Aprilia RS 457: ఏప్రిలియా సూపర్ బైక్ ప్రొడక్షన్ స్టార్ట్ - ధర ఎంతంటే?
Aprilia New Bike: ఏప్రిలియా కొత్త బైక్ ఆర్ఎస్ 457 సూపర్ బైక్ తయారీ ప్రారంభం అయిందని తెలుస్తోంది.
Aprilia RS 457 Production: ఏప్రిలియా ఆర్ 457 సూపర్ బైక్ భారతదేశంలో గత నెలలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.4.1 లక్షలుగా ఉంది. గతేడాది ఏప్రిల్‌లో బీఎస్6 స్టేజ్ 2 నిబంధనలను అమలు చేయడంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్ని బైక్‌లు నిలిపివేశారు. తర్వాత ఏప్రిలియా ఇండియన్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లోకి తిరిగి ప్రవేశించింది. మాతృ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని తన ఫెసిలిటీలో ఏప్రిలియా ఈ కొత్త స్పోర్ట్స్ బైక్‌ను తయారు చేయడం ప్రారంభించిందని కొత్త మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలోని బారామతిలో ఈ ఫెసిలిటీ ఉంది. దీని డెలివరీ 2024 మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పెసిఫికేషన్‌లు
ఏప్రిలియా ఆర్ఎస్ 457కి పవర్ ఇవ్వడానికి 457 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అందించారు. ఇది 47 బీహెచ్‌పీ పవర్‌ని, 48.8 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఈ మోటార్‌సైకిల్లో రైడ్ బై వైర్ థ్రోటిల్, ఆప్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
పూర్తిగా ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ అయిన ఆర్ఎస్ 457 ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్, రివర్స్డ్ ఫ్రంట్ ఫోర్క్‌లపై సస్పెన్షన్, వెనుక మోనో షాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ఇది 4 పిస్టన్ కాలిపర్‌తో పెయిర్ అయిన 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 220 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తో పెయిర్ అయి ఉంది. ఈ బైక్‌కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. దీని బరువు దాదాపు 175 కిలోలుగా ఉంది.
ఫీచర్ల గురించి చెప్పాలంటే ఆర్ఎస్ 457లో ఐదు అంగుళాల టీఎఫ్‌టీ కలర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, బ్యాక్‌లిట్ స్విచ్‌గేర్, మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. స్టైలింగ్ విషయంలో చెప్పాలంటే ఇది పూర్తిగా ఫెయిర్డ్ బాడీ, ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, స్ప్లిట్ సీట్లు, ఫ్లోటింగ్ టెయిల్ సెక్షన్‌తో కూడిన ఆర్ఎస్ 660, ఆర్ఎస్ వీ4 వంటి పెద్ద ఏప్రిలియా స్పోర్ట్స్ బైక్‌ల నుంచి ప్రేరణ పొందింది.
మరోవైపు టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను పంచ్ ఈవీ ద్వారా పరిచయం చేసింది. ఇది రాబోయే కొన్ని వారాల్లో అమ్మకానికి అందుబాటులోకి రానుంది. టాటా ఆక్టీ.ఈవీ (Tata Acti.EV) అని పిలిచే ఈ కొత్త ఆర్కిటెక్చర్ దీర్ఘకాలిక సామర్థ్యం కోసం ప్రిస్మాటిక్ సెల్‌లు, మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కెపాసిటీతో కూడిన సిలిండ్రికల్ సెల్స్‌తో సహా ఎక్కువ బ్యాటరీ ప్యాక్‌లకు మద్దతు ఇస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌లకు సపోర్టింగ్ ఫీచర్ కూడా ఉంది. ఆక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్ 400 వోల్ట్‌లతో నడవడం విశేషం.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!