అన్వేషించండి

 BS6 Modern Diesel Car : బీఎస్6 డీజిల్ కార్ ఓనర్లకు అలర్ట్: డీపీఎఫ్ (DPF) సమస్యతో లక్షల్లో ఖర్చు అయ్యే ఛాన్స్.. ఈ టిప్స్ పాటిస్తే మీ కారు సేఫ్!

ఆధునిక డీజిల్ కార్లలో డీపీఎఫ్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అనుసరించాల్సిన పద్ధతులు, సిటీ డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..

BS6 Modern Diesel Car Tips: ఇండియాలో డీజిల్ వాహనాలు ఇప్పుడు ఒక కొత్త దశలో ఉన్నాయి. ఐదు ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత బీఎస్6 (BS6) కాలంలో డీజిల్ ఇంజిన్లు చాలా క్లీన్‌గా మారుతున్నాయి. సాంకేతికంగా ఇవి ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, వీటి నిర్మాణం చాలా క్లిష్టంగా మారింది. కాలుష్య నియంత్రణ కోసం డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF), అడ్వాన్స్‌డ్ ఎగ్జాస్ట్ ట్రీట్‌మెంట్ సిస్టమ్స్, అడ్‌బ్లూ (AdBlue) లేదా డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (DEF) వంటి టెక్నాలజీలను ఇప్పుడు వాడుతున్నారు. బేసిక్ ఇంజిన్ డిజైన్ మారకపోయినా, దాని చుట్టూ ఉండే ఈ సిస్టమ్స్ వల్ల పెట్రోల్ వాహనాల కంటే డీజిల్ కార్ల మెయింటెనెన్స్ ఇప్పుడు కొంచెం ఎక్కువే అని చెప్పాలి.

అసలు డీపీఎఫ్ (DPF) అంటే ఏమిటి?
ఆధునిక డీజిల్ కార్లలో డీపీఎఫ్ అనేది అత్యంత కీలకమైన భాగం. ఇంజిన్ లోపల డీజిల్ మండేటప్పుడు వచ్చే నల్లటి పొగ (Soot) లేదా కర్బన కణాలను ఇది ఫిల్టర్ చేస్తుంది. ఈ కణాలు ఎగ్జాస్ట్ ద్వారా బయటకు రాకుండా ఈ ఫిల్టర్ ఆపుతుంది. ఓవ‌ర్ పీరియ‌డ్ ఆఫ్ టైం ఈ ఫిల్టర్ నిండిపోకుండా ఉండటానికి 'రీజెనరేషన్' (Regeneration) అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఎగ్జాస్ట్ సిస్టమ్ బాగా వేడెక్కి ఆ నల్లటి కణాలను కాల్చివేస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగే ప్రక్రియ అయినప్పటికీ, మన డ్రైవింగ్ స్టైల్ దీనిపై ప్రభావం చూపుతుంది.

స‌మ‌స్యేంటి..?
రీజెనరేషన్ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే కారు ఎగ్జాస్ట్ సిస్టమ్ ఒక నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరుకోవాలి. మీరు కారును కేవలం సిటీలో, ట్రాఫిక్ జామ్ ఉన్న చోట తక్కువ దూరాలు మాత్రమే నడిపితే ఆ వేడి పుట్టదు. దీనివల్ల ఫిల్టర్ క్రమంగా బ్లాక్ అయిపోతుంది. ఫలితంగా ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడమే కాకుండా మైలేజీ కూడా పడిపోతుంది.

డీపీఎఫ్ సమస్యల నుండి బయటపడటం ఎలా?
మీరు కారును ఎక్కువగా సిటీలోనే వాడుతుంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. 

హైవే డ్రైవ్ చేయండి: వారానికి కనీసం ఒక్కసారైనా మీ కారును హైవే మీదకు తీసుకెళ్లండి. 1,500 నుండి 2,500 ఆర్పీఎమ్ (RPM) మధ్య స్థిరమైన వేగంతో సుమారు 45 నిమిషాల పాటు నడిపితే ఎగ్జాస్ట్ వేడెక్కి ఫిల్టర్ క్లీన్ అవుతుంది.

చిన్న ట్రిప్పులు వద్దు: కారును కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరాల కోసం తరచూ వాడటం వల్ల ఇంజిన్ సరిగ్గా వేడెక్కదు. దీనివల్ల పొగ కణాలు ఫిల్టర్‌లో త్వరగా పేరుకుపోతాయి. వీలైనంత వరకు చిన్న చిన్న పనులన్నింటినీ కలిపి ఒకే లాంగ్ డ్రైవ్‌లో పూర్తి చేయండి.

వార్నింగ్ లైట్స్ గమనించండి: కారు డ్యాష్‌బోర్డ్‌లో డీపీఎఫ్ లైట్ వెలుగుతుంటే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే హైవే మీదకు వెళ్లి నిర్ణీత వేగంతో నడిపితే ఆ సమస్య పోతుంది. ఫిల్టర్ పూర్తిగా పాడైపోతే దానిని మార్చడానికి లక్ష రూపాయల పైనే ఖర్చవుతుంది. కేవలం ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించాలన్నా రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు అవుతుంది.

మంచి ఇంధనం, అడ్‌బ్లూ: నమ్మకమైన పెట్రోల్ బంకుల్లోనే డీజిల్ కొట్టించండి. కల్తీ లేని ఇంధనం వల్ల పొగ తక్కువగా వస్తుంది. అలాగే మీ కారులో అడ్‌బ్లూ (DEF) ట్యాంక్ ఉంటే దానిని ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి.

మోడ‌ర్న్ డీజిల్ కారును సరైన పద్ధతిలో నడిపితేనే అది లాంగ్ లైఫ్ ఇస్తుంది. కేవలం సిటీ డ్రైవింగ్ కోసమే అయితే పెట్రోల్ లేదా ఈవీ మోడళ్లు తీసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

CNG కార్లకు వరుస అప్‌డేట్స్‌ వదిలిన మారుతి.. ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌లో కూడా AMT ఆప్షన్‌
ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌ CNG వెర్షన్ల డ్రైవింగ్‌ మరింత స్మూత్‌.. AMT గేర్‌బాక్స్‌ ఇచ్చిన మారుతి
రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?
పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణ రోడ్లపై Royal Enfield Himalayan 440 పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? - ఎక్స్‌పర్ట్‌ రిపోర్ట్‌
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget