అన్వేషించండి

Kia Carens Clavis: ఫీచర్‌-లోడెడ్‌ & ఇన్నోవేటివ్‌ వెహికల్‌ 'కియా కారెన్స్ క్లావిస్' డెలివెరీలు ప్రారంభం

Kia Carens Clavis Deliveries Begin: SUV లుక్‌, పవర్‌ఫుల్‌ ఇంజిన్ ఆప్షన్లు & ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను బాగా ఆకర్షించిన కొత్త 7-సీటర్‌ కారు 'కారెన్స్ క్లావిస్' డెలివరీలను కియా ప్రారంభించింది.

Kia Carens Clavis Deliveries Started: కియా మోటార్స్ ఇండియా తన కొత్త 7-సీటర్ ప్రీమియం MPV "కారెన్స్ క్లావిస్" కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు గుడ్‌ న్యూస్‌. ఈ ప్రీమియం లగ్జరీ కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి, బుక్‌ చేసుకున్నవాళ్లకు షోరూమ్‌ల నుంచి పిలుపులు అందుతున్నాయి. ఈ కొత్త మోడల్, ప్రస్తుత కారెన్స్ కంటే మరింత స్టైలిష్‌, ఫీచర్‌ ప్యాక్డ్‌ & SUV స్టైల్ వెర్షన్. సౌకర్యవంతమైన ఫ్యామిలీ కారు కోరుకుంటూనే SUV లాంటి లుక్స్ & ఫీచర్లలో రాజీ పడకూడదనుకునే వారికి - క్లావిస్ సరైన ఎంపిక అవుతుంది.

ఇంజిన్ ఆప్షన్‌
కియా కంపెనీ, కారెన్స్ క్లావిస్‌ను మూడు పవర్‌ఫుల్‌ ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసింది. మొదటి ఇంజిన్‌ ఆప్షన్‌ - 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్‌, ఇది 160 PS పవర్‌ను & 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్‌ 7-స్పీడ్ DCT & 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందింది. రెండో ఇంజిన్‌ ఆప్షన్‌ - 1.5L డీజిల్ ఇంజిన్, ఇది 116 PS & 250Nmతో వచ్చింది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మూడో ఇంజిన్ ఆప్షన్‌ - 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్, ఇది 115 PS పవర్‌ & 144Nm టార్క్‌ అవుట్‌పుట్‌ను ఇస్తుంది, ఇది iMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) & మాన్యువల్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. iMT కారును కొంటే క్లచ్‌లెస్ డ్రైవింగ్ అనుభవాన్ని పొందుతారు.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?  (Kia Carens Clavis Features)
కారెన్స్ క్లావిస్, ఈ విభాగంలో ఫీచర్‌-లోడెడ్‌ & ఇన్నోవేటివ్‌ వెహికల్‌గా కనిపిస్తుంది. కారులో డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో 26.62-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై కొత్త ఆఫ్‌సెట్ కియా లోగో & ఆడియో కోసం BOSE 8-స్పీకర్ ప్రీమియం సిస్టమ్‌ ఉన్నాయి. అలాగే, 64-కలర్‌ యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీల కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్‌ స్లైడింగ్ & రిక్లైనింగ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు & ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఈ కారుకు ప్రీమియం ఫీల్‌ ఆపాదించాయి.

SUVలాగా బోల్డ్ లుక్
డిజైన్ పరంగా, కారెన్స్ క్లావిస్‌కు బోల్డ్ SUV లాంటి లుక్‌తో లాంచ్‌ అయింది. L-ఆకారపు DRLలు, ఐస్ క్యూబ్ LED హెడ్‌లైట్‌లు, స్టార్‌మ్యాప్ LED టెయిల్‌లైట్‌లు, స్కల్ట్పెడ్‌ బంపర్‌ & కనెక్డెడ్‌ లైట్ బార్‌ వంటి ఆధునిక డిజైన్ ఎలిమెంట్స్‌ ఈ కారు సొంతం. ఈ కారు 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను మీద ఠీవిగా నిలబడి కనిపిస్తుంది, స్టాండర్డ్ కారెన్స్‌లో 16-అంగుళాలు వీల్స్‌ ఉన్నాయి. కొత్త ప్రత్యేకమైన "ఐవరీ సిల్వర్" పెయింట్ స్కీమ్ దీనికి మరింత స్పెషల్‌ లుక్‌ను ఇస్తోంది.

SUV లాంటి ఎక్స్‌టీరియర్‌, మోడర్న్‌ ఫీచర్లు, పవర్‌ఫుల్‌ ఇంజిన్ & క్లచ్‌లెస్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు కుటుంబం కోసం 7-సీట్ల కారును కోరుకుంటే, Kia Carens Clavis మీకు ఒక మంచి అవకాశం కావచ్చు. దీని ధర కొంచెం ఎక్కువ అనిపించినప్పటికీ, ఈ MPVలో అందించిన ఫీచర్లు, డిజైన్ & పనితీరు మీ డబ్బుకు తగిన విలువను అందించగలవు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Embed widget