అన్వేషించండి

మిస్సింగ్‌ ఫీచర్లు: రైవల్స్‌ ఇచ్చాయి, 2026 Renault Duster ఇవ్వలేదు - ఇవి కూడా ఉంటే గేమ్‌ చేంజర్‌ అయ్యేది

2026 Renault Duster స్టైలింగ్‌, టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. అయితే, ఇది లేటెస్ట్‌ కారే అయినప్పటికీ కొన్ని విషయాల్లో వెనుకబడింది, కొంత నిరాశ మిగిల్చింది.

2026 Renault Duster Price And Specifications: భారత మార్కెట్‌లో రెనాల్ట్‌ కొత్త తరం డస్టర్‌ను అధికారికంగా పరిచయం చేసినప్పటి నుంచి SUV అభిమానుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. ఒకప్పుడు డస్టర్‌ అంటే రగ్గడ్‌ డిజైన్‌, బలమైన ఇంజిన్‌, చెడ్డ రోడ్లపై కూడా నమ్మకమైన డ్రైవ్‌ ఇస్తుంది అన్న భావన ఉండేది. అదే DNAను కొనసాగిస్తూ 2026 Renault Duster‌ను మరింత ఆధునికంగా, ఫ్యూచర్‌ రెడీగా తీసుకొచ్చింది కంపెనీ.

కొత్త డస్టర్‌లో అద్భుతమైన లుక్‌, ఆకర్షణీయమైన డిజైన్‌, ఆధునిక పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు, ఎన్నో కంఫర్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్‌ సీట్లకు పవర్డ్‌, వెంటిలేటెడ్‌ ఫంక్షన్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, అంబియంట్‌ లైటింగ్‌, 10.1 ఇంచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌స్క్రీన్‌ వంటి అంశాలు ముందు సీట్లో కూర్చునే వారికి మంచి అనుభూతిని ఇస్తాయి. అయితే, అన్ని విషయాల్లోనూ డస్టర్‌ పర్ఫెక్ట్‌ కాదని కొందరు భావిస్తున్నారు.

మొదటి లోపం - వెనుక సీటు ప్రయాణికులకు తక్కువ ఫీచర్లు

కొత్త డస్టర్‌లో రియర్‌ సీట్‌ స్పేస్‌ సరిపడా ఉన్నా, ఇదే సెగ్మెంట్‌లోని టాటా సియెర్రా, కియా సెల్టోస్‌ వంటి కార్లతో పోలిస్తే కొంత వెనుకబడినట్టు అనిపిస్తుంది. రియర్‌ సన్‌షేడ్స్‌, రెండు దశల రిక్లైన్‌ ఫంక్షన్‌, బాస్‌ మోడ్‌ వంటి ఫీచర్లు డస్టర్‌లో లేకపోవడం గమనార్హం. పానోరమిక్‌ సన్‌రూఫ్‌ ఉండటం వల్ల క్యాబిన్‌లో వెలుతురు బాగా వస్తున్నా, వెనుక సీటు వెంటిలేషన్‌ ఉంటే డస్టర్‌కు మరింత ప్లస్‌ అయ్యేది.

రెండో లోపం - లాంచ్‌లో AWD ఆప్షన్‌ లేకపోవడం

డస్టర్‌ అంటే చాలామందికి ఇప్పటికీ ఆఫ్‌రోడ్‌ ఇమేజ్‌ గుర్తుకొస్తుంది. పాత తరం డస్టర్‌లో AWD ఆప్షన్‌ ఉండేది. అయితే 2026 మోడల్‌లో ఆ ఆప్షన్‌ను రెనాల్ట్‌ తీసేయడం కొంతమంది అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం మారుతి గ్రాండ్‌ విటారా, విక్టోరిస్‌, టయోటా హైరైడర్‌ వంటి SUVలు AWD ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. డస్టర్‌కు 212mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 26.9 డిగ్రీల అప్రోచ్‌ యాంగిల్‌, 34.7 డిగ్రీల డిపార్చర్‌ యాంగిల్‌ ఉన్న నేపథ్యంలో... AWD కూడా ఉంటే అడ్వెంచర్‌ లవర్స్‌కు అదిరిపోయే ఎంపిక అయ్యేది.

మూడో లోపం - డీజిల్‌ ఇంజిన్‌ లేకపోవడం

పాత డస్టర్‌లో 1.5 లీటర్‌ K9K డీజిల్‌ ఇంజిన్‌ చాలా మందికి ఫేవరెట్‌. 110hp శక్తితోనే అది ఇచ్చే పంచ్‌, డ్రైవ్‌ ఫీల్‌ ప్రత్యేకంగా నిలిచేవి. కానీ 2026 డస్టర్‌లో డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌ లేదు. ఇది మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో పెద్ద మిస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే క్రెటా, సెల్టోస్‌, సియెర్రా వంటి కార్లు ఇప్పటికీ డీజిల్‌ ఆప్షన్‌తో వస్తున్నాయి.

డీజిల్‌ లోటును పూడ్చేందుకు రెనాల్ట్‌ కొత్త 1.8 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ను అందిస్తోంది. ఇది సుమారు 160hp శక్తిని ఇచ్చే అవకాశం ఉంది. ఈ హైబ్రిడ్‌ డస్టర్‌ దీపావళి సమయంలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. మంచి మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ చెబుతున్నా, డీజిల్‌ ఇంజిన్‌ అభిమానుల మనసు మాత్రం ఇంకా మారలేదనే చెప్పాలి.

మొత్తానికి, కొత్త Renault Duster డిజైన్‌, టెక్నాలజీ పరంగా బలంగా ఉన్నా, ఈ మూడు అంశాలు కూడా ఉంటే ఇది నిజంగా కంప్లీట్‌ మిడ్‌సైజ్‌ SUVగా నిలిచేది. రెనాల్ట్‌, భవిష్యత్‌లోనైనా ఈ లోపాలను సరిదిద్దుతుందేమో చూడాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget