Ather Electric: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న ఏథర్ - అతి తక్కువ కాలంలోనే!
Ather Energy Sales: ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ మనదేశంలో రెండు లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది.
Ather Electric Scooters: ఈవీ స్టార్టప్ ఏథర్ లాంచ్ అయినప్పటి నుంచి 2 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించడం ద్వారా భారతదేశంలో గణనీయమైన మైలురాయిని సాధించింది. ఈ సంవత్సరం జనవరిలో కంపెనీ లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. మరో సంవత్సరం లోపే లక్ష మంది వినియోగదారులను ఈవీలతో కనెక్ట్ చేయగలిగింది.
ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ లాంచ్ త్వరలో
కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో 450ఎస్, 450ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఇది కాకుండా స్పోర్టియర్ ఏథర్ 450 అపెక్స్‌ని 2024 జనవరిలో విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్ ప్రారంభమైంది. దీన్ని 2024 మార్చి నుంచి డెలివరీ చేయనున్నారు.
ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
450 అపెక్స్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే దాని గురించి కొంత సమాచారం ఇంకా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉండనుంది. ఇది వేగం కోసం ర్యాప్ ప్లస్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ట్రాన్స్‌పరెంట్ బాడీ ప్యానెల్స్‌ను చూడవచ్చు.
కొత్త స్కూటర్ కూడా
450 అపెక్స్‌తో పాటు, ఏథర్ ఫ్యామిలీ సెంట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దాని వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ స్కూటర్‌ని చాలాసార్లు పరీక్షించారు. 2024లో ఎప్పుడైనా ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఏథర్ 450ఎక్స్
ఏథర్ నుంచి అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్‌ల్లో 450ఎక్స్ ఉన్నాయి. ఇందులో 6.2 కేడబ్ల్యూ మోటార్, 3.7 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉన్నాయి. ఈ సెటప్‌తో స్కూటర్ 105 కిలోమీటర్ల (ఎకో మోడ్) రేంజ్‌ను పొందుతుంది. గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది కాకుండా ఏథర్ 450ఎక్స్‌లో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంది. ఫీచర్ల పరంగా ఇది సింగిల్ రైడ్ మోడ్, గ్రే స్కేల్ డ్యాష్‌బోర్డ్‌తో ఏడు అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ను పొందుతుంది. ఈ స్కూటీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 15 గంటల 20 నిమిషాలు పడుతుంది.
మరోవైపు 2024లో టాటా.ఈవీ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ రూపంలో పెద్ద లాంచ్‌కు సిద్ధం అయింది. టాటా కర్వ్ 4 మీటర్ ప్లస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్పేస్‌లో ఉన్న కార్లతో పోటీపడుతుంది. హారియర్, నెక్సాన్ మధ్య స్థానంలో ఈ కర్వ్ ఈవీ ఉండనుంది. మొదటగా కర్వ్ ఈవీని మార్కెట్లోకి తీసుకురానున్నారు. దాని పెట్రోల్ వేరియంట్ తరువాత లాంచ్ కానుంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కారును మొదట ప్రదర్శించారు. టాటా కర్వ్‌ను మిగతా ఎలక్ట్రిక్ కార్ల నుంచి ప్రత్యేకంగా చేసే ఒక పెద్ద విషయం అది అందించే అద్భుతమైన రేంజ్. నెక్సాన్ ఈవీ కంటే కర్వ్ సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ దూరాన్ని కవర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!