Ford Cars: భారత్‌కు ఫోర్డ్ కంపెనీ షాక్.. కార్ల తయారీ నిలిపివేత.. కానీ కస్టమర్లకు సేవలుంటాయట
ఫోర్డ్ కార్ల కంపెనీ భారత్‌కు షాక్ ఇచ్చింది. నష్టాలు భరిస్తూ వ్యాపారం చేయలేమని తేల్చేసింది. ఇక్కడ ఉన్న రెండు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ తయారీదారు ఫోర్డ్ భారత్‌లో కార్ల తయారీని నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్‌లో ఫోర్ట్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. దీని వల్ల సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులు, డీలర్‌షిప్ ద్వారా నలభైవేల మందిపై ప్రభావం చూపనుంది. 2017 తర్వాత భారత్ నుంచి వెళ్లిపోయిన ఐదో అతి పెద్ద కంపెనీ ఫోర్డ్. ఇప్పటి వరకు జనరల్ మోటార్స్, మ్యాన్‌ట్రక్స్, హార్లీడేవిడ్‌సన్, ఉమ్‌లోహియా.
ALSO READ: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్... సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు
భారత్‌లో ఫోర్డ్‌కు రెండు ప్లాంట్‌లు ఉన్నాయి. చెన్నైలో ఒకటి, గుజరాత్‌లోని సనంద్‌లో మరో ప్లాంట్ ఉంది ఈ రెండు ప్లాంట్లను మూసివేస్తున్నట్టు ఫోర్డ్ ప్రకటించింది. అయినా.. కస్టమర్‌లకు సేవలు మాత్రం కొనసాగుతాయని ఫోర్డ్ యాజమాన్యం తెలిపింది. భారత వాహన విపణిలో నిలదొక్కుకునేందుకు మూడు దశాబ్దాలుగా ఫోర్డ్ ఇండియా ప్రయత్నిస్తూ 2.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18750 కోట్ల) పెట్టుబడులు పెట్టింది. గత పదేళ్లలో 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15,000 కోట్ల) నిర్వహణ నష్టాన్ని కంపెనీ చవిచూసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ALSO READ: యథావిధిగా 5వ టెస్టు... షమి అందుబాటులో... రోహిత్ శర్మ, పుజారా అనుమానం?
కంపెనీకి భారీ నష్టాలు, మార్కెట్‌లో ఆశించినంత వృద్ధి లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చింది ఫోర్డ్ మోటార్ కంపెనీ. 2021 ఫోర్త్ క్వార్టర్స్‌కు గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని, 2022 సెకండ్ క్వార్టర్స్‌కు చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపేయనుంది. జీఎమ్ మోటార్స్ తరువాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నష్టాలు ఫోర్డ్‌కు వచ్చాయి.
ALSO READ: ఐటీఆర్ దాఖలు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
ఫోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, డీలర్‌షిప్‌పై ఆధారపడి బతుకుతున్న వారు ఆందోళనలో పడ్డారు. ఫోర్డ్ భారత్‌లో సుమారు 2 బిలియన్ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏడాదికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ALSO READ: 'ఫ్యూచర్ గ్రూప్'కు సుప్రీంలో భారీ ఊరట.. ఆస్తుల జప్తుపై స్టే
ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, దేశంలో అతిపెద్ద కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్‌లో ఫోర్డ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ప్రస్తుతం ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ వంటి ఐదు మోడళ్లను భారత్‌లో విక్రయిస్తోంది.
ALSO READ: రూ.16 వేలకే 40 ఇంచుల టీవీ... త్వరగా బుక్ చేసుకోండి