సన్‌రూఫ్ కార్, ఫ్యామిలీ అంతా హుషార్ - కేవలం ₹11 లక్షల నుంచే పానోరమిక్ సన్‌రూఫ్ కార్లు
మన మార్కెట్లో పానోరమిక్ సన్‌రూఫ్‌తో లభిస్తున్న తక్కువ ధర కార్ల లిస్ట్ ఇది. XUV 3XO నుంచి క్రెటా, సెల్టోస్ వరకు ధరలు, వేరియంట్లు, ముఖ్యమైన ఫీచర్లను పూర్తిగా తెలుసుకోండి.

Cheapest Panoramic Sunroof Cars India: ఇటీవల కాలంలో కార్ కొనుగోలుదారులు ఎక్కువగా కోరుకునే ఫీచర్లలో సన్‌రూఫ్ ఒకటి. ముఖ్యంగా పానోరమిక్ సన్‌రూఫ్ ఉంటే కేబిన్‌లో వెలుతురు ఎక్కువగా వచ్చి, ఎక్కువ స్పేస్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ఫీచర్, ఇప్పుడు మాస్ మార్కెట్ కార్లలో కూడా అందుబాటులోకి వస్తోంది. అలాంటి పానోరమిక్ సన్‌రూఫ్‌తో లభిస్తున్న భారతదేశంలోని 10 తక్కువ ధర ICE కార్లు ఇవే.
10. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
టయోటా హైరైడర్‌లో G(O) వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹14.23 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. CNG వేరియంట్లలో మాత్రం ఈ సన్‌రూఫ్ ఇవ్వడం లేదు.
9. కియా సెల్టోస్
మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో పాపులర్ అయిన సెల్టోస్‌లో HTK(O) వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ వేరియంట్ ప్రత్యేకత ఏంటంటే - అన్ని ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులోనే ఉంటాయి. ఎక్స్-షోరూమ్ ధర ₹14.19 లక్షలు.
8. మారుతి సుజుకి విక్టోరిస్
మారుతి అరేనా నెట్‌వర్క్‌లో ఫ్లాగ్‌షిప్ SUVగా ఉన్న విక్టోరిస్‌లో Zxi(O) వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ వస్తుంది. ధరలు ₹14.08 లక్షల నుంచి ₹18.54 లక్షల వరకు ఉన్నాయి.
7. MG హెక్టర్
MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో సెలెక్ట్ ప్రో వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది పెద్ద కుటుంబాలకు సరిపడే SUV.
6. హ్యుందాయ్ క్రెటా
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే SUVలలో ఒకటైన క్రెటాలో EX(O) వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ వేరియంట్‌ను 2025లో ప్రవేశపెట్టారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
5. టాటా కర్వ్
కూపే SUVగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాటా కర్వ్‌లో Pure+ S వేరియంట్ నుంచే పానోరమిక్ సన్‌రూఫ్ లభించడం పెద్ద ప్లస్. ఎక్స్-షోరూమ్ ధర ₹11.59 లక్షలు.
4. టాటా నెక్సాన్
ఈ లిస్ట్‌లో CNG ఆప్షన్‌తో పానోరమిక్ సన్‌రూఫ్ అందిస్తున్న ఏకైక SUV నెక్సాన్. Creative+ PS వేరియంట్ నుంచి ఈ ఫీచర్ లభిస్తుంది.
3. MG ఆస్టర్
MG ఆస్టర్‌లో షైన్ వేరియంట్ నుంచే డ్యుయల్ పేన్ పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఇది మిడ్‌సైజ్ SUVలలో అత్యల్ప ధరకు ఈ ఫీచర్ ఇచ్చే కారుగా నిలుస్తుంది.
2. కియా సైరస్
కాంపాక్ట్ SUV అయిన కియా సైరస్‌లో HTK+ వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ వస్తుంది. స్పేస్ డిజైన్ దీని ప్రధాన ఆకర్షణ.
1. మహీంద్రా XUV 3XO
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న SUV XUV 3XO. RevX A వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹10.75 లక్షలు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది వస్తుంది.
ఒకప్పుడు లగ్జరీగా భావించిన పానోరమిక్ సన్‌రూఫ్, ఇప్పుడు ₹11 లక్షల బడ్జెట్‌లోనే అందుబాటులోకి రావడం భారత కార్ మార్కెట్ ఎంత వేగంగా మారుతుందో చెబుతోంది. కొత్త కారు కొనుగోలు ప్లాన్ చేస్తుంటే, ఈ లిస్ట్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















