అన్వేషించండి

Wife Cuts Husband Lips : భర్త పెదాలను కోసేసిన భార్య ! ఇది వికటించిన సరసం కాదు.. ఎందుకంటే ?

ఫోన్ తిరిగి ఇవ్వలేదని ఓ భార్య తన భర్త పెదాలను కట్ చేసేసింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది.


" ముక్కు కోస్తా "  అని సరదాగా మనం పిల్లల్ని హెచ్చరిస్తూనే ఉంటాం. కానీ నిజంగా ముక్కు కోస్తామా ?.  ఏం చేసినా కోయలేం. కానీ కొంత మంది భార్యలు ఉంటారు.  వారు పిల్లల్ని ఏమీ అనరు కానీ... భర్త దగ్గరకు వచ్చే సరికి.. ఏదైనా కోసేస్తామని రంగంలోకి దిగిపోతారు. అవి హెచ్చరికలు మాత్రమే కాదు చేతల్లో కూడా అంతే. గతంలో చాలా ఘటనలు జరిగి ఉండవచ్చు కానీ..  ముంబైలో జరిగిన ఈ ఘటన మాత్రం స్పెషల్. ఎందుకంటే భర్త పెదాల్ని భార్య కోసేసింది. 

Also Read : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య... మామను చంపిన కోడలు...

ముంబైలో తన భార్యతో కలిసి నివసించే ఖేమ్‌రాజ్ బాబూరావ్ ముల్ అనే మధ్య తరగతి వ్యక్తి హడావుడిగా ఆస్పత్రికి వచ్చాడు. మూతికి గుడ్డ కట్టుకుని మరీ వచ్చాడు. ఏంటా అని వైద్యులు చూస్తే పెదాలు కట్ అయిపోయి ఉన్నాయి. వెంటనే డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేశారు. ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో ఉన్నా ..మాటా మాటా పెగుల్చుకుని చెప్పాడు. అది విని డాక్టర్లకు మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఆ పెదాలు కత్తిరించింది అతి భార్యేనట. ఎందుకు కత్తిరించిందో  కూడా వైద్యులు.. పోలీసుల్ని కూడా పిలిపించి మెల్లగా చెప్పించారు. 

Also Read: సామూహిక అత్యాచారమా? ప్రేమ వ్యవహారమా? నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన కేసు

బాబూరావు భార్యకు పెదాలు కత్తిరించేంత కోపం ఎందుకు వచ్చిందంటే.. సెల్ ఫోన్ కోసమట. తీసుకున్న సెల్ ఫోన్ ఇవ్వలేదని కోపంతో భార్య దాడి చేసింది. ఆ దాడిలో అతని పెదాలు కట్ అయిపోయాయి. అయితే పాపం బాబూరావుకు ఇక్కడ అనుమానం జబ్బు లేదు. భార్యపై అనుమానంతో ఫోన్ చెక్ చేయడానికి ఆ ఫోన్ తీసుకోలేదు. అతని ఫోన్ పగిలిపోయింది. అర్జంట్‌గా అతనికి ఫోన్ కావాల్సి వచ్చింది. కొత్తది కొనడానికి డబ్బుల్లేవు. ఇక ఏంచేయాలి... రెండు రోజులు వాడుకుని ఇస్తానని భార్య ఫోన్ తీసుకున్నాడు. కానీ తిరిగి ఇవ్వలేదు. 

Also Read : గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం

రెండు రోజుల్లో తిరిగి ఇస్తానని తన ఫోన్ ఇవ్వలేదని.. తనకు కావాల్సిందేనని బాబూరావు భార్య పట్టుబట్టింది. కానీ తనకు ఉద్యోగరీత్యా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి అవసరమని.. ఇవ్వలేనని బాబూరావు అన్నారు. ఆ సమాధానం నచ్చలేదు. అంతే దాడి చేసింది. పెదాలు తెగిపోయాయి. ఇప్పుడు ఫోన్ కన్నా ఎక్కువ నష్టం జరిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget