అన్వేషించండి

New Traffic Rules: మీ బిడ్డ చేతికి బండి ఇస్తున్నారా?, జైలుకు వెళ్తారు జాగ్రత్త - కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ తెలిస్తే మీ గుండె జారిపోతుంది

New Traffic Rules in India: భారతదేశంలో కొత్త, కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమల్లోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలను నివారించడమే కొత్త నియమాల ఉద్దేశం.

New Traffic Challan Rules in India: భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను సంపూర్ణంగా పాటించకపోవడమే. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి & ట్రాఫిక్ క్రమశిక్షణను కఠినతరం చేయడానికి భారత ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం (2025) నుంచి కొత్త ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తోంది. ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు చేసినా, అది మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టవచ్చు & చట్టం పరంగానూ చర్యలు తీసుకోవచ్చు.

మైనర్ వాహనం నడిపితే ఇన్ని శిక్షలా?
2025 నుంచి అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, మైనర్ (18 సంవత్సరాల వయస్సు నిండని బాలుడు లేదా బాలిక) వాహనం నడుపుతూ పట్టుబడితే, ఆ మైనర్‌ తల్లిదండ్రులు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రాఫిక్‌ పోలీసులు రూ. 25,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ కఠిన చర్యలు ఇంకా ఐపోలేదండీ.. మైనర్‌ నడిపిన వాహనం రిజిస్ట్రేషన్‌ను 1 సంవత్సరం పాటు రద్దు చేస్తారు & మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ లభించదు.

మద్యం తాగి వాహనం నడిపితే రెట్టింపు జరిమానా
మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే, మొదటిసారి రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేసి దొరికిపోతే రూ. 15,000 జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.

రెడ్ లైట్‌ పడినా బండి నడిపితే 10 రెట్ల జరిమానా
రెడ్ లైట్‌ పడినా ఆగకుండా వేగంగా దూసుకెళ్లేవాళ్లను తరచూ చూస్తుంటాం. అలాంటి వ్యక్తులు అవతలి వాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెడతారు. రెడ్‌ లైట్‌ పడినా ఆగకుండా వెళ్లిపోయేవాళ్లకు గతంలో కేవలం రూ. 500 జరిమానా మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని 10 రెట్లు పెంచి రూ. 5,000 చేశారు.

అతి వేగం, ఓవర్‌ లోడింగ్‌కు భారీ శిక్షలు
నిర్దేశిత వేగాన్ని మించిన వేగంతో వాహనం నడుపుతూ పట్టుపడితే రూ. 5,000 జరిమానా కట్టాలి. లారీ లేదా ట్రక్కు లేదా వాణిజ్య వాహనంలో నిర్దేశించిన పరిమితికి మించి వస్తువులను తీసుకెళుతూ దొరికిపోతే ట్రాఫిక్‌ పోలీసులు రూ. 20,000 చలాన్ విధిస్తారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే?
ఒక వ్యక్తి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేకుండా పట్టుబడితే రూ. 5,000 జరిమానా చెల్లించాలి. అయితే, డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో ఉన్న చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ చెల్లుతుంది. మీ వాహనంలో చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేకపోతే మీకు రూ. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు సమాజ సేవ చేయమని కోర్టు ఆదేశించవచ్చు.

సీట్ బెల్ట్‌ & హెల్మెట్‌ నియమాలు 
ఇప్పుడు, దాదాపు అన్ని కార్లలో ముందు సీట్‌తో పాటు వెనుక సీట్‌లో కూర్చున్న వారికి కూడా సీట్‌ బెస్ట్‌ సౌకర్యం ఉంది. కాబట్టి, కారు ప్రయాణీకులు/ప్రయాణీకుడు (ముందు సీట్‌లో లేదా వెనుక సీట్‌లో కూర్చున్న వ్యక్తి/వ్యక్తులు) సీట్ బెల్ట్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా కట్టేందుకు సిద్ధంగా ఉండాలి. బైక్‌ నడుపుతూ హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ. 1,000 జరిమానా కట్టాలి, దీంతోపాటు అతని లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు. 

డ్రైవింగ్‌ లేదా రైడింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే...
మీ కారు డ్రైవింగ్ లేదా బైక్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ బండిని నడుపితే రూ. 5,000 వరకు జరిమానా విధిస్తారు. రోడ్డు ప్రమాద కారణాల్లో ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం.

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget