Bihar Govt Oath Taking: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బిగ్ అప్డేట్, మోదీ కోసం చూస్తున్న నేతలు
Bihar Election Result 2025 బిహార్ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించి అధికారం చేపడుతోంది. అయితే ప్రమాణ స్వీకారానికి మోదీ కోసం తేదీపై నిర్ణయం పెండింగ్ లో ఉంది.

Bihar Assembly Election Result 2025 | పాట్నా: బిహార్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీయూ, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో బిహార్2లో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 19 లేదా 20 తేదీల్లో జరపాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుబాటులో ఉండే తేదీ కోసం బిహార్ నేతలు ఎదరుచూస్తున్నారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. 2020తో పోలిస్తే జేడీయూ, బీజేపీలు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి.
డబుల్ సెంచరీ కొట్టిన ఎన్డీయే
బిహార్ అసెంబ్లీలోని 243 స్థానాలకు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 202 సీట్లతో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలో ఏర్పాటైన మహాఘట్‌బంధన్ కేవలం 35 సీట్లు గెలుచుకోగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) 5 సీట్లు గెలుచుకుని రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టింది.
ఈ ఫలితాలు బిహార్ ఓటర్ల స్పష్టమైన తీర్పును సూచిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ బలంగా పాతుకుపోయిందని, అభివృద్ది, మార్పు కోరుకుంటున్నారని ఇది తెలియజేస్తుంది. మహాఘట్‌బంధన్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం రాబోయే ఎన్నికలకు ఒక వ్యూహాత్మక పునరాలోచన అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





















