Citadel Honey Bunny First Review: 'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Citadel Honey Bunny Web Series Review: సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషించిన 'సిటాడెల్ : హనీ బన్నీ' వెబ్ సిరీస్ ఫస్ట్ రివ్యూ తాజాగా బయటకు వచ్చింది. మరి ఈ సిరీస్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి
సౌత్ క్వీన్ సమంత (Samantha) చాలా కాలం గ్యాప్ తర్వాత 'సిటాడెల్ : హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్ పోషించారు. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్ ఫస్ట్ రివ్యూ తాజాగా బయటకు వచ్చింది. మరి ఈ సిరీస్ ప్రీమియర్ షోల టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.
2023లో ప్రియాంక చోప్రా జోనస్ నటించిన హాలీవుడ్ సిరీస్ "సిటాడెల్"కు ఇండియన్ వెర్షనే ఈ "సిటాడెల్ : హనీ బన్నీ". సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'కి దర్శకత్వం వహించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కి కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనింగ్ సిరీస్ "సిటాడెల్ : హనీ బన్నీ" ప్రీమియర్ షోలు ముంబైలో పడ్డాయి. సోమవారం సాయంత్రం ముంబైలో జరిగిన ఈ సిరీస్ ప్రీమియర్లకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ కూడా ఒకరు.
ప్రీమియర్ చూసిన తరువాత నిమ్రత్ ఇంస్టాగ్రామ్ లో ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయాన్ని పంచుకున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో 'ఈ క్రేజీ అద్భుతమైన రైడ్ ను అందించినందుకు సిటాడెల్ : హనీ బన్నీ టీంకి అభినందనలు. సిరీస్ లో ఉన్న ప్రతి క్షణం ప్రతి సీన్ నచ్చింది. ఎడ్జీ, కల్ట్, గ్రీటి అండ్ టేస్టీ" అంటూ తన మాటల్లో ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయాన్ని బయట పెట్టారు నిమ్రత్ కౌర్. దీంతో "సిటాడెల్ : హనీ బన్నీ" సిరీస్ ను చూడడానికి ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.
Also Read: 'సిటాడెల్' వెబ్ సిరీస్ రన్ టైమ్ ఎంత? టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో తెలుసా?
రీసెంట్ గా "సిటాడెల్ : హనీ బన్నీ" సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా, ట్రైలర్లో సమంత చేసిన యాక్షన్ స్టంట్స్ అబ్బురపరిచే విధంగా ఉండడంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో నవంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో సమంతా ప్రస్తుతం బిజీగా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రీమియర్స్ నుంచే ఈ సిరీస్ కి పాజిటివ్ టాక్ రావడం విశేషం. మొత్తానికి చాలా కాలం తర్వాత సమంత "సిటాడెల్ : హనీ బన్నీ" వెబ్ సిరీస్ తో బౌన్స్ బ్యాక్ కాబోతున్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ వెర్షన్ 'సిటాడెల్' పెద్దగా ఇండియన్ మూవీ లవర్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ లోటుని ఇప్పుడు సమంత తీర్చబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక సెలబ్రిటీలకైతే "సిటాడెల్ : హనీ బన్నీ" పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. మరి ఆడియన్స్ ఈ సిరీస్ విషయంలో ఎలాంటి తీర్పుని ఇస్తారో చూడాలి. ప్రస్తుతనికైతే సమంత అలుపెరగకుండా ఈ మూవీ ప్రమోషన్ల కోసం ముంబైని చుట్టేస్తోంది.
Also Read: Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు