Today Horoscope In Telugu:మీ జీవిత భాగస్వామికి చేసిన వాగ్ధానం నెరవేర్చాల్సిన సమయం ఇది , నవంబరు 18 రాశిఫలాలు
Astrology :మేష రాశి నుంచి మీన రాశివరకూ నవంబరు 18 శనివారం దిన ఫలాలు
Horoscope Today 18 november 2023
మేష రాశి (Aries Horoscope in Telugu)
ఈరోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఏదైనా బాధ్యత తీసుకున్నట్లయితే దానిని సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. పెండింగ్ వర్కులు పూర్తిచేస్తారు. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు జాగ్రత్త.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu)
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీలో పోటీతత్వం పెరుగుతుంది. మీరు సుదూర ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లయితే కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఉన్నత విద్యకోసం ప్రయత్నాలు చేస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలను విస్మరించకుండా ఉండాలి.
Also Read: ప్రేమను వ్యక్తం చేయడంలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!
మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. పాత స్నేహితుడిని కలుస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి కానీ కొంతకాలం వెయిటింగ్ తప్పదు. ప్రయాణాలలో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చవలసి ఉంటుంది లేదంటే సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యమైనపనుల్లో జాప్యం వద్దు. కొంతమంది మోసగాళ్ల నుంచి దూరం పాటించకుంటే సమస్యలు తలెత్తవచ్చు.
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)
భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. సన్నిహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి కలిసొస్తుంది .
సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రోజు మీరు కష్టపడి పని చేయాల్సిన రోజు. మీ శ్రమతో పాటు ఆరోగ్యంపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. ఆర్తిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కార్యాలయంలో ఏదైనా బాధ్యతను స్వీకరించినట్లయితే పూర్తిస్థాయిలో పూర్తిచేయండి..నిర్లక్ష్యంగా ఉండొద్దు.
Also Read: మీ రాశి మీ బలహీనత ఏంటో చెప్పేస్తుంది.. మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి..
కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రోజు మీకు సాధారణ రోజుగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో కొన్ని పెద్ద విజయాలను పొందవచ్చు . ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ప్రేమికులు తమ భాగస్వామి విని పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది.
తులా రాశి (Libra Horoscope in Telugu)
ఒకరి బోధనలు, సలహాలను అనుసరించడం వల్ల మీరు నష్టపోతారు. ఏ విషయంలోనూ మొండితనం, అహంకారం చూపవద్దు. లేదంటే సమస్యలు తలెత్తవచ్చు.ఇంట్లో సౌఖ్యాలు, సౌకర్యాలు పెరుగుతాయి. భూమి, వాహనం, ఇంటికి సంబంధించి నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ప్లాన్ చేసుకుంటారు.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఈ రోజు మీరు కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. కార్యాలయంలో ముఖ్యమైన విషయాల్లో సీనియర్ల సహకారం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఇంటికి అతితులు వస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొన్ని ప్రణాళికలు వాయిదా వేసినట్టైతే..ఇప్పుడు తిరిగి ప్రారంభించండి.
Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...
మకర రాశి (Capricorn Horoscope in Telugu)
ఈ రోజు మీకు కొన్ని కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు. వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఏదైనా పని ప్రారంభించేముందు తల్లిదండ్రులను సంప్రదించండి. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. బాగా వేయించిన కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు విదేశాలకు వెళ్లాల్సి రావొచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఇబ్బందులు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చేపట్టిన పనిని మధ్యలో వదిలేయవద్దు.
మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఈ రాశివారి ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. గతంలో అమలు పరిచిన ప్రణాళికల నుంచి ఈ రోజు సంతోషాన్ని పొందుతారు. ఈ రాశి ఉద్యోగులు సహోద్యోగుల మద్దతు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆనందంగా ఉంటారు.