అన్వేషించండి

Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!

Best 9 Seater SUV: మనదేశంలో అందుబాటులో ఉన్న 9 సీటర్ ఎస్‌యూవీల్లో మహీంద్రా బొలెరో నియో ప్లస్ అనేది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని ధర రూ.11.39 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Mahindra Bolero Neo+: మీరు ఒక పెద్ద కుటుంబానికి తక్కువ బడ్జెట్‌లో కొత్త కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి ఆప్షన్ ఉంది. బొలెరో నియో అప్‌డేటెడ్ మోడల్ అయిన 9 సీటర్ ఎస్‌యూవీ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఎస్‌యూవీ మూడు వరుసల్లో (2-3-4 సీటింగ్ లేఅవుట్) అందుబాటులో ఉంది.

బొలెరో నియో ప్లస్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 11.39 లక్షలుగా ఉంది. మీరు స్కార్పియో క్లాసిక్‌ కాకుండా వేరే ఆప్షన్ కావాలనుకుంటే బొలెరో నియో ప్లస్ కారును కొనుగోలు చేయవచ్చు. ఇందులో పీ4 వేరియంట్ ధర రూ. 11.39 లక్షలు కాగా, పీ10 వేరియంట్ ధర రూ. 12.49 లక్షలుగా ఉంది.

మహీంద్రా బొలెరో నియో+ ఇంజిన్ ఇలా...
మహీంద్రా బొలెరో నియో ప్లస్‌లో 2.2 లీటర్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 120 పీఎస్ పవర్, 280 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో ట్రాన్స్‌మిషన్ కోసం 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. ఇది రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!

మహీంద్రా బొలెరో నియో ప్లస్ క్యాబిన్ గురించి చెప్పాలంటే ఇది ట్విన్ పాడ్ డిస్‌ప్లేతో కొత్త స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో పాటు క్లైమేట్ కంట్రోల్ డయల్‌లను కూడా పొందుతుంది.

బొలెరో నియో ప్లస్ డిజైన్ చూడటానికి బొలెరో నియో తరహాలోనే ఉంటుంది. అయితే దీని ఫ్రంట్ బంపర్‌కి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బుల్ బార్ వంటి ఫీచర్లు జోడించారు. ఈ కారులో కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. బొలెరో నియో ప్లస్... బొలెరో నియో కంటే 405 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. బొలెరో నియో ప్లస్ పొడవు 4,400 మిల్లీమీటర్లుగా ఉంది. అయితే దీని వీల్ బేస్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

మహీంద్రా బొలెరో నియో ప్లస్ 2-3-4 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో మూడు వరుసల సెటప్‌ను కలిగి ఉంది. ఈ కారు చివరి వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్లు ఉన్నాయి. ఈ మహీంద్రా కారులో బ్లూటూత్, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీ కూడా అందించారు.

మరో వైపు మహీంద్రా థార్ మనదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి సేల్స్‌లో ఒక్కసారిగా దూసుకుపోతుంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే రెండు లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటిందంటే మహీంద్రా థార్ ఎంత ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు లక్షల సేల్స్‌లో తాజా‌గా లాంచ్ అయిన థార్ రాక్స్ సేల్స్ కూడా ఉండటం విశేషం. సియామ్ ఇండస్ట్రీ హోల్‌సేల్ డేటా ప్రకారం 2024 అక్టోబర్ నెల చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ మొత్తం అమ్మకాలు కలిపి ఏకంగా 2,07,110 యూనిట్లుగా ఉంది. 2020 సంవత్సరం అక్టోబర్‌ నెలలో మహీంద్రా థార్ మొట్టమొదటి సారిగా భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు లాంచ్ అయిన నాలుగు సంవత్సరాల్లోనే మొత్తంగా రెండు లక్షల సేల్స్ మార్కును దాటడం విశేషం.

Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget