(Source: ECI/ABP News/ABP Majha)
Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..
తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని జయ లక్ష్మీ అనే వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగింది.
ఈ రోజుల్లో కొంతమందిలో రాన్రానూ మానవత్వం మంటగలిసి పోతోంది. అక్రమ సంబంధాల వలపులో పడి అయిన వారిని దూరం చేసుకుంటున్నవారు కొందరైతే.. ఇంట్లో వారినే మట్టుబెట్టేవారు ఇంకొందరు. అక్రమ సంబంధం పెట్టుకున్న పరాయి వ్యక్తితో కలిసి జీవిత భాగస్వామిని చంపేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది.
తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని జయ లక్ష్మీ అనే వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మహ్మద్ కైజర్‌తో కలిసి పథకం ప్రకారం తన భర్తను హతమార్చి ఆమె మిస్సింగ్ కేసుగా నమోదు చేసింది. స్థానికంగా రామయ్య అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, అతని భార్య జయలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహ్మద్ కైజర్‌తో గత రెండు సంవత్సరాల నుంచి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది.
Also Read: భర్త పెదాలను కోసేసిన భార్య ! ఇది వికటించిన సరసం కాదు.. ఎందుకంటే ?
ఈ విషయం తెలిసిన భర్త గతంలో కొన్ని సార్లు మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హతమార్చడానికి భార్య పక్కా ప్రణాళిక రచించింది. సెప్టెంబర్ 13వ తేదీన భర్త గొంతుకు టవల్ బిగించి చంపేసింది. అనంతరం ప్రియుడితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని హంద్రీ - నీవా కాలువలో పడవేసి మాయం చేశారు. అయితే భర్త కనిపించడం లేదని పోలీసులకు వద్దకు వెళ్లి తప్పుడు కేసు పెట్టింది. తొలుత కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.
Also Read: సామూహిక అత్యాచారమా? ప్రేమ వ్యవహారమా? నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన కేసు
విచారణలో వారి గుట్టు మొత్తం బయటపడిందని పోలీసులు తెలిపారు. జయలక్ష్మి కూతురు అయిన చందన కొడుకు శేఖర్.. హత్య జరిగే సమయంలో ఆ ఘటన చూసినట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతదేహం కోసం ఓర్వకల్లు ఎస్ఐ మల్లికార్జున, నాగలాపురం ఎస్సై ప్రేమ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి, ఓర్వకల్లు ఎస్సై మల్లిఖార్జున తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య