ ఫోటోను రాజమార్గయాత్ర యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయండి. ఫోటోతో పాటు మీ పేరు, లొకేషన్‌, వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ (VRN) & మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలను అదే యాప్‌లో నమోదు చేయాలి. మీరు పంపిన ఫోటోను NHAI అధికారులు వెరిఫై చేస్తారు. ఆ తర్వాత, మీ వాహన నంబర్‌కు లింక్‌ అయిన ఫాస్టాగ్‌ అకౌంట్‌లోకి ₹1000 రీచార్జ్‌ జమ అవుతుంది. ఒక వాహన నంబర్‌కు ఒక్కసారి మాత్రమే ఈ రివార్డ్‌ వస్తుంది. ఈ రివార్డ్‌ను క్యాష్‌గా తీసుకోవడం సాధ్యం కాదు.

ఏయే టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది?

ఈ రివార్డ్‌ స్కీమ్‌, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న లేదా NHAI ఆధీనంలో ఉన్న టాయిలెట్లకే వర్తిస్తుంది. NHAI టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న మరుగుదొడ్లను జియో ట్యాగ్, సమయంతో స్పష్టంగా ఫోటోలను తీయాలి.

పెట్రోల్‌ బంక్‌లు, ధాబాలు లేదా ప్రైవేట్‌ రెస్ట్‌ ఏరియాలు, ఇతర ప్రైవేట్‌ ప్రాంతాల్లోని టాయిలెట్లు ఈ స్కీమ్‌ కిందకు రావు.

ఒక టాయిలెట్‌కు రోజుకు ఒక్క రివార్డ్‌ మాత్రమే ఉంటుంది. ఒకే టాయిలెట్‌ ఫోటోను చాలా మంది పంపినప్పటికీ, మొదటగా పంపిన స్పష్టమైన & జియో-ట్యాగ్‌ చేసిన ఫోటోకే రివార్డ్‌ లభిస్తుంది.

ఒకే ఫోన్‌ నంబర్‌తో వేరే ప్రాంతాల్లో ఉండే టోల్ ప్లాజా వద్ద ఉండే టాయిలెట్ల ఫొటోలు పంపించినప్పటికీ.. వాటిలోంచి ఒకటి మాత్రమే ఎంపిక చేస్తారు. 

ఏ ఫోటోలను అంగీకరించరు?

అస్పష్టంగా ఉన్న, మానిప్యులేట్‌ చేసిన, డూప్లికేట్‌ లేదా వేరే వాళ్లు అంతకుముందే ముందే రిపోర్ట్‌ చేసిన ఫోటోలను అధికారులు రిజెక్ట్‌ చేస్తారు. అవసరమైతే AI ఆధారిత స్క్రీనింగ్‌, మాన్యువల్‌ వెరిఫికేషన్‌ ద్వారా చెక్‌ చేస్తారు.

హైవేలు శుభ్రంగా ఉండాలనే లక్ష్యం
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను శుభ్రంగా & అందంగా ఉంచడానికి NHAI ఇప్పటికే చాలా చర్యలు చేపట్టింది. పాదరహిత మార్గాల పరిశుభ్రత, టోల్‌ ప్లాజాల అందం, రోడ్‌ సేఫ్టీ సైన్‌ బోర్డ్స్‌, హైవేల్లో గోడలపై చిత్రాలు, ఆక్రమణల తొలగింపు వంటి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ‘క్లీన్‌ టాయిలెట్‌ ఛాలెంజ్‌’ కూడా అదే దిశగా మరో అడుగు. 

కాబట్టి, మీరు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు మురికిగా ఉన్న టాయిలెట్‌ కనిపిస్తే వెంటనే ఫోటో తీయండి, రాజమార్గయాత్ర యాప్‌లో అప్‌లోడ్‌ చేయండి, ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్‌ రివార్డ్‌ పొందడంతో పాటు 'క్లీన్‌ హైవే మిషన్‌'లో భాగం అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget