అన్వేషించండి

Car Suspension Maintenance Tips: చిన్న గుంతలకే కారులో శబ్ధాలు వస్తున్నాయా? సస్పెన్షన్ వ్యవస్థ దెబ్బతిన్నదేమో? మరమ్మతులపై పూర్తి గైడ్ ఇదే 

Car Suspension Maintenance Tips: కారు సస్పెన్షన్‌ వ్యవస్థ వాహన భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి పాడైపోయినప్పుడు వచ్చే సంకేతాలు చేపట్టాల్సిన చర్యలు గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాహన సస్పెన్షన్ భద్రత, సౌకర్యానికి కీలకం.
  • స్ప్రింగ్, షాక్ అబ్జర్వర్స్, బాల్ జాయింట్స్ ముఖ్య భాగాలు.
  • శబ్దాలు, ఊపు, టైర్ అరుగుదల లోపాలను సూచిస్తాయి.
  • సస్పెన్షన్ నిర్వహణ, అలైన్మెంట్ అవసరం.

Car Suspension Maintenance Tips: వాహన సస్పెన్షన్‌ వ్యవస్థ అనేది కేవలం సౌకర్యవంతమైన ప్రయాణం కోసమే కాదు. ఇది వాహన భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. రహదారిపై ఉండే గుంతలు, ఎగుడుదిగుడు నుంచి వచ్చే కుదుపులను గ్రహించి, టైర్లు ఎల్లప్పుడూ నేలకు తాకేలా చూడటం వీటి ప్రధాన విధి. ఈ వ్యవస్థ సరిగా లేకుంటే కారు నియంత్రణ కోల్పోవడం, టైర్లు త్వరగా అరిగిపోవడం జరుగుతుంది. సస్పెన్షన్ వ్యవస్థ అనేది అనేక బాగాల కలయిక. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం వాహన యజమానులకు ఎంతో అవసరం. 

సస్పెన్షన్‌లో ఉండే స్ప్రింగ్‌లు వాహన బరువును మోస్తాయి. రోడ్లుపై వచ్చే కుదుపుల ప్రభావం కారుపై పడకుండా చూస్తాయి. ఇవి కాయిల్, లీఫ్‌, ఎయిర్ స్ప్రింగ్‌ రూపాల్లో ఉండవచ్చు. ఈ స్ప్రింగ్‌ల కదలికలను షాక్ అబ్జర్వర్స్‌, స్ట్రట్స్‌ నియంత్రిస్తాయి. స్ట్రట్స్ అనేవి వాహన నిర్మాణంలో భాగంగా ఉండి స్ప్రింగ్‌ను కూడా కలిగి ఉంటాయి. షాక్ అబ్జర్వర్స్‌ కేవలం కుదుపులను నియంత్రిస్తాయి. 

బాల్ జాయింట్లు స్టీరింగ్ నకిల్స్‌ను కంట్రోల్ ఆర్మ్స్‌కు అనుసంధానిస్తాయి. టైర్లు తిరగడానికి సహాయపడతాయి. స్వేబార్‌లింక్స్‌వాహనం మలుపులు తిరిగేటప్పుడు ఒక వైపునకు వంగిపోకుండా స్టెబిలిటీని ఇస్తాయి. బుషింగ్ లోహపు భాగాల మధ్య ఘర్షణ తగ్గించి శబ్దాలు రాకుండా చూస్తాయి. 

సమస్యను ఎలా గుర్తించాలి?

సస్పెన్షన్‌ వ్యవస్థ పాడవుతున్నప్పుడు వాహనం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని ముందుగానే గుర్తించడం వల్ల మరమ్మతుల తీవ్రతను తగ్గించవచ్చు. గుంతల్లో వెళ్తున్నప్పుడు కంక్ల లేదా క్నాక్ అనే శబ్దాలు రావడంతో బాల్ జాయింట్లు లేదా స్వేబార్‌ లింక్స్‌కు సంకేతం. బంప్స్‌ లేదా స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్లిన తర్వాత వాహనం రెండు మూడు సార్లు కంటే ఎక్కువ ఊగితే షాక్ అబ్జర్వర్స్‌ పని చేయడం లేదని అర్థం. టైర్లు ఒకవైపు ఎక్కువగా అరిగిపోవడం సస్పెన్షన్‌ లోపాన్ని సూచిస్తుంది. బ్రేక్ వేసినప్పుడు కారు ముందు భాగం బలంగా కిందకు వంగితే స్ట్రట్స్ మారాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలి. షాక్ అబ్జర్వర్స్ లేదా స్ట్రట్స్‌ ఆయిల్ కారుతుంటే అవి పాడైయాయని అర్థం. 

