News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

21 November to 27 Weekly Horoscope : ఈ రాశివారికి ప్రత్యేకం, ఆ రాశివారికి సవాళ్లు - తులా రాశి నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 21 November to 27: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope 21 November to 27 November 2022: నవంబరు 21 నుంచి 29 వరకూ  తులా రాశి నుంచి మీన రాశి వరకూ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి...

మేష రాశి నుంచి కన్యా రాశి వరకూ వారఫలాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....

తులా రాశి
ఈ వారం తులారాశివారికి ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదరడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆడపిల్లలకు మంచి వరుడు లభిస్తాడు. ఈ వారం ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనితీరుపై ప్రత్యేక దృష్టి ఉంటుంది..జాగ్రత్త. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

వృశ్చిక రాశి
మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవలసి ఉంటుంది. ఈ వారం మీరు వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన సొమ్ము తిరిగి రావడం కష్టమే. రిలేషన్స్ ప్రభావితం అవుతాయి. కార్యాలయంలో పరిస్థితుల కారణంగా ఉద్యోగం మారాలనే ఆలోచన రావొచ్చు. వైవాహిక జీవితంలో విడిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. కోర్టులో ఏదైనా వివాదం నడుస్తున్నట్లయితే దాని కోసం అదనపు లాబీయింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. 

Also read: 2023లో ఆరంభంలో ఈ రాశివారు మానసికంగా బాధపడతారు, ఆర్థికపరిస్థితి మాత్రం ఆశాజనకం

ధనుస్సు రాశి
ఈ వారం ప్రారంభంలో మనస్సు ఆనందంగా ఉంటుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఒంటరిగా ఉన్నవారు కొత్త బంధంలోకి అడుగుపెడతారు. జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది. ఎంత కష్టపడితే అంత డబ్బు పొందుతారు...అందుకే కష్టపడి పని చేయడంలో వెనకడుగు వేయకండి. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.  ప్రయాణం చేయాల్సి ఉంటుంది.విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు శ్రద్ధ చూపిస్తారు. 

మకర రాశి
ఈ రాశివారు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శని మీ రాశిలో సంచరిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలి.. తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించకండి. అలా చేస్తే తీవ్రంగా నష్టపోతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమేతంగా వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. మీరు జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తే, అది తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జీవితంలో ఎవరైనా ప్రవేశించవచ్చు.

Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది

కుంభ రాశి
ఈ వారం మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది...వేరే వారి చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి. ఆన్‌లైన్ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. కార్యాలయంలో వినియోగించే కంప్యూటర్ నుంచి సరిగ్గా సైన్ ఔట్ చేయండి. ఇతరులకు చెడు చేయాలనే ఆలోచన చేయొద్దు. జీవిత భాగస్వామి సలహా సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేందుకు సహాయపడుతుంది. చదువు, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సరికాదు.

మీన రాశి
ఈ వారం మీ రాశిలో దేవగురువు బృహస్పతి తిరోగమనం చెందుతున్నాడు. అందుకే కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి.ఎప్పటి నుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు ఉండవు. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు కూడా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తుల స్థాయి పెరుగుతుంది.

Published at : 19 Nov 2022 01:55 PM (IST) Tags: Taurus Gemini Scorpio Sagittarius Weekly Horoscope 21 November to 27 November 2022 weekly horoscope in telugu saptahik rashifal 21 to 27 november libra capricorn aquarius

ఇవి కూడా చూడండి

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?