Bajaj Freedom 125: సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125 - కేవలం ఆరు నెలల్లోనే ఏకంగా!
Bajaj Freedom 125 Sales: బజాజ్ ఫ్రీడమ్ 125 సేల్స్‌లో దూసుకుపోతుంది. లాంచ్ అయిన ఆరు నెలల్లోనే ఏకంగా 40 వేలకు పైగా యూనిట్లు అమ్ముడు పోయాయి.

Bajaj Freedom 125 Price: బజాజ్ ఆటో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేసి చరిత్ర సృష్టించింది. బజాజ్ సీఎన్‌జీ మోటార్‌సైకిల్ ఫ్రీడమ్ 125ను ప్రజలు ఇష్టపడుతున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 గత సంవత్సరం జూలైలో మార్కెట్లో లాంచ్ అయింది. ఆటోకార్ ప్రొఫెషనల్ నివేదిక ప్రకారం ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించి 40 వేలకు పైగా యూనిట్లు గత ఆరు నెలల్లో అమ్ముడయ్యాయి.
బజాజ్ ఫ్రీడమ్ 125
బజాజ్ ఫ్రీడమ్ 125 మార్కెట్లో NG04 డిస్క్ LED, NG04 డ్రమ్ LED, NG04 డ్రమ్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ బజాజ్ బైక్ ఐదు కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ఈ సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌లో రేసింగ్ రెడ్, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్, ప్యూటర్ గ్రే, కరేబియన్ బ్లూ రంగులు ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 89,997 నుంచి ప్రారంభమై రూ. 1,09,997 వరకు ఉంటుంది.
ఫ్రీడమ్ 125 పవర్ ఎలా ఉంటుంది?
బజాజ్ ఫ్రీడమ్ 125 సీసీ, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ ఇంజిన్ 8,000 ఆర్పీఎం వద్ద 9.5 పీఎస్ పవర్‌ని, 5,000 ఆర్పీఎం వద్ద 9.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో ఈ మోటార్‌సైకిల్ 330 కిలోమీటర్ల రేంజ్‌ని, 91 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది. బజాజ్ తీసుకొస్తున్న ఈ సీఎన్‌జీ బైక్ రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
బజాజ్ లాంచ్ చేసిన ఈ సీఎన్‌జీ బైక్‌ను అవసరమైతే పెట్రోల్ మోడ్‌లో కూడా నడపవచ్చు. సీఎన్‌జీ మోడ్‌లో ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 90.5 కిలోమీటర్లు కాగా, పెట్రోల్ మోడ్‌లో ఇది 93.4 కిలోమీటర్లుగా ఉంది. ఈ బైక్ సీఎన్‌జీ మోడ్‌లో 200 కిలోమీటర్లు, పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
సీఎన్‌జీ బైక్ సెక్యూరిటీ ఫీచర్లు ఇవే...
బజాజ్ ఫ్రీడమ్ 125 ట్యాంక్ షీల్డ్‌తో కూడిన ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లో పెసో సర్టిఫైడ్ సీఎన్‌జీ సిలిండర్ ఉంది. దీంతో పాటు ముందు వైపు లుక్ కోసం ఫోర్క్ స్లీవ్స్ ప్రొటెక్టర్ కూడా ఇన్‌స్టాల్ చేశారు. బైక్ ఫీచర్ల గురించి చెప్పాలంటే... ఈ బజాజ్ మోటార్‌సైకిల్‌లో పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. దానితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Ride smarter, not harder! Say goodbye to hefty fuel bills and get powered by CNG, that slashes your fuel costs by 50% on every ride! 🌱💸 Eco-friendly, pocket-friendly, and adventure-ready. 🌍✨
— Bajaj Auto Ltd (@_bajaj_auto_ltd) January 7, 2025
Don’t be shy. Tell us what you’ll do once you start saving.👇 pic.twitter.com/boQhBAb5yz





















