Libra Horoscope 2024: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!
Libra Yearly Astrology : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...
Libra Yearly Horoscope 2024: తులారాశి వారు 2024వ సంవత్సరంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రారంభంలో కొన్ని సమస్యలున్నా ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కానీ మహాపురుషుడు రాజయోగం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరో ఇంట్లో రాహువు శత్రువులను నాశనం చేస్తాడు. వైవాహిక జీవతం బావుంటుంది. చిన్న చిన్న వివాదాలున్నా అవి పరిష్కారం అయిపోతాయి. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ తులారాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
జనవరి , ఫిబ్రవరి
ఈ రెండు నెలలు మిమ్మల్ని కొన్ని సమస్యలు వెంటాడుతాయి. సన్నిహితులతో కలహాలు, విడిపోయే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారం , ఉద్యోగంలో కొన్ని ఆకస్మిక హెచ్చు తగ్గులు ఉంటాయి . వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది.
మార్చి, ఏప్రిల్, మే
ఈ మూడు నెలల్లో కొంత కష్టంగానే ఉంటుంది. ఎన్ని పోరాటాలు చేసినా మంచి ఫలితాలు కనిపించే సూచనలు దరిదాపుల్లో ఉండవు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కోపం ఎక్కువగా ఉంటుంది. రాహువు , శుక్ర స్థానాలు ఎప్రిల్లో మానసిక గందరగోళానికి గురిచేస్తాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం వల్ల నష్టపోతారు. ఉదర వ్యాధులు ఇబ్బంది పెడతాయి.
2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
జూన్
ఈ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు మరింత కష్టపడాల్సి రావొచ్చు. డబ్బు సంపాదించేందుకు సమయం కలిసొస్తుంది. ఉద్యోగులు స్థలం మారుతారు. తలనొప్పి, కంటినొప్పి లేదా చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడతాయి. వ్యాపారం బాగానే సాగుతుంది.
జూలై
ఈ నెలలో భూ లాభం, వాహనం కొనుగోలు సాధ్యమవుతుంది. దైవానుగ్రహం మీపై ఉంటుంది. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. మీరు మీ పనిలో ప్రశంసలు పొందుతారు, మీరు ఉన్నతాధికారుల నుంచి గౌరవం పొందుతారు.
ఆగష్టు
ఆగష్టులో ప్రేమ వ్యవహారాల్లో నిరాశ తప్పదు. చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తవుతాయి. పిల్లలకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో కలహాలు మొదలయ్యే అవకాశం ఉంది. గృహ నిర్వహణలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు . డబ్బు సంపాదన బాగుంటుంది.
2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సెప్టెంబర్
సెప్టెంబరు నెలంతా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకు ఖర్చులవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది.
అక్టోబర్
అక్టోబరు నెలలో ఆకస్మిక ధన నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి . పెద్ద పనులకు ప్రణాళికలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయ వనరులు సృష్టించడం కొనసాగుతుంది . క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. పూజలు ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. నెలాఖరున శుభవార్త వింటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
నవంబర్, డిసెంబర్
ఈ రెండు నెలలు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా శ్రమతో అధిగమిస్తారు.
Libra Health Rashifal 2024
2024వ సంవత్సరం ఆరోగ్యం దృష్ట్యా మంచిది. చిన్న చిన్న ఇబ్బందులు సహజమే కానీ పెద్ద పెద్ద గాయాలయ్యే అవకాశం లేదు. సాధారణ జ్వరం, ఇన్ఫెక్షన్ ఉండవచ్చు.
Libra Bussines and Money Rashifal 2024
2024 సంవత్సరం తులా రాశి వ్యాపారులకు చాలా మంచిది. ఈ సమయంలో మీరు మంచి డబ్బు పొందుతారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో వేగం పెరుగుతుంది.
2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Libra Education Rashifal 2024
తులా రాశి విద్యార్థులు ఈ ఏడాది చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పిల్లలు అభివృద్ధి చెందుతారు. జ్ఞానం పెరుగుతుంది.
Libra Marriage Life Rashifal
తులా రాశివారి వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. అత్తింటివారి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉుంటుంది. గుడ్ న్యూస్ వింటారు
పరిహారం: ప్రతి మంగళవారం దుర్గా సప్తశతి లేదా చండీ కవచాన్ని పఠించండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం