Citroen Basalt Launch: సిట్రోయెన్ బసాల్ట్ లాంచ్ త్వరలోనే - ఎస్‌యూవీల్లో పెరుగుతున్న పోటీ!
Citroen Basalt India Launch: ప్రముఖ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ మనదేశంలో కొత్త కారును లాంచ్ చేయనుంది. అదే సిట్రోయెన్ బసాల్ట్. ఇది టాటా కర్వ్, హ్యుందాయ్ వెన్యూ కార్లకు మార్కెట్లో గట్టి పోటీని ఇవ్వనుంది.
Citroen Basalt: కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) తన కొత్త ఎస్‌యూవీ బసాల్ట్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది కారు ప్రొడక్షన్ రెడీ మోడల్. కంపెనీ ఈ నెలలోనే ఈ కారును లాంచ్ చేయనుందని తెలుస్తోంది. సిట్రోయెన్ బసాల్ట్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో పాటు అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డిజైన్ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ని పోలి ఉంటుంది.
సిట్రోయెన్ బసాల్ట్ డిజైన్ ఎలా ఉంది?
సిట్రోయెన్ నుంచి వచ్చిన ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఇందులో కంపెనీ వీ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన స్ప్లిట్ గ్రిల్‌ను అందించింది. అదే సమయంలో దీని బంపర్‌ను కొత్త పద్ధతిలో డిజైన్ చేశారు. ఇది వెనుకవైపు ర్యాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లతో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి
సిట్రోయెన్ బసాల్ట్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీల్లో కంపెనీ డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన ఏసీ వెంట్లను అందించింది. ఇది కొత్త ఆకర్షణీయమైన డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. సిట్రోయెన్ బసాల్ట్ వైట్ లెథెరెట్ అప్హోల్స్టరీ, వెనుక హెడ్ రెస్ట్‌ను కలిగి ఉంది. అదే సమయంలో కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించారు.
ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎస్‌యూవీలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది. దీంతో పాటు ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు 470 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది ప్రీమియం ఎస్‌యూవీగా జాబితా చేయబడింది.
సిట్రోయెన్ బసాల్ట్ ఇంజిన్ ఎలా ఉంది?
సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీలో 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్‌తో అందించారు. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ 82 పీఎస్ పవర్, 115 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 పీఎస్ పవర్‌తో 205 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మరోవైపు కారు టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ లీటరుకు 19.5 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. అయితే దీని ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్లో ఈ కారు టాటా కర్వ్, హ్యుందాయ్ వెన్యూ కార్లకు గట్టి పోటీనిస్తుంది.
The grand reveal of #TheUnthinkable! The new Citroën Basalt is here in all its glory. Citroën India unveiled the Basalt to auto journalists to kick off Day 1 of the Media Drive.
— Citroën India (@CitroenIndia) August 3, 2024
Stay tuned for more updates from the Citroën Basalt Media Drive.#Citroen #Basalt pic.twitter.com/UsRrjDQh43
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్