అన్వేషించండి

మంచి డిస్కౌంట్‌లో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - కానీ ఒకే ఒక్క షరతు!

Bajaj Chetak C25 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ.4,299 డిస్కౌంట్‌ ప్రకటించింది బజాజ్‌. ఇది ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌. ఈ ఆఫర్ వివరాలతో పాటు ధర, రేంజ్‌, ఫీచర్ల గురించి కూడా తెలుసుకోండి.

Bajaj Chetak C25 Discount Details: భారత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో పోటీ భారీగా పెరగడంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు, బజాజ్‌ ఆటో తాజాగా లాంచ్‌ చేసిన Bajaj Chetak C25 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై ప్రత్యేక ధర తగ్గింపు ప్రకటించింది. అయితే ఈ డిస్కౌంట్‌కు ఒక షరతు ఉంది. ఇది ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌. అంటే, మొదట వచ్చిన వాళ్లకే ఈ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. మొదటి 10,000 మంది కొనుగోలుదారులకు రూ.4,299 డిస్కౌంట్‌ బెనిఫిట్‌ అందిస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన Bajaj Chetak C25 (C2501 వేరియంట్‌) ధరను బజాజ్‌ రూ.91,399 (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. ఇప్పుడు రూ.4,299 ధర తగ్గింపుతో ఈ స్కూటర్‌ను రూ.87,100 ఎఫెక్టివ్‌ ధరకు కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఆసక్తి ఉన్నవారు బజాజ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేయవచ్చు లేదా సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

చేతక్‌ సిరీస్‌లో అత్యంత అందుబాటు మోడల్‌

కొత్త Chetak C25, చేతక్‌ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా ఇది నిలుస్తోంది. తక్కువ ధరకు అనుగుణంగా రేంజ్‌, టాప్‌ స్పీడ్‌ కొంచెం తగ్గించినా, నగర వినియోగానికి సరిపడే పనితీరుతో ఈ మోడల్‌ను బజాజ్‌ తీసుకొచ్చింది. మార్కెట్‌లో ఇది Ola S1 X, Hero Vida VX2, TVS Orbiter వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.

బ్యాటరీ, రేంజ్‌, పనితీరు

Bajaj Chetak C25లో 2.5kWh ఫ్లోర్‌బోర్డ్‌ మౌంటెడ్‌ బ్యాటరీ ఇచ్చారు. దీనికి హబ్‌ మౌంటెడ్‌ మోటార్‌ జత చేశారు. ఈ మోటార్‌ 1.8kW కంటిన్యూయస్‌ పవర్‌, 2.2kW పీక్‌ పవర్‌ను అందిస్తుంది.

బజాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కూటర్‌ ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 113 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. 750W ఛార్జర్‌తో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి సుమారు 3 గంటల 45 నిమిషాలు పడుతుంది.

డిజైన్‌లో చిన్న మార్పులు

డిజైన్‌ పరంగా Chetak C25లో చిన్నవి, కానీ ఉపయోగకరమైన మార్పులు చేశారు. ముందు ఎప్రాన్‌ను రీడిజైన్‌ చేయడంతో స్కూటర్‌కు మరింత క్లీన్‌ లుక్‌ వచ్చింది. టర్న్‌ ఇండికేటర్లను ఎప్రాన్‌ నుంచి హ్యాండిల్‌బార్‌కు మార్చారు. చేతక్‌కు గుర్తింపుగా నిలిచే హార్స్‌షూ షేప్‌ హెడ్‌ల్యాంప్‌ అలాగే కొనసాగుతోంది. దీని చుట్టూ LED డే టైమ్‌ రన్నింగ్‌ లైట్‌ను అందించారు.

వెనుక భాగంలో కొత్తగా హారిజాంటల్‌ లేఅవుట్‌ టెయిల్‌ల్యాంప్‌ ఇచ్చారు. ముందు వాడిన స్ప్లిట్‌ డిజైన్‌కు బదులుగా ఇది మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది. సీటును కూడా రీడిజైన్‌ చేసి, 650 మిల్లీమీటర్ల పొడవుతో ఫ్లాట్‌గా రూపొందించారు. సీట్‌ హైట్‌ 763 మిల్లీమీటర్లు.

ఫీచర్లు, రంగులు

LCD ఇన్‌స్ట్రుమెంట్‌ డిస్‌ప్లే, కీ బేస్డ్‌ ఇగ్నిషన్‌, ట్విన్‌ సైడెడ్‌ స్వింగ్‌ ఆర్మ్‌, ఓపెన్‌ గ్లౌవ్‌బాక్స్‌, పూర్తిగా LED లైటింగ్‌, 25 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌, రివర్స్‌ అసిస్ట్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌, USB ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్‌ను గ్రీన్‌, వైట్‌, బ్లాక్‌, గ్రే‌, రెడ్‌, యెల్లో రంగుల్లో అందిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, డిస్కౌంట్‌తో Bajaj Chetak C25 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇటు సిటీకి, అటు టౌన్‌కు ఒక ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. అయితే ఈ ధర తగ్గింపు మొదటి 10,000 మందికే కాబట్టి ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాల్సిందే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget