(Source: ECI | ABP NEWS)
డైలీ యూజ్‌కు బెస్ట్ - GST కోతతో ఈ ఐదు 125cc బైక్‌లు మీ బడ్జెట్ రేంజ్‌లో!
Affordable 125cc Bikes: మీరు ఆఫీసుకు వెళ్లడానికి బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నట్లయితే, GST తగ్గింపు తర్వాత చౌకగా మారిన ఐదు 125cc బైక్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

Budget-friendly Daily Use 125cc Bikes After GST Cut: జీఎస్‌టీ తగ్గింపు తర్వాత, భారతదేశంలో 125cc విభాగంలో బైక్‌లను కొనుగోలు చేయడం గతంలో కంటే మరింత ఈజీగా మారింది. అందుబాటు ధర, తక్కువ నిర్వహణ, మంచి పనితీరు & ఇంధన సామర్థ్యం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని 125cc బైక్‌లను కొనుగోలు చేస్తారు. ఈ లక్షణాన్నీ ఉన్న ఐదు 125cc బైక్‌లు ఇవిగో:
TVS Raider 125
ఈ లిస్ట్ ఫస్ట్ బైక్ టీవీఎస్ రైడర్. మోడ్రన్ ఫీచర్లు & స్పోర్టీ డిజైన్‌ను ఇష్టపడే వారి కోసం వచ్చిందీ టూవీలర్. తెలుగు రాష్ట్రాల్లో, టీవీఎస్ రైడర్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర ₹83,400. అన్ని టాక్స్‌లు కలుపుకుని దీని ఆన్-రోడ్ ధర దాదాపు ₹1.06 లక్షలు. ఈ బైక్ 124.8cc, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో 11.2 bhp & 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Honda Shine
తెలుగు రాష్ట్రాల యువతలో, 125cc విభాగంలో హోండా షైన్ ఒక పాపులర్ బైక్. డ్రమ్ వేరియంట్ ధరలు ₹78,538 (ఎక్స్-షోరూమ్) & డిస్క్ వేరియంట్ ₹82,898 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ బైక్ 123.94cc ఇంజిన్ 10.59 bhp & 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ మైలేజ్ సుమారు 55-65 kmpl, ఇది ఇంధన-సమర్థవంతమైన బైక్.
Honda SP 125
మూడవ బైక్ హోండా SP125, ఇది స్టైలిష్ గా & ఆధునిక లక్షణాలతో వస్తుంది. GST తగ్గింపు తర్వాత ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధరలు ₹ 85,568 (ఎక్స్-షోరూమ్) & డిస్క్ వేరియంట్ ₹ 93,156 (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్-రోడ్ ధరలు - డ్రమ్ వేరియంట్ ₹1.07 లక్షలు & డిస్క్ వేరియంట్ ₹ 1.16 లక్షలు. దీని 123.94cc ఇంజిన్ 10.72 bhp & 10.9 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమైంది, ఇది మృదువైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
Bajaj Pulsar 125
నాల్గవ బైక్ బజాజ్ పల్సర్ 125 బైక్ స్టైలిష్‌గా ఉంటుంది, అదే సమయంలో ఫ్రెండ్లీ బడ్జెట్‌లోనే వస్తుంది. ఈ బైక్ ధరలు ఇప్పుడు ₹ 79,998 నుంచి మొదలవుతాయి. ఆన్-రోడ్ ధర దాదాపు ₹98,000 ఉంటుంది. ఈ బండి 124.4cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 11.8 PS గరిష్ట శక్తిని & 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Hero Glamour X125
ఐదవ బైక్ హీరో గ్లామర్ X125 స్టైలిష్ & పవర్‌ఫుల్ 125cc కమ్యూటర్ బైక్. ఈ బైక్ 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 11.5 PS పవర్ & 10.4 Nm టార్క్‌ను ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ₹84,809 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఆన్-రోడ్ ధర దాదాపు ₹1.08 లక్షలు ఉంటుంది.





















