By: ABP Desam | Updated at : 18 Oct 2021 08:58 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ప్రకాశం జిల్లాలో రెండు హత్యలు జరిగాయి. నమ్మించి ఓ మహిళను ఇంట్లోకి రప్పించి అత్యాచారయత్నం చేశాడు ఓ నాటు వైద్యుడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో గొడ్డలితో నరికి చంపాడు. అయితే ఈ విషయం తెలిసిన గ్రామస్థులు నాటు వైద్యుడిని రాళ్లతో కొట్టి చంపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రకాశం జిల్లా కామేపల్లికి చెందిన ఓ మహిళ కూలీ పనుల కోసం వెళ్తుంది. ఆమె ఒంటరిగా వెళ్తున్న విషయాన్ని గమనించాడు ఓబయ్య అనే వ్యక్తి. ఆమెతో మాటమాట కలిపాడు. ఈ క్రమంలోనే తనకున్న మోకాళ్ల నోప్పుల గురించి చెప్పింది ఆ మహిళ. ఇదే అదునుగా భావించిన ఓబయ్య. మోకాళ్ల నొప్పులకు మందులిస్తా రమ్మంటూ.. ఇంట్లోకి పిలిచాడు. నిజమే అని నమ్మి వెళ్లింది మహిళ. అనంతరం ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించింది. ఈ విషయం బయటకు వస్తుందనే భయంతో కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.
జరుగుమల్లి ఎస్సై రజియా సుల్తానా హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ రక్తపు మడుగులో ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉండటం గమనించారు. వెంటనే ఓబయ్యను అదుపులోకి తీసుకుని పోలీసు జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే విషయం తెలిసిన గ్రామస్థులు.. ఓబయ్యను వాహనం నుంచి బయటకు లాగి మరీ కొట్టారు. అడ్డుకోబోయిన ఎస్సై రజియాను పక్కకు తోసేశారు. గ్రామస్థులు చేసిన దాడిలో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..
Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి
AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం
Land Registrations: ఏపీలో నేడూ భూరిజిస్ట్రేషన్లకి అంతరాయం, ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్న జనం
APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన
KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !
BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?
TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే