రోజువారీ రన్నింగ్ Hyundai Creta లో బెస్ట్ వేరియంట్ ఏది? ధర, ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి
Hyundai Creta Best Variant: హ్యుందాయ్ క్రెటా మూడు రకాల ఇంజిన్లతో & రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంది. కస్టమర్, తన అవసరాలకు అనుగుణంగా సరైన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

Hyundai Creta Best Variant Price And Features In Telugu: హ్యుందాయ్ క్రెటా అంటే భారతీయులకు చాలా ఇష్టం. ఎందుకంటే, భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన, అమ్ముడవుతున్న కారు ఇది. గత నెల (జులై 2025) లో కూడా, హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా టాప్ ప్లేస్‌లో నిలుచుంది. ప్రస్తుత మార్కెట్లో.. Maruti Grand Vitara & Kia Seltos తో Hyundai Creta పోటీ పడుతుంది. క్రెటాలో మొత్తం 54 వేరియంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు రోజువారీ రన్నింగ్ కోసం క్రెటాను కొనుగోలు చేయాలనుకుంటే, దాని S(O) వేరియంట్ మీకు మంచి ఎంపిక కావచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ధర
Hyundai Creta S(O) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్ & విజయవాడలో రూ. 14.47 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర దాని పెట్రోల్ (CVT ఆటోమేటిక్) ధర & దీని డీజిల్ వేరియంట్ రేటు రూ. 16.05 లక్షలు ఎక్స్-షోరూమ్.
హైదరాబాద్‌లో Hyundai Creta S(O) వేరియంట్‌ను కొనాలంటే.. రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ 2.50 లక్షలు, ఇన్సూరెన్స్ దాదాపు రూ. 73,000, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని, ఈ బండి ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17.85 లక్షలు అవుతుంది.
విజయవాడలో Hyundai Creta S(O) వేరియంట్‌ను కొనాలంటే.. రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ 2.46 లక్షలు, ఇన్సూరెన్స్ దాదాపు రూ. 71,000, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని, ఈ బండి ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17.78 లక్షలు అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాల్లోనూ ఈ వేరింయట్ ఆన్-రోడ్ ధర స్వల్ప మార్పులతో దాదాపు ఇదే స్థాయిలో ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటాను ప్రీమియం SUV అనిపించే అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోర్‌వీలర్ క్యాబిన్ సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారైంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి, ఇవి డ్రైవర్ మీద పనిభారం తగ్గించి & డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా చేస్తాయి.
ఇంకా.. వాయిస్-యాక్టివేటెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఈ కారు ప్రీమియం ఫీల్‌ను మరో లెవెల్‌కు తీసుకువెళ్తుంది. హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్ డిజైన్ సాటిలేనిది & ఇది గొప్ప సీటింగ్ స్పేస్‌తో ఉంది, దూర ప్రయాణాలలో కూడా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అలాగే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లక్షణాలు కూడా ఈ SUV లో ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ & ఇంజిన్ ఎంపికలు
హ్యుందాయ్ క్రెటా మూడు వేర్వేరు ఇంజిన్ ఎంపికల్లో లభ్యమవుతోంది. కస్టమర్, తన అవసరాలకు అనుగుణంగా సరైన ఇంజిన్‌ను ఎంచుకోవచ్చు. ఇంజిన్ ఎంపికల్లో మొదటిది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 115bhp శక్తిని & 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 160bhp శక్తిని & 253Nm టార్క్‌ను అందిస్తుంది, ఇది మరింత శక్తివంతమైన పనితీరును ఇస్తుంది. మూడో ఇంజిన్ ఎంపిక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 116bhp శక్తిని & 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ క్రెటా అన్ని ఇంజన్లు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. కస్టమర్, తన డ్రైవింగ్ శైలి & తనకు ఎదురయ్యే రోడ్డు పరిస్థితుల ప్రకారం సరైన ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు.






















