Best Budget Bike: హోండా షైన్ వర్సెస్ బజాజ్ ప్లాటినా - రెండు బడ్జెట్ బైక్‌ల్లో ఏది బెస్ట్?
Honda Shine Vs Bajaj Platina: హోండా షైన్, బజాజ్ ప్లాటినా బైక్‌ల్లో ఏది బెస్ట్?
Bajaj Platina vs Honda Shine: ప్రజలు బైక్ కొనడానికి వెళ్లినప్పుడల్లా తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే బైక్‌ను కనుగొనడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మెరుగైన మైలేజీకి పేరుగాంచిన ఇలాంటి బైక్‌లు భారత మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఈ బైక్‌లలో బజాజ్ ప్లాటినా, హోండా షైన్ ఉన్నాయి. బజాజ్ ప్లాటినా, హోండా షైన్‌ల్లో ఏ బైక్ ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
కంపెనీ బజాజ్ ప్లాటినా 100లో 102 సీసీ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 పీఎస్ పవర్‌తో 8.3 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలు. ఈ బైక్‌లో డ్రమ్ బ్రేక్‌లు అందించారు. దీనితో పాటు ఇది 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కూడా పొందుతుంది. డీఆర్ఎల్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ బైక్‌లో కనిపిస్తాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
హోండా షైన్ (Honda Shine)
హోండా షైన్ బైక్ గురించి చెప్పాలంటే ఈ శక్తివంతమైన బైక్ 123.94 సీసీ, 4 స్ట్రోక్, ఎస్ఐ, బీఎస్ 6 ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 7,500 ఆర్పీఎం వద్ద 7.9 కేడబ్ల్యూ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ బైక్ ఐదు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
బజాజ్ ప్లాటినా, హోండా షైన్‌లలో ఎవరు బెటర్?
బజాజ్ ప్లాటినా 100 అత్యధిక మైలేజీని ఇచ్చే బైక్‌లలో ఒకటి అని చెప్తారు. బజాజ్ ప్లాటినా 100 మైలేజ్ లీటరుకు 72 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. హోండా షైన్ 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఈ బైక్ ఒక్క ట్యాంక్ ఫిల్‌పై 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కాబట్టి ఈ రెండు బైక్‌లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
The Honda Hornet 2.0's ABS system enhances braking control, especially on slippery surfaces. It prevents wheel lock, keeping you safe as you Fly Against The Wind.#Honda #ThePowerOfDreams #Hornet pic.twitter.com/I5I8BdeYyy
— Honda 2 Wheelers India (@honda2wheelerin) December 23, 2024
Save 50% on everyday riding costs! Bajaj Freedom gets you from Mumbai to Pune (150 km) with an incredible CNG mileage of 100 km/kg. Experience the freedom to ride longer, save more, and go green!
— Bajaj Auto Ltd (@_bajaj_auto_ltd) October 9, 2024
( Bajaj Freedom, Ride The Change, CNG Bike, Innovation On Wheels, Bajaj CNG bike ) pic.twitter.com/x1SHFQzWNM