అన్వేషించండి

Tata Sierra 1.5 NA పెట్రోల్‌ వెర్షన్‌: మాన్యువల్‌, ఆటోమేటిక్‌ అనుభవాలపై పూర్తి రివ్యూ - కొనదగినదేనా?

Tata Sierra 1.5 NA పెట్రోల్‌ వేరియంట్‌ కంఫర్ట్‌, రైడ్‌ క్వాలిటీ, ఇంటీరియర్‌లో మెప్పిస్తుందా? పెర్ఫార్మెన్స్‌లో ఏదైనా లోపం ఉందా? మాన్యువల్‌, ఆటోమేటిక్‌ అనుభవాలపై పూర్తి రివ్యూ.

Tata Sierra 1.5 NA petrol review: 2025లో భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అత్యంత చర్చకు వచ్చిన మోడళ్లలో Tata Sierra ఒకటి. బుకింగ్స్‌ ప్రారంభించిన రోజే 70 వేలకుపైగా ఆర్డర్లు రావడం చూస్తే, ఈ పేరుకు ఉన్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 1990ల నాటి సియేరాను ఆధునిక టెక్నాలజీతో మళ్లీ తీసుకొచ్చిన టాటా మోటార్స్‌, ఈ SUVని మూడు ఇంజిన్‌ ఆప్షన్లతో అందిస్తోంది. 

కొత్త టాటా సియేరాను స్వయంగా నడిపిన ఆటోమొబైల్‌ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయాలు ఇవి:

టాటా సియేరాలో బేస్‌ వేరియంట్‌గా వచ్చిన 1.5 లీటర్‌ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వేరియంట్‌ ధరను ఆకర్షణీయంగా ఉంచేందుకు టాటా ఈ ఇంజిన్‌ను ఎంపిక చేసింది. ప్రారంభ ధర ₹11.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉండటం వల్ల, కాంపాక్ట్‌ SUV నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌.

ఈ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ Atkinson సైకిల్‌పై పనిచేస్తుంది. దీని ప్రధాన లక్ష్యం పవర్‌ కంటే ఇంధన సామర్థ్యం ఇవ్వడం. గరిష్టంగా 106hp పవర్‌, 145Nm టార్క్‌ మాత్రమే అందిస్తుంది. కాగితాలపై ఇవి పెద్ద సంఖ్యలు కాకపోయినా, సిటీ డ్రైవింగ్‌కు సరిపడే ట్యూనింగ్‌ ఉంది. 2,100rpm నుంచే టార్క్‌ అందుబాటులోకి రావడంతో, ట్రాఫిక్‌లో సియేరా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కానీ ఓవర్‌టేక్‌లు చేయాలంటే ముందుగానే ప్లాన్‌ చేయాల్సిందే. 0 నుంచి 100km వేగానికి చేరుకోవడానికి సుమారు 17 సెకన్లకు పైగా సమయం పడుతుంది. అంటే ఇది డ్రైవర్‌ను ఉత్సాహపరిచే SUV కాదు, కానీ... నెమ్మదిగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే వారికి సరిపోతుంది.

మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌
6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ టాటా ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత స్మూత్‌ యూనిట్లలో ఒకటి. క్లచ్‌ తేలికగా ఉండటం వల్ల నగరంలో డ్రైవింగ్‌ చాలా సులభంగా ఉంది. ఆటోమేటిక్‌ వేరియంట్‌గా వచ్చే 7-స్పీడ్‌ DCA గేర్‌బాక్స్‌ పూర్తిగా కంఫర్ట్‌ కోసం ట్యూన్‌ చేశారు. గేర్‌ మార్పులు మృదువుగా ఉన్నా, వెంటనే రెస్పాండ్‌ అయ్యే స్వభావం కాస్త తక్కువగా అనిపిస్తుంది.

మైలేజ్‌ విషయానికి వస్తే, ఇది భారీ SUV అయినప్పటికీ 17-18 km లీటర్లు (క్లెయిమ్డ్‌) ఇస్తుంది. ఇది హ్యుందాయ్‌ క్రెటా 1.5 NA పెట్రోల్‌తో పోల్చదగిన స్థాయిలోనే ఉంది. 

మెప్పించే సస్పెన్షన్‌
సియేరా అసలు బలం రైడ్‌ కంఫర్ట్‌. Frequency Selective Damping సస్పెన్షన్‌ వల్ల చెడ్డ రోడ్లపై కూడా కారు చాలా స్థిరంగా ఉంటుంది. 17-ఇంచ్‌ వీల్స్‌, 65 ప్రొఫైల్‌ టైర్లు ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని ఇస్తాయి. మలుపుల్లో కూడా బాడీ కంట్రోల్‌ మెప్పిస్తుంది.

ఇంటీరియర్‌ అయితే టాటా బ్రాండ్‌కు ఒక కొత్త బెంచ్‌మార్క్‌. మెటీరియల్‌ క్వాలిటీ, ఫిట్‌ అండ్‌ ఫినిష్‌ చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. ముందు సీట్లు, వెనుక సీట్లు రెండూ పెద్ద ప్రయాణాలకు బాగా సరిపోతాయి. వెనుక సీట్లో లెగ్‌రూమ్‌, అండర్‌థై సపోర్ట్‌ ఈ సెగ్మెంట్‌లో బెస్ట్‌ అని చెప్పొచ్చు.

ఫీచర్లు
ఫీచర్ల పరంగా కూడా సియేరా ఎక్కడా తగ్గదు. పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్‌, డిజిటల్‌ క్లస్టర్‌, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొత్తానికి, Tata Sierra 1.5 NA పెట్రోల్‌ పవర్‌ ప్రేమికుల కోసం కాదు. కానీ కంఫర్ట్‌, స్పేస్‌, రైడ్‌ క్వాలిటీ, ఫీచర్లు ముఖ్యమని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌. ప్రశాంతంగా ప్రయాణించాలనుకునే కుటుంబాలకు, చాఫర్‌ డ్రైవెన్‌ SUVగా కూడా ఇది బాగా సరిపోతుంది. డ్రైవింగ్‌లో ఉత్సాహం కావాలంటే మాత్రం డీజిల్‌ లేదా టర్బో పెట్రోల్‌ వేరియంట్‌ వైపు చూడాల్సిందే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
హోండా షైన్‌ 125 ఆన్‌రోడ్‌ రేటు ఎంత? కేవలం రూ.10 వేల డౌన్‌పేమెంట్‌తో 3, 4, 5 ఏళ్ల EMI ప్లాన్స్‌
ఈ పండక్కి Honda Shine 125 కొనాలనుకుంటే లోన్‌ ఎంత వస్తుంది? EMI ఎంత పడుతుంది?
లెవెల్‌ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్‌లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?
జర్నీ టైమ్‌లో అదనపు రక్షణ ఇచ్చే ADAS కార్లు.. మిడిల్‌క్లాస్‌ బడ్జెట్‌లోనే కొనవచ్చు!
రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
మిడిల్‌క్లాస్ కోసం హ్యుందాయ్ మోడ్రన్ కారు.. క్రెటా కంటే తక్కువ ధరకే కొత్త SUV!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Embed widget