అడ్వెంచర్ బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్, ఇండియాలో లాంచ్ అయిన Ducati Multistrada V4 & V4 S
Ducati Multistrada features: డుకాటి, భారతదేశంలో కొత్త 2025 మల్టీస్ట్రాడా V4 & V4 S బైకులను విడుదల చేసింది. వాటి మోడ్రన్ ఫీచర్లు, ఇంజిన్, సేఫ్టీ అప్‌డేట్స్ & ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

2025 Ducati Multistrada V4 And V4 S Features Engine: డుకాటి ఇండియా భారతదేశంలో కొత్త మల్టీస్ట్రాడా V4 & V4 S (2025) బైకులను లాంచ్ చేసింది. ఈసారి ఈ బైక్‌ల్లో చాలా కీలకమైన అప్‌డేట్స్ ఉన్నాయి, ఇవి రైడింగ్‌ను మునుపటి కంటే మరింత సౌకర్యవంతంగా, సరదాగా, సురక్షితంగా & శక్తిమంతంగా చేస్తాయి. కంపెనీ, ఈ బండ్లను లగ్జరీ అడ్వెంచర్ టూరర్స్‌గా ప్రదర్శిస్తోంది. కొత్త మల్టీస్ట్రాడా సిరీస్‌లో అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఫీచర్లు, మెరుగైన పిలియన్ (రైడర్ వెనుక మరొక సీటు) ఫెసిలిటీ & డుకాటి స్పోర్ట్స్ బైక్‌ల స్ఫూర్తితో కొత్త స్పోర్టీ డిజైన్ వంటివి యాడ్ అయ్యాయి.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
కొత్త మల్టీస్ట్రాడా V4... 1158cc V4 Granturismo ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 170 bhp పవర్ & 123.8 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్, ఎక్స్‌టెండెడ్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీతో పని చేస్తుంది, ఇది ఇంధన వినియోగాన్ని దాదాపు 6% తగ్గిస్తుంది. సర్వీస్‌ల మధ్య విరామం కూడా ఎక్కువ - ఆయిల్ సర్వీస్ 15,000 కి.మీ. లేదా 24 నెలలకు చేయించవచ్చు. అంతేకాదు, వాల్వ్ క్లియరెన్స్ చెక్ 60,000 కి.మీ. వద్ద చేయించవచ్చు. అడ్వెంచర్ రైడర్లకు ఇది చాలా ఊరటనిచ్చే విరామం.
V4 S లో హై-టెక్ ఫీచర్లు
మల్టీస్ట్రాడా V4 S లో Marzocchi Ducati Skyhook Suspension EVO ఉంది, ఇది బంప్ డిటెక్షన్ & మోడ్రన్ ప్రీలోడ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. దీనిలో ఆటోమేటిక్ లోయరింగ్ డివైజ్ కూడా ఉంది, ఇది తక్కువ వేగం సమయాల్లో సీటు ఎత్తును 30mm తగ్గిస్తుంది. రైడర్ భద్రత కోసం, ఈ బండిలో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ (FCW), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (BSD) & డుకాటి బ్రేక్ లైట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ వ్యవస్థ అత్యవసర బ్రేకింగ్ సమయంలో ప్రమాద లైట్లను ఆటోమేటిక్‌గా ఆన్ చేస్తుంది. MotoGP నుంచి తీసుకున్న డుకాటి వెహికల్ అబ్జర్వర్ (DVO) టెక్నాలజీని కూడా ఈ బండిలో యాడ్ చేశారు. ఇది ABS కార్నరింగ్, వీలీ కంట్రోల్ & ట్రాక్షన్ కంట్రోల్‌ను మరింత మెరుగుపరుస్తుంది.
సుదీర్ఘ ప్రయాణాలకు మెరుగైన సౌకర్యం
డుకాటీ, పిలియన్ రైడర్లకు (రైడర్ వెనుక కూర్చునే వ్యక్తి) ఎక్కువ లెగ్‌రూమ్ అందించింది. ప్యానియర్లు & టాప్ కేస్ పొజిషన్ మార్చారు. కొత్త అల్యూమినియం మౌంట్ జోడించారు. రైడర్ & పిలియన్ రెండింటికీ వేర్వేరు సీట్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ బైక్‌లో మొత్తం 5 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - స్పోర్ట్, టూరింగ్, అర్బన్, ఎండ్యూరో & కొత్త వెట్ మోడ్. ముఖ్యంగా ఎండ్యూరో మోడ్‌లో, పవర్ 114 bhp కి పరిమితం చేశారు & రియర్ ABS ఆపేశారు. ఇది ఆఫ్-రోడింగ్ రైడ్‌ను మరింత ఈజీగా మారుస్తుంది.
ధర & వేరియంట్లు
కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా V4 ను డుకాటీ రెడ్, థ్రిల్లింగ్ బ్లాక్ & ఆర్కిటిక్ వైట్ అనే మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 23 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌లో రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది.





















