Book Now Pay Later – IRCTC: రైలు ప్రయాణికులకు అద్భుత అవకాశం, డబ్బులు ఇవ్వకుండా టికెట్ తీసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
భారతీయ రైల్వే ప్రయాణీకులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. IRCTC రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) ఆప్షన్ కల్పిస్తోంది.
IRCTCతో ఇప్పుడే ప్రయాణించండి, తర్వాత చెల్లించండి! అంటూ ప్రయాణీకుల కోసం రైల్వేశాఖ అదిరిపోయే అవకాశాన్ని అందిస్తోంది. డబ్బులు లేకపోయినా.. రైలు టికెట్ తీసుకుని ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ఇకపై IRCTC రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) చెల్లింపు ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఫైనాన్షియల్ వెల్‌నెస్ ప్లాట్‌ఫారమ్ CASHe ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. తాజాగా CASHe ఈ విషయాన్ని వెల్లడించింది. TNPL సదుపాయం భారతీయ రైల్వేలోని ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను తక్షణమే బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మూడు నుంచి ఆరు నెలల వరకు పాకెట్ ఫ్రెండ్లీ EMIలలో చెల్లించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది.
TNPL విధానికి భారీ స్పందన
అటు రిజర్వ్ చేసిన తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం IRCTC ట్రావెల్ యాప్ చెక్ అవుట్ పేజీలో EMI చెల్లింపు ఎంపిక అందుబాటులో ఉంటుందని CASHe తెలిపింది. TNPL EMI చెల్లింపు సదుపాయాన్ని పొందేందుకు ఎంపిక ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని తెలిపింది. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. తాజాగా తీసుకొచ్చిన TNPL విధానం ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడనుందని CASHe వ్యవస్థాపక చైర్మన్ V. రామన్ కుమార్ వెల్లడించారు.
IRCTC అందుబాటులోకి తెచ్చిన EMI చెల్లింపు విధానం డబ్బులు లేకుండా ప్రయాణానికి దూరం అయ్యే వారికి చక్కగా పనికొస్తుందన్నారు. IRCTCతో తమ కొనసాగింపు దేశంలోని డిజిటలైజ్డ్ EMI చెల్లింపులను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యం వల్ల మిలియన్ల మంది IRCTC కస్టమర్‌లను చేరుకునే అవకాశం CASHeకి లభిస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగా రైలు ప్రయాణం చేసి ఆ తర్వాత సులభమైన EMIలలో చెల్లించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందన్నారు.
Read Also: సరికొత్తగా జీప్ గ్రాండ్ చెరోకీ, వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్!
ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తాం
TNPL సేవకు వినియోగదారులను నుంచి మంచి స్పందన వస్తుంది. “ప్రయాణికుల ఇప్పటికే ఈ నూతన వెసులుబాటును వినియోగించుకుంటున్నారు. తమ ప్రయాణాలకు వాయిదాలలో టికెట్ డబ్బులు చెల్లించే ఎంపికను కోరుకుంటున్నారు. CASHe చెక్ అవుట్ లో IRCTC కస్టమర్‌లకు మరింత మెరుగైన సౌలభ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విధానం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాం” అని V. రామన్ కుమార్ వెల్లడించారు. IRCTC ట్రావెల్ యాప్ చెక్ అవుట్ పేజీలో ఒక రకమైన TNPL చెల్లింపు పద్ధతిని పొందుపరిచిన మొదటి ఫిన్‌టెక్ రుణదాతగా CASHe నిలిచింది. ఇక IRCTC అనేది క్యాటరింగ్, టూరిజం, ఆన్‌లైన్ టికెటింగ్ కార్యకలాపాలను నిర్వహించే భారతీయ రైల్వే అనుబంధ సంస్థ. IRCTC ట్రావెల్ యాప్ 90 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. రోజుకు 1.5 మిలియన్లకు పైగా రైల్వే టిక్కెట్ బుకింగ్‌లను కలిగి ఉంది.