లోపాలు రాకుండా ఏం చేయాలి ఎలాంటి చిట్కాలు పాటించాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్ట్రట్స్, షాక్‌లు సాధారణంగా 50వేల నుంచి 80వేల మైళ్ల వరకు పని చేస్తాయి. అయితే మనం నివసించే ప్రాంతం, రోడ్ల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. స్ట్రట్‌ను స్ప్రింగ్ కంప్రెషర్‌లో పెట్టే ముందు అది పొడిగా శుభ్రంగా ఉండేలా చూడాలి. స్ప్రింగ్‌ కంప్రెషర్ థ్రెడ్స్‌ కు ఇంజిన్‌ ఆయిల్‌ వాడటం వల్ల పని సులభం అవుతుంది. పని పూర్తి అయిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసి శబ్దాలు ఏమైన వాస్తున్నాయేమో చూడాలి. 

సస్పెన్షన్ పని పూర్తి చేసిన తర్వాత అలైన్‌మెంట్ చేయించడం తప్పనిసరి. పని చేసేటప్పుడు బ్రేక్‌లైన్లు లేదా సెన్సార్‌ కేబుల్స్ దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. కేవలం ఒక భాగాన్ని కాకుండా పూర్తి స్ట్రట్‌ అసెంబ్లీని మార్చడం వల్ల సమయం ఆదా అవుతుంది. పాత స్ప్రింగ్‌ వల్ల వచ్చే ప్రమాదాలు తప్పుతాయి. 

Frequently Asked Questions

వాహన సస్పెన్షన్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

సస్పెన్షన్ వ్యవస్థ కేవలం సౌకర్యవంతమైన ప్రయాణానికే కాదు, వాహన భద్రతలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రహదారిపై గుంతలు, ఎగుడుదిగుడుల నుంచి వచ్చే కుదుపులను గ్రహించి, టైర్లు ఎల్లప్పుడూ నేలకు తాకేలా చూస్తుంది.

సస్పెన్షన్ వ్యవస్థలో ఏయే భాగాలు ఉంటాయి?

సస్పెన్షన్ వ్యవస్థలో స్ప్రింగ్‌లు, షాక్ అబ్జర్వర్‌లు, స్ట్రట్స్‌, బాల్ జాయింట్లు, స్వేబార్‌ లింక్స్‌, బుషింగ్‌లు వంటి అనేక భాగాలు ఉంటాయి.

సస్పెన్షన్ పాడైనప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి?

గుంతల్లో వెళ్తున్నప్పుడు శబ్దాలు రావడం, స్పీడ్ బ్రేకర్ల తర్వాత వాహనం ఎక్కువసార్లు ఊగడం, టైర్లు ఒకవైపు ఎక్కువగా అరిగిపోవడం, బ్రేక్ వేసినప్పుడు కారు ముందు భాగం కిందకు వంగడం వంటివి సస్పెన్షన్ లోపానికి సంకేతాలు.

సస్పెన్షన్ భాగాల జీవితకాలం ఎంత?

సాధారణంగా స్ట్రట్స్, షాక్‌లు 50వేల నుంచి 80వేల మైళ్ల వరకు పనిచేస్తాయి. అయితే, రోడ్ల పరిస్థితులు, వాడే విధానం బట్టి ఇది మారవచ్చు.

సస్పెన్షన్ మరమ్మతుల తర్వాత ఏమి చేయాలి?

సస్పెన్షన్ పని పూర్తి చేసిన తర్వాత వాహనానికి అలైన్‌మెంట్ చేయించడం తప్పనిసరి. అలాగే, టెస్ట్ డ్రైవ్ చేసి ఏవైనా కొత్త శబ్దాలు వస్తున్నాయేమో గమనించాలి.

టాప్ హెడ్ లైన్స్

కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget