News
News
X

Jeep Grand Cherokee: సరికొత్తగా జీప్ గ్రాండ్ చెరోకీ, వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్!

భారత మార్కెట్లోకి జీప్ సరికొత్త కారును తీసుకురాబోతుంది. సరికొత్త జీప్ గ్రాండ్ చెరోకీ పేరుతో వచ్చే నెలలో లాంచ్ చేయబోతున్నది. ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ప్రత్యేకతలు మీకోసం..

FOLLOW US: 
 
స్టైలిష్ కార్ల తయారీ సంస్థ జీప్.. సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. జీప్​ గ్రాండ్​ చెరోకీ ఎస్​యూవీ పేరుతో ఇండియాలో లాంచ్ కానున్నది. వచ్చే నెలలో ఈ కారును వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు జీప్ ఇండియా వెల్లడించింది. ఈ తాజాగా కారుకు సంబంధించిన  టీజర్ ను విడుదల చేసింది. జీప్ ఇండియా లైనప్ లో గ్రాండ్ చెకోరి నాలుగో ఎస్యూవీగా అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే కంపాస్​, వ్రాంగ్​లర్​, మెరీడియన్​ ఎస్యూవీలు భారత మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. ఈ మూడు కార్లు టయోటా కంపెనీకి చెందిన ఫార్చునర్ వాహనానికి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి.   

News Reels

ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న జీప్ ఎస్యూవీలతో పోల్చితే.. జీప్​ గ్రాండ్​ చెరోకీ చాలా ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి  గ్రాండ్​ చెరోకీని తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో 1992లో లాంచ్ అయ్యింది. చాలా కాలం పాటు టాప్ ఎస్యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ ఎడిషన్ గత ఏడాది మార్కెట్లో అడుగు పెట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో హైబ్రిడ్ ఆప్షన్ లోనూ అందుబాటులో ఉంది. భారత్  లో మాత్రం హైబ్రిడ్ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వస్తుందో? లేదో? అనే విషయం పైనా కంపెనీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

గ్రాండ్​ చెరోకీ ఇంజిన్ ప్రత్యేకతలు

అంతర్జాతీయ మార్కెట్​లో గ్రాండ్​ చెరోకీ  5.7లీటర్​ వీ8 ఇంజిన్​ తో అందుబాటులో ఉంది.  ఇది 357 బీహెచ్​పీతో 528 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటర్​ టర్బోఛార్జ్​ పెట్రోల్​ మోటార్​ ఆప్షన్​ సైతం లభిస్తున్నది. ఈ మోటార్ 375 బీహెచ్​పీతో 637 ఎన్​ఎం టార్క్ ​ను అందిస్తున్నది. అటు 3.6లీటర్​ వీ6 పెట్రోల్​ మోటార్​ లో 294హెచ్​పీతో 348ఎన్​ఎం టార్క్ ను అందిస్తున్నది.

Read Also: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ సేఫ్టీ కార్ల లిస్టు ఓసారి చూడండి!

గ్రాండ్​ చెరోకీ ఫీచర్లు, ధర వివరాలు

జీప్​ గ్రాండ్​ చెరోకీ సరికొత్త మోడల్ సైతం.. పాత వాటితో పోలికను కలిగి ఉంటుంది. చూడ్డానికి మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది.   ఫ్రంట్​ గ్రిల్​ని అద్భుతంగా రూపొందించారు.  ఎల్​ఈడీ హెడ్​ లైట్​ యూనిట్స్​ ఇట్టే ఆకట్టుకునేలా తయారు చేశారు. ఇంటీరియర్ విషయానికి వస్తే మరింత అత్యధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది.  10.25 అంగుళాల​ స్క్రీన్​, యాపిల్​కార్​ ప్లే, ఆండ్రాయిడ్​ ఆటోతో పాటు మరికొన్ని నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అటు వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం ప్రత్యేక స్క్రీన్లను ఊర్పాటు చేశారు. స్ట్రీమింగ్​ సైట్స్​ కూడా అందుబాటులో ఉండేలా రూపొందించారు.అంతేకాదు, ఈ కారులో 4G ఇన్ ​బిల్ట్ ​గా రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. 19 స్పీకర్​ సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ​ కొత్త గ్రాండ్ చెరోకీ Mercedes-Benz GLE, BMW X5,  ఆడి Q7తో సహా లగ్జరీ క్లాస్‌ లో చాలా SUVలతో పోటీపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 7-సీటర్ వెర్షన్ కూడా ఉంది. అయితే,  తరగతిలో కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని  5-సీట్ల వేరియంట్‌ ను మాత్రమే భారత్ లో విడుదల చేయబోతున్నది.  ఇక ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ధర వివరాలను జీప్ ఇండియా వెల్లడించలేదు.       

Published at : 18 Oct 2022 03:47 PM (IST) Tags: Jeep India New Jeep Grand Cherokee 2022 Launch Next Month

సంబంధిత కథనాలు

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?