అన్వేషించండి

Affordable Electric Scooters: బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ. 44,000 నుంచి ప్రారంభం

Affordable Electric Scooter: బడ్జెట్ ధరలలో భారత ఆటో మార్కెట్లో లభించే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. వాటి బడ్జెట్, ఫీచర్లు, సర్వీస్ వివరాలు తెలుసుకున్నాక కొనడం మంచిది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. దాంతో ముడిచమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు పర్యావరణహితం కోసం, ఇంధన ధరల్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఫోకస్ చేస్తున్నారు. అందుకే కొంతకాలం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఆటో మార్కెట్లో తక్కువ ధరకే మంచి రేంజ్, తక్కువ ఖర్చు, ఈజీ మెయింటెనెన్స్‌తో వచ్చే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే బడ్జెట్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అటు సిటీ రైడింగ్‌తో పాటు టైర్ 2 సిటీలలోనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు.

భారత్‌లో ఆటో మార్కెట్లో ప్రస్తుతం కేవలం 45 వేల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా లక్ష రూపాయల పైగా సైతం అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. బడ్జెట్ ధరలో లభించే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

హీరో విడా వీఎక్స్2 (Hero Vida VX2)
బడ్జెట్ ధరలో లభించే ఈవీ స్కూటర్ల జాబితాలో Hero MotoCorp కంపెనీకి చెందిన Hero Vida VX2 ఉంది. ఇది చాలా పొదుపైన ఎంపికగా చెప్పవచ్చు. దీని ధరను తక్కువ చేయడానికి కస్టమర్ల కోసం కంపెనీ 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (BaaS) వంటి ఆప్షన్‌ను అందిస్తోంది. ఈ ఫెసిలిటీ ద్వారా మీరు ఈవీ స్కూటర్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ కోసం విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఇస్తారు. అంటే మీరు బ్యాటరీని ఇంటికి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు. బయట ఛార్జింగ్ స్టేషన్లలో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఈవీ రేంజ్ దాదాపు 140 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాంతో రోజువారీ జర్నీ చేసేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 44,990 రూపాయలు కావడం విశేషం.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
ఇది కాకుండా TVS కంపెనీకి చెందిన TVS iQube కూడా కస్టమర్ల నమ్మకం పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ధర కొంచెం ఎక్కువ అనిపిస్తున్నప్పటికీ ఇది నాణ్యత, సర్వీస్ నెట్‌వర్క్, స్మూత్ రైడింగ్‌ వల్ల విక్రయాలు పెరుగుతున్నాయి.  ఇందులో మీకు దాదాపు 100 నుండి 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే పలు వేరియంట్లు ఉన్నాయి. బ్యాటరీ ప్లాన్‌తో కలిపితే (ఎక్స్-షోరూమ్) దీని ప్రారంభ ధర రూ. 60,000 ఉంటుంది. 

ఓలా సహా ఇతర ఎలక్ట్రిక్ స్కూటీలు
Ola S1 Z ఈ విభాగంలో ప్రజాదరణ పొందిన మోడల్. ఈవీ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 146 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే డెలివరీ, గిగ్ వర్కర్ల కోసం Ola Gig కేవలం 49,999 ధరలోనే అందుబాటులో ఉంది. Komaki XGT KM, గ్రీన్ ఈవీ విస్టా (Green EV Vista) వంటి మోడల్స్ కూడా రూ. 55,000 నుండి 60,000 వేల రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎథర్ రిజ్టా (Ather Rizta)
మీరు కొంచెం ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే Ather Energy కి చెందిన Ather Rizta ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్. ఈ కంపెనీ స్కూటర్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు స్మార్ట్ ఫీచర్లు, బెస్ట్ పనితీరుకు పేరుగాంచాయి. దీని ధర (ఎక్స్-షోరూమ్) 76,000 రూపాయలు. ఈ స్కూటర్‌లో మెరుగైన సాఫ్ట్‌వేర్, ఫాస్ట్ ఛార్జింగ్ సహా కనెక్టెడ్ ఫీచర్లు లభిస్తాయి.

ఈ స్కూటర్లు కూడా బెస్ట్.. 
Bajaj Auto కి చెందిన Bajaj Chetak, Ola స్కూటర్లు కూడా ఈ సెగ్మెంట్‌లో చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు  మంచి డిజైన్, నమ్మకమైన పనితీరుతో వస్తాయి. కొన్ని ఎంట్రీ-లెవల్ మోడల్స్ రూ. 70,000 కన్నా తక్కువ ధరకే లభిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget