Highest Range Electric Scooters: సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ దూరం దూసుకుపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే - మీ ఛాయిస్ ఏది?
Electric Scooters Highest Range: భారతదేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొందరు ఔత్సాహికులు వెతుకుతూనే ఉన్నారు.
Electric Scooters With Highest Range in India: ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా డిమాండ్ బాగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో బడ్జెట్ ఫ్రెండీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలని యూజర్లు అనుకుంటున్నారు. ఓలా నుంచి ఏథర్ వరకు అనేక మోడల్స్ ఇప్పుడు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏం ఉన్నాయో చూద్దాం.
ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 (Okaya Faast F4)
ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌లో 140 నుంచి 160 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లుగా ఉంది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,19,989గా నిర్ణయించారు.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
టీవీఎస్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటరే టీవీఎస్ ఐక్యూబ్. దీన్ని ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర యావరేజ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,47,003గా నిర్ణయించారు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
విడా వీ1 ప్లస్ (Vida V1 Plus)
విడా వీ1 ప్లస్ ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 26 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంది. అలాగే పోర్టబుల్ ఛార్జర్ కోసం 10 లీటర్ల అదనపు స్థలం అందించారు. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,02,700గా ఉంది.
ఏథర్ రిజ్టా (Ather Rizta)
ఏథర్ రిజ్టాను ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. ఏథర్ ఈ స్కూటర్‌పై ఐదు సంవత్సరాల వారంటీని కూడా ఇచ్చింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,10,464గా నిర్ణయించారు.
ఓలా ఎస్1ఎక్స్ (OLA S1X)
ఓలా ఎస్1ఎక్స్ బ్యాటరీ సామర్థ్యం 4 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఓలా ఎస్1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 190 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఓలా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 99,999గా ఉంది.