Bajaj Pulsar 180: పల్సర్ 180 అదిరిపోయే రీ-ఎంట్రీ , క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లతో సిద్ధం!
బజాజ్ ఆటో తన ఐకానిక్ పల్సర్ 180 మోడల్‌ను సరికొత్త ఫీచర్లతో తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. తాజాగా షోరూమ్‌లో కనిపించిన ఈ బైక్ ఫీచర్లు, లుక్ వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bajaj Pulsar 180 News: భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజులా వెలిగిన బజాజ్ పల్సర్ 180 (Pulsar 180) మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్ ఒక డీలర్‌షిప్ వద్ద కనిపించడంతో పల్సర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బజాజ్ తన పర్ఫార్మెన్స్ కమ్యూటర్ విభాగంలో పట్టు సాధించడానికి ఈ ఐకానిక్ బైక్‌ను సరికొత్త హంగులతో సిద్ధం చేసింది. పాత పల్సర్ గుర్తింపును అలాగే ఉంచుతూనే, ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అప్‌డేటెడ్ స్టైలింగ్, మోడ్రన్ ఫీచర్లను ఇందులో జోడించారు.
డిజైన్, లుక్
షోరూమ్‌లో కనిపించిన బైక్ ఇటీవలే అప్‌డేట్ అయిన పల్సర్ 150 డిజైన్ లాంగ్వేజ్‌ను పోలి ఉంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో పాటు రెడ్, గ్రే గ్రాఫిక్స్ బైక్‌కు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. పల్సర్ మార్క్ మజిల్ ఫ్యూయల్ ట్యాంక్, పదునైన టైల్ సెక్షన్ పాత పల్సర్ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. బైక్ వెనుక భాగంలో ఉన్న '180' డెకాల్ ఇది పక్కాగా 180 సీసీ మోడల్ అని కన్ఫర్మ్ చేస్తోంది.
కొత్త ఫీచర్లు ఇవే
ప్రధాన మార్పుల విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ ఇచ్చారు. ఇది పాత వెర్షన్ కంటే చాలా షార్ప్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. అలాగే ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు కూడా జత చేశారు. డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండటం మరో విశేషం. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండటం వల్ల బైక్ రోడ్ ప్రజెన్స్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. దీని ఎగ్జాస్ట్ డిజైన్ పల్సర్ 220ఎఫ్ మాదిరిగా ఉండటం విశేషం.
ఇంజిన్ సామర్థ్యం
మెకానికల్ పరంగా చూస్తే, నమ్మకమైన 178.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కొనసాగనుంది. కొత్త ఎమిషన్ నిబంధనలు (OBD-2), ఈ20 (E20) ఫ్యూయల్ సపోర్ట్ చేసేలా దీనిని అప్‌డేట్ చేశారు. ఇది సుమారు 17 హెచ్‌పి పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐదు స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ సిటీ రైడింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా పక్కాగా సరిపోతుంది.
ధర, కాంపిటీటర్స్..
బజాజ్ పల్సర్ 180 ధర పల్సర్ 150 కంటే కొంచెం ఎక్కువగా, పల్సర్ 220ఎఫ్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది నేరుగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) కి గట్టి పోటీ ఇవ్వనుంది. క్లాసిక్ పల్సర్ స్టైలింగ్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. డీలర్‌షిప్స్ వద్దకు బైక్‌లు చేరుతుండటంతో, అధికారిక లాంచ్ అలాగే ధర వివరాలు అతి త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఏదేమైనా బజాజ్ పల్సర్ మళ్లీ రీ లాంచ్ కానుండంతో దాన్ని సొంతం చేసుకోవాలని హార్డ్ కోర్ అభిమానులు ఎదురు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్త ఆర్తిక సంవత్సరం ప్రథమార్థంలోనే ఈ బైకు ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















