అన్వేషించండి

Scorpio Horoscope 2024: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది

Scorpio Yearly Astrology : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...

Scorpio Yearly Horoscope 2024: వృశ్చిక రాశి వారికి శనితో ఇబ్బందులు 2025 వరకూ తప్పవు.  ఈ సమయంలో అధిక మానసిక ఒత్తిడి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అకాశం ఉంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు వాటికి దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు అంత మంచి ఫలితాలు సాధించలేరు. అయితే ఈ రాశి ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి సాధారణ ఫలితాలుంటాయి. ఓ గుడ్ న్యూస్ వింటారు. న్యాయ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహన సంతోషం ఉంటుంది. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ వృశ్చిక శివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!

Scorpio January to December Horoscope 2024

జనవరి, ఫిబ్రవరి 
ఈ రెండు నెల్లోల ఈ రాశివారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. జనవరి నెలలో వివాదాలు ఏర్పడి కుటుంబంలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.  ఫిబ్రవరి నెలలో శుభవార్తలు వింటారు. వాహనం కొనుగోలు చేయడానికి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ ఆనందం పెరుగుతుంది. స్నేహితుల కారణంగా లాభపడతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మార్చి, ఏప్రిల్
మార్చి , ఏప్రిల్  నెలల్లో గుడ్ న్యూస్ వింటారు. తోబుట్టువుల నుంచి సహకారం పొందుతారు. నూతన పని కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్యాలయంలో లాభదాయకత , పురోగతికి అవకాశాలు ఉన్నాయి. 

Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!

ఏప్రిల్ 
ఏప్రిల్ నెలలో ఆర్థికంగా కొంత లాభిస్తుంది కానీ కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.  ఐదో స్థానంలో రాహువు - మార్స్ కలయిక వల్ల మీ ఆరోగ్యం లేదా పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన వ్యాధులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

మే, జూన్
మే, జూన్ నెలల్లో ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. ఆరోగ్య పరంగా ఈ సమయం మంచిదని భావించండి. జూన్ నెలలో కోపం ఎక్కువగా ఉంటుంది. అనవసర తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆదాయ వనరులు బాగుంటాయి. పని రంగంలో లాభాలు ఉంటాయి. జూలైలో మంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. స్నేహితులు, బంధువులు నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  మీ జీవిత భాగస్వామి ఉద్యోగంలో పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి.

ఆగష్టు 
ఆగష్టు నెల శుభప్రదంగా ఉంటుంది.  ఆరోగ్యం కూడా బాగుంటుంది. డబ్బు సంపాదనకు అనువైన సమయం. స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి కూడా ప్రయోజనాలను పొందుతారు . వ్యాపార రంగంలో విజయం పొందుతారు. 

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

సెప్టెంబర్, అక్టోబర్ 
ఈ రెండు నెలలు కష్టాలతో నిండి ఉంటాయి. అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు లేదా విలువైన వస్తువు పోవచ్చు. ఖర్చులు పెరుగుతాయి . కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. రకరకాల ఒత్తిళ్ల వల్ల మనసు చికాకుగా ఉంటుంది. పని కోసం చేసిన ప్రణాళికలను పూర్తి చేయడం కష్టం.

నవంబర్, డిసెంబర్
నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు. తండ్రికి సంబంధించిన కొన్ని తగాదాలు ఇబ్బందులను సృష్టిస్తాయి. కుజుడు, శనిగ్రహాల ప్రభావం కారణంగా వాహన సంబంధిత  లేదా ఆస్తి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వివాదాలుగా మారుతాయి. తగాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 

Scorpio Health Rashifal 2024
2024 మీ ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ కొన్ని అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం మంచిది. లివర్ కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టైఫాయిడ్, ఫ్యాటీ లివర్, కామెర్లతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. 

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

Scorpio Bussines and Money Rashifal 2024
2024 ఆర్థికపరంగా పుంజుకుంటారు. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు కానీ కాలక్రమేణా మీకు తగినంత డబ్బు లభిస్తుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో లాభం , పురోగతి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

Scorpio Education Rashifal 2024
2024లో ఈ రాశి విద్యార్థులకు చదువుకి సంబంధించిన కొన్ని సమస్యలుంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

Scorpio Marriage Life Rashifal
2024 లో ఈ రాశివారి వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సంతోషాన్ని పొందుతారు. భవిష్యత్తులో ఉపయోగపడే శుభ కార్యాలలో మీ జీవిత భాగస్వామి మంచి సలహా ఇస్తారు.

Also Read: ఈ రాశివారు గతాన్ని వదిలిస్తేనే సంతోషకరమైన జీవితాన్ని చూడగలరు, డిసెంబరు 28 రాశిఫలాలు

పరిహారం : ప్రతి గురువారం ఉపవాసం ఉండండి. శ్రీ సూక్తం ,దారిద్ర్య దహన స్తోత్రాన్ని పఠించండి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Govt Oath Taking: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బిగ్ అప్డేట్, మోదీ కోసం చూస్తున్న నేతలు
బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బిగ్ అప్డేట్, మోదీ కోసం చూస్తున్న నేతలు
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Adilabad Protest: ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Advertisement

వీడియోలు

Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
VARANASI Trailer Decoded | Mahesh Babu తో నీ ప్లానింగ్ అదిరింది జక్కన్నా SS Rajamouli | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Govt Oath Taking: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బిగ్ అప్డేట్, మోదీ కోసం చూస్తున్న నేతలు
బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బిగ్ అప్డేట్, మోదీ కోసం చూస్తున్న నేతలు
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Adilabad Protest: ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : చైతన్యని ఫ్లర్ట్ చేసిన రీతూ.. హల్లో రీతు ఆ శిల్పం చిక్కింది నేనే అన్న నాగార్జున
చైతన్యని ఫ్లర్ట్ చేసిన రీతూ.. హల్లో రీతు ఆ శిల్పం చిక్కింది నేనే అన్న నాగార్జున
Varanasi - Puri Jagannadh: 'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
Madanapalle Kidney Scam: కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
India Sedan Market: SUVల దూకుడుకు సెడాన్లు బలి - బయ్యర్లు లేక నానాటికీ క్షీణిస్తున్న సేల్స్‌
సెడాన్‌ మార్కెట్‌ డౌన్‌ఫాల్‌ - ఈ కార్లను కొనేవాళ్లే కరవయ్యారుగా!
Embed widget