అన్వేషించండి

Car Dashboard Lights: మీ కారు డాష్‌ బోర్డు మీద ఉన్న లైట్స్ గురించి మీకు ఏం తెలుసా? 

Car Dashboard Lights: కారు డ్యాష్ బోర్డుపై ఉన్న లైట్స్‌ రకరకాల సమాచారం అందిస్తాయి. వాటి గురించి సరిగా తెలియకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. వాటి గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కారు డాష్‌బోర్డ్ లైట్లు రంగులను బట్టి సమాచారాన్ని అందిస్తాయి.
  • ఎరుపు లైట్లు తక్షణ శ్రద్ధను, పసుపు లైట్లు సమస్యలను సూచిస్తాయి.
  • ఇంజిన్, ఆయిల్, బ్రేక్, బ్యాటరీ లైట్లు ముఖ్యమైన సమస్యలను హెచ్చరిస్తాయి.
  • టైర్ ప్రెజర్, ఎయిర్‌బ్యాగ్, ఇంధన లైట్లు సురక్షిత డ్రైవింగ్‌కు అవసరం.

Car Dashboard Lights: కారు నడుపుతున్నట్టు డ్యాష్‌బోర్డుపై రకరకాల లైట్లు కనిపిస్తాయి. అయితే వాటి గురించి చాలా మందికి తెలియదు. ఈ లైట్లు కేవలం ప్రదర్శనకు మాత్రమే అనుకుంటే పొరపాటు చేసినట్టే. ఒక్కో రంగు లైటు ఒక్కో విధమైన సమాచారాన్ని అందిస్తాయి. అందుకే కచ్చితంగా వాటి గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలి. డ్యాష్‌బోర్డు లైటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి వివిధ రంగుల్లో ఉంటాయి. ఎరుపు లైట్ వెలిగితే వెంటనే అటెన్ష్ అవసరం అని అర్థం. పసుపు లైట్ వెలిగితే ఏదో సమస్య ఉందని హెచ్చరిస్తోంది. ఆకుపచ్చ, లేదా నీలం లైట్ సాధారణంగా సమాచారం కోసం ఉంటుంది. అందుకే వల్ల వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాలి. 

ఇంజిన్, ఆయిల్, ఉష్ణోగ్రత లైట్లు

కారులోని అత్యంత ముఖ్యమై లైట్లు ఇంజిన్, ఆయిల్‌కు సంబంధించినవి. చెక్ ఇంజిన్ లైట్ వెలిగితే ఇంజిన్‌లో ఏదో సమస్య ఉందని సంకేతాలు ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది చిన్నదైనా, పెద్దదైనా కావచ్చు. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ప్రెజర్‌ లైట్‌ వెలిగితే, ఇంజిన్‌లో ఆయిల్ తక్కువగా ఉందని లేదా ప్రెజర్‌ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, వెంటనే కారును ఆపి, దానిని చెక్ చేయించడం ముఖ్యం. ఇంజిన్ టెంపరేచ్‌ లైట్ వెలిగితే, ఇంజిన్ బాగా వేడెక్కిందని సూచిస్తుంది. ఇలా జరిగితే, కారును ఆపి ఇంజిన్‌ను చల్లారనివ్వండి, లేకపోతే ఇంజిన్ దెబ్బతింటుంది. బ్యాటరీ లైట్‌ వెలిగితే బ్యాటరి సరిగా ఛార్జ్ అవ్వడం లేదని అర్థం, దీని వల్ల ప్రయాణం మధ్యలో కారు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. 

బ్రేక్‌, సెక్యూరిటీ సిస్టమ్‌ లైట్లు 

బ్రేక్ లైట్ చాలా ముఖ్యమైంది. అది వెలిగితే, హ్యాండ్‌బ్రేక్‌ వేసి ఉందని లేదా బ్రేక్ ఫ్లూయిడ్‌ తక్కువగా ఉందని సంకేతాలు ఇస్తుంది. దానిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఏబీస్‌ లైట్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్‌లో సమస్యను సూచిస్తుంది. దీని వల్ల అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు వాహనం జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్‌లైట్‌ కూడా చాలా ముఖ్యమైంది. అది వెలిగితే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు సరిగగ్గా తెరుచుకోవని అర్థం చేసుకోవాలి. టైర్ ప్రెజర్ లైట్ టైర్‌లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా సెక్యూరిటీని కూడా ప్రభావితం చేస్తుంది. 

మీ కారులో సురక్షితమైన డ్రైవింగ్ నిర్దారించడంలో సహాయపడే ఇతర లైట్లు కూడా ఉన్నాయి. ప్లూయల్‌ లైట్ మీ కారులో పెట్రోల్‌ లేదా డీజిల్‌ తక్కవగా ఉందని సూచిస్తుంది. కాబట్టి సమయానికి ఇంధనం నింపడం ముఖ్యం. ట్రాక్షన్ కంట్రోల్‌ లైట్ మీ కారు వీల్స్‌ పట్టు కోల్పుతున్నాయని లేదా సిస్టమ్‌లో లోపం ఉందని సూచిస్తుంది. ట్రాన్స్‌మిషన్ లైట్ గేర్‌బాక్స్‌లో సమస్యను సూచిస్తుంది. ఈ లైట్ వెలిగితే వీలైనంత త్వరగా మీ కారును చెక్ చేయండి. సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఈ లైట్ల గురించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటే కారు ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. 

Frequently Asked Questions

కారు డ్యాష్‌బోర్డుపై కనిపించే లైట్ల రంగులు ఏమిటి మరియు వాటి ప్రాముఖ్యత ఏమిటి?

కారు డ్యాష్‌బోర్డు లైట్లు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి వివిధ రంగులలో ఉంటాయి. ఎరుపు లైట్ వెంటనే అటెన్షన్ అవసరమని, పసుపు లైట్ సమస్య ఉందని, ఆకుపచ్చ లేదా నీలం లైట్ సాధారణ సమాచారం కోసం ఉంటుందని సూచిస్తాయి.

చెక్ ఇంజిన్ లైట్ వెలిగితే అర్థం ఏమిటి?

చెక్ ఇంజిన్ లైట్ వెలిగితే ఇంజిన్‌లో ఏదో సమస్య ఉందని అర్థం. ఇది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా కావచ్చు, కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.

బ్రేక్ లైట్ వెలిగితే ఏమి చేయాలి?

బ్రేక్ లైట్ వెలిగితే, హ్యాండ్‌బ్రేక్‌ వేసి ఉందని లేదా బ్రేక్ ఫ్లూయిడ్‌ తక్కువగా ఉందని అర్థం. దీనిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.

టైర్ ప్రెజర్ లైట్ వెలిగితే దాని ప్రభావం ఏమిటి?

టైర్ ప్రెజర్ లైట్ వెలిగితే టైర్‌లలో గాలి తక్కువగా ఉందని అర్థం. ఇది ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు భద్రతను ప్రభావితం చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?
పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణ రోడ్లపై Royal Enfield Himalayan 440 పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? - ఎక్స్‌పర్ట్‌ రిపోర్ట్‌
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్
నెలకు రూ.9,000 EMIతో హ్యుందాయ్ i20 మీదవుతుంది.. డౌన్‌పేమెంట్‌ కూడా మీ బడ్జెట్‌లోనే!
మీ చేతిలో రూ.1.34 లక్షలు ఉన్నా చాలు, కొత్త హ్యుందాయ్ i20 మీ సొంతం.. లోన్ వివరాలు ఇవిగో!

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Embed widget