అన్వేషించండి

Bajaj Chetak New Variant: బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ కొత్త వేరియంట్‌ వచ్చేసింది - ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Bajaj Chetak Blue 3202 Launched: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే బజాజ్ చేతక్ బ్లూ 3202. దీని ఎక్స్ షోరూం రూ.1.15 లక్షలుగా ఉంది.

Bajaj Chetak Blue 3202: బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బజాజ్ చేతక్ తీసుకువచ్చిన ఈ కొత్త వేరియంట్ బ్లూ 3202. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటంటే ఈ మోడల్ మునుపటి వేరియంట్ కంటే చవకగా ఉంటుంది. ఆ వేరియంట్‌ల కంటే ఎక్కువ రేంజ్‌ని కూడా ఇస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 137 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

బజాజ్ చేతక్ బ్లూ 3202 ధర ఎంత?
బజాజ్ ఆటో చేతక్ బ్లూ 3202 అనే పేరుతో కొత్త వేరియంట్‌‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బజాజ్ చేతక్ తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు. చేతక్ బ్లూ 3202 ధర దాని అర్బన్ వేరియంట్ కంటే రూ. 8 వేలు తక్కువ. అదే సమయంలో దాని ప్రీమియం వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.48 లక్షలుగా ఉంది.

ఇతర స్కూటర్ల మాదిరిగానే ఈ బజాజ్ స్కూటర్‌కు సంబంధించి కూడా అదనపు ధర చెల్లించి టెక్‌ప్యాక్  వస్తుంది. స్కూటర్‌తో పాటు దీన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు మరిన్ని ఫీచర్లను పొందుతారు.

బజాజ్ చేతక్ కొత్త వేరియంట్ ఏ ఫీచర్లను పొందుతుంది?
కొత్త చేతక్ బ్లూ 3202 గుర్రపు డెక్క ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన ఐకానిక్ స్పోర్టింగ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. ఈ ఈవీలో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ చేతక్ స్కూటర్ రేంజ్‌ని పెంచడానికి స్పోర్ట్, క్రాల్ మోడ్‌లతో పాటు ఎకో మోడ్ కూడా జోడించారు.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

బజాజ్ చేతక్ బ్లూ 3202 దేనికి పోటీ ఇస్తుంది?
బజాజ్ చేతక్ బ్లూ 3202 మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చేందుకు వచ్చింది. ఇది ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఉన్న ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు ప్రత్యర్థిగా ఉండనుంది. మార్కెట్లో ఈ స్కూటర్ల విక్రయాల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

ప్రారంభమైన బుకింగ్స్
బజాజ్ ఆటో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. దీన్ని కేవలం రూ. 2000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ మార్కెట్‌లో నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మ్యాట్ కోర్స్ గ్రే కలర్ ఉన్నాయి. 

Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
PhonePe IPO: ఐపీవోకు సిద్ధమవుతున్న ఫోన్‌పే - పేటీఎం నుంచి పాఠాలు నేర్చుకుని మరీ జాగ్రత్తలు
ఐపీవోకు సిద్ధమవుతున్న ఫోన్‌పే - పేటీఎం నుంచి పాఠాలు నేర్చుకుని మరీ జాగ్రత్తలు
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
PhonePe IPO: ఐపీవోకు సిద్ధమవుతున్న ఫోన్‌పే - పేటీఎం నుంచి పాఠాలు నేర్చుకుని మరీ జాగ్రత్తలు
ఐపీవోకు సిద్ధమవుతున్న ఫోన్‌పే - పేటీఎం నుంచి పాఠాలు నేర్చుకుని మరీ జాగ్రత్తలు
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
Embed widget