అన్వేషించండి

Best Electric Scooters in India : పెట్రోల్ కష్టాలకు చెక్.. అదిరిపోయే రేంజ్‌తో 2026 టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఆప్షన్లు!

Best Electric Scooters in India : ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి టాప్ బ్రాండ్ల నుండి నమ్మకమైన ఈవీ స్కూటర్ల ధరలు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి, విభిన్న మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.
  • TVS iQube, Ather Rizta, Bajaj Chetak, Hero Vida, Suzuki e-Access ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ స్కూటర్లు 94 కి.మీ నుండి 212 కి.మీ వరకు రేంజ్, పలు వేరియంట్లలో లభిస్తున్నాయి.
  • భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

Best Electric Scooters in India : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ పుంజుకుంటోంది. కొత్త స్టార్టప్‌లతో పాటు పాత దిగ్గజ కంపెనీలు కూడా ఈ రేసులోకి దూకుతున్నాయి. కస్టమర్లకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే మీ శ్రమను తగ్గించడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో వంటి నమ్మకమైన బ్రాండ్ల నుండి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ ముందు వరుసలో ఉంటుంది. టీవీఎస్ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ఇందులో ఐక్యూబ్, ఐక్యూబ్ S, ఐక్యూబ్ ST అనే మూడు వేరియంట్లు లభిస్తాయి. దీని ప్రారంభ ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) కాగా, హై-స్పెక్ మోడల్ ధర రూ. 1.61 లక్షల వరకు ఉంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఇది 94 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 212 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో 5.3 kWh పెద్ద బ్యాటరీ యూనిట్ కూడా అందుబాటులో ఉంది.

ఏథర్ రిజ్వా (Ather Rizta):

కుటుంబ అవసరాలకు తగ్గట్లుగా రూపొందించిన ఏథర్ రిజ్వా ఇప్పుడు ఫ్యామిలీస్ ఫేవరెట్ ఛాయిస్ గా మారింది. దీని ఫంక్షనల్ డిజైన్, కంఫర్ట్ రైడింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక టెక్నాలజీతో వచ్చే ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల నుండి 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ధరలు రూ. 1.04 లక్షల నుండి రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

బజాజ్ చేతక్ (Bajaj Chetak)

బజాజ్ చేతక్ ఈవీ తన ఆల్-మెటల్ బాడీతో మిగిలిన స్కూటర్ల కంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ, డ్యూరబిలిటీ విషయంలో దీనికి తిరుగు లేదు. మార్కెట్లో లభిస్తున్న అత్యంత రిఫైన్డ్ స్కూటర్లలో ఇది ఒకటి. ఇందులో C2501, C3001, C35 సిరీస్ వంటి మోడళ్లు ఉన్నాయి. దీని రేంజ్ 113 కిలోమీటర్ల నుండి 151 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రారంభ ధర రూ. 89,500 కాగా, ప్రీమియం వేరియంట్ రూ. 1.22 లక్షల వరకు పలుకుతోంది.

హీరో విడా (Hero Vida)

హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో V2, VX2 అనే సిరీస్ మోడళ్లు ఉన్నాయి. పోర్టబుల్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం దీనికి మరో అడ్వాంటేజ్. VX2 GO మోడల్ ధర రూ. 73,850 నుండి మొదలై V2 ప్రో రూ. 1.40 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 92 నుండి 165 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

సుజుకి ఈ-యాక్సెస్ (Suzuki e Access)

జపాన్ దిగ్గజం సుజుకి కూడా ఈవీ రేసులో నిలిచింది. సరికొత్త సుజుకి ఈ-యాక్సెస్ రూ. 1.88 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 3.072 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది ఒక సింగిల్ ఛార్జ్‌పై 95 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తోంది.

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ఎలా ఉంది?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త స్టార్టప్‌లు మరియు పాత కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్పండి.

టీవీఎస్ ఐక్యూబ్ భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 94,999 నుండి రూ. 1.61 లక్షల వరకు ఉంటుంది మరియు 94 నుండి 212 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

ఏథర్ రిజ్వా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రత్యేకత ఏమిటి?

ఏథర్ రిజ్వా కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. దీని ఫంక్షనల్ డిజైన్ మరియు కంఫర్ట్ రైడింగ్ ఆకట్టుకుంటాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 123 నుండి 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

బజాజ్ చేతక్ దాని ఆల్-మెటల్ బాడీతో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ మరియు డ్యూరబిలిటీ అద్భుతంగా ఉంటాయి. దీని రేంజ్ 113 నుండి 151 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు మరియు రేంజ్ ఎంత?

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తాయి. వీటి ధరలు రూ. 73,850 నుండి రూ. 1.40 లక్షల వరకు ఉంటాయి మరియు 92 నుండి 165 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget