News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 21 November to 27: కొందరు మీ ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించే ప్రయత్నం చేస్తారు, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 21 November to 27: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope 21 November to 27 November 2022: నవంబరు 21 నుంచి 29 వరకూ మేషం రాశి నుంచి కన్యారాశి వరకూ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి...

మేష రాశి
ఈ వారం మేషరాశివారికి అత్యద్భుతంగా ఉంటుంది. గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని నూతన పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకున్నవారు ఓ అడుగు ముందుకేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలసి ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం

వృషభ రాశి
ఈ వారం వృషభ రాశి వ్యాపారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.  ధన సేకరణలో కూడా విజయం సాధిస్తారు. కార్యాలయంలో ఉన్నత హోదాలో ఉన్నవారు కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉంటా బయటా గౌరవం పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. వివాహితుల మధ్య వివాదాలు రావొచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి. తప్పుడు ప్రవర్తను మార్చుకుంటే మంచిది. విద్యార్థులు లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు...సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

Also read: 2023లో ఆరంభంలో ఈ రాశివారు మానసికంగా బాధపడతారు, ఆర్థికపరిస్థితి మాత్రం ఆశాజనకం

మిథున రాశి
మిథున రాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వ్యాపారులు నష్టపోతారు. తొందరపడి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది మీ ఇమేజ్‌కి హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు..వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకండి. అత్తమామలతో మంచి సంబంధాన్ని మెంటైన్ చేయండి. ఇతరులపై విమర్శలు గుప్పించవద్దు. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఉపాధ్యాయుల మాట వినాలి. ఉద్యోగులు కష్టపడి పనిచేయాలి.  వైవాహిక జీవితంలో ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి..కానీ అవగాహనతో వాటిని మీరు అధిగమిస్తారు.

కర్కాటక రాశి
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. రాబోయే సవాళ్లను అధిగమించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీతో శత్రుత్వం ఉన్నవారు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వివాహాది శుభకార్యాల్లో కుటుంబంతో సహా సంతోషంగా పాల్గొంటారు. ఈ వారం మీకు సమయం చాలా వరకూ అనుకూలంగానే ఉంది

Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది

సింహ రాశి 
బ్యాంకు నుంచి అప్పులు పొందాలి అనుకున్న వారికి సమస్య తొలగిపోతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యక్తులను కలుస్తారు...మంచి లాభాలు ఆర్జిస్తారు. స్త్రీ స్నేహితుల వల్ల కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు.  కార్యాలయంలో మీ బాధ్యతలు పెరగుతాయి. కొన్ని కొత్త పనుల భారం మీ భుజంపై పడతాయి. దురాశకు దూరంగా ఉండాలి. ఇది మీ ఇమేజ్‌కి హాని కలిగించవచ్చు. విద్యార్థులు కోర్సును పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

కన్యా రాశి 
ఈ వారం ఈ రాశివారు కొన్ని విషయాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగంచేస్తున్న వారికి ఈ వారం పదోన్నతి లభించే అవకాశం ఉంది. అత్తమామల నుంచి పూర్తి సహకారం ఉంటుంది.  భూమి లేదా ఆస్తి తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. డబ్బు కొరత ఉండడం వల్ల ముఖ్యమైన పనులపై ఆ ప్రభావం పడుతుంది. మీ తెలివితేటలతో అందర్నీ మెప్పిస్తారు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో పని పెరుగుతుంది. విద్యార్థులు సోమరితనానికి దూరంగా ఉండాలి..లేదంటే లక్ష్యాన్ని కోల్పోవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వీడండి

తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....

Published at : 19 Nov 2022 01:44 PM (IST) Tags: Taurus Gemini Weekly Horoscope 21 November to 27 November 2022 saptahik rashifal 21 to 27 november aries cancer leo virgo weekly horoscope in telugu

ఇవి కూడా చూడండి

Pitru Paksham 2023:పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

Pitru Paksham 2023:పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!

Bathukamma 2023: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!

Bathukamma 2023: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!

Bathukamma 2023: 'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే' - బతుకమ్మలో పేర్చే ఈ పూలవల్ల ఎన్ని ప్రయోజనాలో!

Bathukamma 2023: 'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే' - బతుకమ్మలో పేర్చే ఈ పూలవల్ల ఎన్ని ప్రయోజనాలో!

Horoscope Today : ఈ రాశుల వారికి అక్టోబరు 4th చాలా ప్రత్యేకం

Horoscope Today : ఈ రాశుల వారికి అక్టోబరు 4th చాలా ప్రత్యేకం

టాప్ స్టోరీస్

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'