అన్వేషించండి

Horoscope Today Dec 28th, 2023: ఈ రాశివారు గతాన్ని వదిలిస్తేనే సంతోషకరమైన జీవితాన్ని చూడగలరు, డిసెంబరు 28 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 28th, 2023 ( డిసెంబరు 28 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీరు గెలవడానికి సిద్ధంగా ఉండండి. కొత్త అవకాశాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ మనసులో మాట చెప్పడానికి భయపడొద్దు. మీ శక్తిని లేదా బలాన్ని మీ మేలు కోసం కానీ ఎదుటివారి హానికోసం ఉపయోగించరాదు. మిమ్మల్ని మీరు నమ్మండి. సహోద్యోగులు, బాస్ నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఆలోచించవద్దు. స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ఈ రోజు మంచి రోజు. అవివాహితులు జంటను వెతుక్కునే పనిలో బిజీగా ఉంటారు. ఉద్యోగులు జీతం పెరుగుదల లేదా పదోన్నతికి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. మీ జీవనశైలిలో మార్పులు మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. 

Also Read: మీ న్యూ ఇయర్ ప్లాన్ లో దైవసందర్శన ఉందా - తెలంగాణలో ముఖ్యమైన ఆలయాలివే!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీకు కొత్త అవకాశాలొస్తాయి. మీ పని సామర్థ్యంపై నమ్మకంతో కొత్త ప్రాజెక్టులు అంగీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీరు మీ సంబంధాలను బలంగా ఉంచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎక్కేందుకు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆవేశపూరిత నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తగిన విశ్రాంతి అవసరం అని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోండి. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీరు మీ కుటుంబం విషయాలపై శ్రద్ధ వహించాలి. మీ ప్రియమైనవారితో టైమ్ స్పెండ్ చేస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో కీలకమైన రోజుగా ఈ రోజు మారొచ్చు. ప్రేమికులు వివాహం చేసుకోవాలి అనుకుంటే ఈరోజు పెద్దలను సంప్రదించడం ద్వారా మంచి ఫలితం పొందొచ్చుయ. ఉద్యోగులకు  కార్యాలయాల్లో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యం , ఆదాయం బాగానే ఉంటాయి. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజంతా పనిలో బిజీగా ఉంటారు. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి, కష్టపడి పనిచేయాలి. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. విజయం సాధిస్తామని మిమ్మల్ని మీరు నమ్మాలి. వివాహితులు తమ బంధంలోకి అనవసర జోక్యాలను నివారించాలి. ఉద్యోగం, వ్యాపారం బాగానే సాగుతాయి. ఫ్యాషన్ వస్తువులు, బట్టలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఆహార వ్యాపారం చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: ఆదిత్య మంగళ రాజయోగం, ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్స్!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంతో గడపడానికి కూడా సమయం దొరుకుతుంది. ఆర్థికంగా మరింత బలపడతారు. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. బంధువులు లేదా తోబుట్టువులతో ఆర్థిక వివాదాలు పరిష్కారం అవుతాయి. పిల్లలకు సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అసరం. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీరు ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి.  ఖర్చులను నియంత్రించాల్సిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్రణాళికను కూడా వాయిదా వేయాలి. ఈ రోజు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి సరైన ప్రణాలికలు రచించుకోండి. భాగస్వామితో ఘర్షణకు దూరంగా ఉండడం మంచిది. 

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీకు కొత్త అవకాశాలొస్తాయి. కష్టపడి పని చేయాలి మరియు కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. గతాన్ని వదిలేస్తేనే సంతోషకరమైన జీవితాన్ని చూడగలరు. వృత్తిపరంగా ఓ అడుగు ముందుకు పడే సమయం ఇది. నూతన పెట్టుబడులు ప్లాన్ చేసుకోవడం మంచిది. చిన్న చిన్న అలర్జీలు మినహా ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులకు మంచి రోజు. మీ బంధంలో మంచి క్షణాలను అనుభవిస్తారు. కుటుంబానికి సమయం కేటాయించడం మంచిది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీరు మీ కుటుంబ విషయాలపై దృష్టి పెట్టాలి. మీ ప్రియమైనవారితో  సంతోషంగా గడిపే సమయం దొరుకుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ అవన్నీ పరిష్కారం అయిపోతాయి. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రోజు ఆరంభం కన్నా గడిచే కొద్దీ బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అనసరం. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

మీ లక్ష్య సాధనపై దృష్టి సారిస్తే ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అందులో మార్పు ఉండకూడదు. అవివాహితులకు మంచి రోజు. మీకు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవారి. కెరీర్లో ముందుకు సాగేందుకు ఇదే మంచి సమయం. మీ ఆలోచనలను వ్యక్తీకరించడానికి వెనకడుగు వేయొద్దు. ఆదాయాన్ని పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ఖర్చులు తగ్గించడంపై పెట్టాలి. వ్యాయామం, ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. 

Also Read: రాశిమారిన బుధుడు ఈ 5 రాశులవారి ఫేట్ మార్చేస్తాడు!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. మీరు కార్యాలయంలో అధికారులను కలవవచ్చు. లాభదాయకమైన అవకాశాలు పొందుతారు. మీ మనసుకి నచ్చే వ్యక్తి ఈ రోజు మీకు తారసపడతారు. ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచి రోజు. 

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజు మీరు కష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. పిల్లల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. మీకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు ఉందని గుర్తించాలి. ఆర్థికంగా మీ భవిష్యత్ కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు మంచి రోజు. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకునేందుకు మీతో మీరు సమయం గడపండి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Kangana Ranaut: హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Embed widget