అన్వేషించండి

Dayanand Shetty Viral Video: సీఐడీ ఫేమ్ దయాకు టయోటా ఫార్చ్యూనర్ పై ఎందుకు ఇంత లవ్?: ఎన్ని కార్లు మారినా గ్యారేజ్ లో అలాగే ఉండిపోయిన బాహుబలి కార్.. 

పాపులర్ టీవీ షో సీఐడీ ఫేమ్ దయా అలియాస్ దయానంద్ శెట్టి తన 17 ఏళ్ల నాటి టయోటా ఫార్చ్యూనర్ కార్ పై ఉన్న ఇష్టాన్ని ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు.

Dayanand Shetty Shares His 17 Year Long Toyota Fortuner Ownership: టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ కార్ ఎండ్యూరింగ్ అప్పీల్ ను ప్రముఖ టెలివిజన్ యాక్టర్, సీఐడీ (CID) ఫేమ్ దయానంద్ శెట్టి మరోసారి గుర్తు చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో, 17 ఏళ్లుగా తన దగ్గరే ఉన్న ఫార్చ్యూనర్ కార్ ను ఇప్పటివరకు ఎందుకు అమ్మలేదో క్లియర్ గా ఎక్స్ ప్లేన్ చేశారు. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా ఈ కార్ కు ఉన్న రోడ్ ప్రెజెన్స్ వేరని దయా ప్రశంసించారు.

Read Also: Hero HF Deluxe Flex Fuel Bike Emi: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ ఖర్చులు తగ్గించే సరికొత్త టెక్నాలజీ.. ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా?

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dayanand Shetty (@thedayashetty)

ఇన్నోవా నుంచి ఫార్చ్యూనర్ కు అప్‌గ్రేడ్.. 

దయానంద్ శెట్టి ఈ ఫార్చ్యూనర్ కార్ ను 2010 లో ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే కొనుగోలు చేశారు. అంతకంటే ముందు అతడు టయోటా ఇన్నోవా కార్ ను వాడేవాడు. అది కూడా మంచి డిపెండబుల్ వెహికల్ అయినప్పటికీ, ఒక లగ్జరీ అప్‌గ్రేడ్ కోసం ఫార్చ్యూనర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. తన ఓనర్‌షిప్ జర్నీని గుర్తు చేసుకుంటూ, కార్ కొన్న ఐదేళ్లకు, పదేళ్లకు, ఆఖరికి పదిహేనేళ్లకు కూడా దీన్ని అమ్మేయాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ ప్రతిసారి ఆ డెసిషన్ ను మార్చుకున్నారు. ఈ గ్యాప్ లో చాలా కార్లు కొని, ఐదారు ఏళ్లు వాడి అమ్మేసినా ఫార్చ్యూనర్ ను మాత్రం తన గ్యారేజ్ లో అలాగే ఉంచేసుకున్నారు.

Read Also: WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే

గోవా, బెంగళూరు లాంగ్ ట్రిప్స్.. 

ఈ కార్ తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కు మెయిన్ రీజన్ దాని రిలయబిలిటీ, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అని దయా వీడియోలో హింట్ ఇచ్చారు. ముంబై నుంచి గోవా, బెంగళూరు, గుజరాత్, కేరళ వంటి లాంగ్ డిస్టెన్స్ సిటీస్ కి ఎన్నిసార్లు వెళ్లినా ఈ కార్ ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం ఇవ్వకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాలు కాస్తున్నా ఈ కార్ లుక్ ఇప్పటికీ మోడ్రన్ గానే కనిపిస్తోందని విజువల్స్ చూపించారు. చూస్తుంటే ఇది టైప్ 2 ఫార్చ్యూనర్ లా కనిపిస్తోంది, అంటే దయా తన పాత 2010 టైప్ 1 మోడల్ ను డిజైన్ పరంగా అప్‌డేట్ చేయించి ఉండవచ్చు. దీన్ని అస్సలు అమ్మనని, ఒక స్మారక చిహ్నంలా దాచుకుంటానని దయా ఫన్నీగా అన్నారు.

టయోటా ఫార్చ్యూనర్ కరెంట్ ప్రైస్.. 

టయోటా ఫార్చ్యూనర్ ప్రస్తుతం థర్డ్ జనరేషన్ మోడల్ తో మార్కెట్ లో టాప్ పొజిషన్ లో రన్ అవుతోంది. దీని స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 34.76 లక్షలుగా ఉంది. ఇప్పుడున్న మోడల్ టూ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తోంది. 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ 166 హెచ్‌పీ పవర్ ఇస్తుంది, ఇది కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లోనే అందుబాటులో ఉంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ 204 హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది, ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్ తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ (4WD), 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా టయోటా అందిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget