By: ABP Desam | Updated at : 18 Apr 2023 02:46 PM (IST)
విజయకుమార్ వచ్చింది అందుకే - తేల్చి చెప్పిన వైవీ సుబ్బారెడ్డి !
YV Subbareddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విజయ్ కుమార్ అనే మైసూర్‌కు చెందిన జ్యోతిష్య నిపుణుడు కలవడం వివాదాస్పదమవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనను సీఎం జగన్ లాబీయింగ్ కోసం దింపారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుక ువచ్చి కీలక ప్రకటన చేశారు. విజయ్ కుమార్ స్వామి సీఎం జగన్‌కు ఆశీర్వాదం ఇవ్వడానికే వచ్చారని.. స్పష్టం చేశారు. విజయ్ కుమార్ స్వామి అంటే అందరికి భక్తి భావమేనని అన్నారు. విజయ్ కుమార్ స్వామి వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం అందించారని చెప్పారు.
రామోజీరావు బంధువు విమానంలో విజయ్ కుమార్ స్వామి వచ్చాడన్న వైవీ సుబ్బారెడ్డి
విజయ్ కుమార్ స్వామి ఎవరి విమానంలో విజయవాడకు వచ్చారని ప్రశ్నించారు. విజయ్ కుమార్ స్వామి వచ్చిన విమానం రామోజీ బంధువేదనని అన్నారు. విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్‌కు వచ్చారని దుష్ప్రచారం చెయ్యడం మంచిది కాదని అన్నారు. స్వామిజీలు, దేవుళ్ల విషయంలో నీచ రాజకీయాలు వద్దని అన్నారు. వైఎస్ జగన్‌పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే కూలి పోవాలనేది కొంతమంది ఆలోచన అని మండిపడ్డారు. విజయ్ కుమార్ స్వామితో తనకు 2007 నుంచి పరిచయం ఉందని అన్నారు. ఎంతో మంది స్వామిజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆశీర్వాదాలు ఇప్పిస్తుంటానని చెప్పారు. విజయ్ కుమార్ స్వామి గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
జగన్‌ను ఆశీర్వదించడానికే ప్రత్యేక విమానంలో వచ్చారు !
విజయ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం గతంలో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితునిగా పదవి ఇచ్చింది. అయితే ఇలాంటి నియామకం చెల్లుబాటు కాదని ఆ జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అయినప్పటికీ విజయ్ కుమార్ టీటీడీలో కీలకంగా ఉంటున్నారు. వీఐపీ ప్రముఖులు వచ్చినప్పుడు ఆయనే దగ్గరుండి దర్శనాలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా వీఐపీలతో విజయ్ కుమార్ దిగిన ఫోటోలను చూపించి టీడీపీ నేతలు సీఎం జగన్ ఆయనను లాబీయింగ్‌కు తీసుకు వచ్చారని విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు.. ఆ స్వామిజీని రామోజీరావు బంధువులు కూడా గృహప్రవేశానికి పిలిచారనిచెబుతున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందన్న సుబ్బారెడ్డి
మరో వైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సంబంధించి విచారణ జరుగుతోందని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. కోర్టులు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ పక్షపాత ధోరణితో జరుగుతోందనేది కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. విచారణ వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఉండకూడదని అన్నారు. అవినాష్ రెడ్డి బయటపెట్టిన కొన్ని నిజాలను సీబీఐ పరిగణలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. అంతిమంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు.
APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన
GVL : ప్రధాని మోదీ విశ్వగురు - ఇప్పుడు భారత్ టాప్ 5 దేశం - గుంటూరులో జీవిఎల్ వ్యాఖ్యలు !
Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?