(Source: ECI/ABP News/ABP Majha)
Ather 450S Delay: ఆలస్యం అవుతున్న ఏథర్ 450ఎస్ డెలివరీలు - ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయంటే?
ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి.
Ather 450S Electric Scooter: ఏథర్ 450ఎస్ లాంచ్ సమయంలో కంపెనీ దీని డెలివరీ ఆగస్టు చివరి వారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు దీన్ని సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఏథర్ 450S రోల్ అవుట్ కోసం కంపెనీ టైమ్‌లైన్‌ను కూడా సెట్ చేసింది. తన ఎక్స్ (ట్విట్టర్) సోషల్ మీడియా ఖాతాలో ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా కంపెనీ హోసూర్ ప్లాంట్ నుంచి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ స్పెక్ 450ఎస్ ఫొటోలను షేర్ చేశారు.
ఏథర్ 450ఎస్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 450ఎక్స్ కంటే కొంచెం దిగువ స్థాయిలో ఉండనుంది. దీనికి పోటీ అయిన ఓలా ఎస్1 ఎయిర్ కూడా ఇటీవలే లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. కానీ ఏథర్ 450ఎస్ డెలివరీలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
ధర ఎంత ఉంది?
ఏథర్ 450ఎస్ ధరను రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇది ప్రారంభ ధర అని కంపెనీ ప్రకటించిన విషయం గమనించాలి. భవిష్యత్తులో దీని ధర మరింత పెరుగుతుందా లేదా అన్నది ఈ స్కూటర్‌కు వచ్చే రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏథర్ 450ఎస్‌ను ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 115 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
ఏథర్ 450ఎస్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఏథర్ టాప్ ఎండ్ మోడల్ 450ఎక్స్ టాప్ స్పీడ్ కూడా ఇంతే. ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే... ఏథర్ 450ఎస్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న ఏథర్ స్కూటర్లలో ఇదే అత్యంత చవకైనది కావడం విశేషం.
ఓలా జులైలో తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 కోసం బుకింగ్ విండోను ఓపెన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత కంపెనీ సీఈవో భవిష్య అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అప్పటికే కంపెనీ 3,000 బుకింగ్‌లను అందుకున్నట్లు తెలిపారు. బుకింగ్స్ ప్రారంభం అయిన కేవలం కొన్ని గంటల్లోనే ఈ ఫీట్‌ను ఓలా ఎస్1 ఎయిర్ సాధించడం విశేషం.
ఓలా ఇప్పటికే తన ఎస్1 వేరియంట్ తయారీని నిలిపివేసింది. అంటే ఇప్పుడు కంపెనీకి సంబంధించి కేవలం రెండు ఎంట్రీ లెవల్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది తాజాగా లాంచ్ అయిన ఎస్1 ఎయిర్ కాగా, మరొకటి కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ స్కూటీ అందించగలదని కంపెనీ తెలిపింది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial